
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. నవంబర్ 9న జరిగే ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గానూ 337 మంది అభ్యర్థులు తుది బరిలో నిలిచారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, అమిత్ షా, కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు.
కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో భారీ ఎత్తున నగదు, మద్యంతో పాటు బంగారం పట్టుబడ్డాయి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.1.38కోట్ల నగదు, 6లక్షల లీటర్ల మద్యాన్ని ఎన్నికల ప్రత్యేక నిఘా, నిధుల పర్యవేక్షణ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment