‘చేతి’లోనే అభివృద్ధి
Published Thu, Nov 21 2013 11:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిని మరింత అభివృద్ధి చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేర్కొన్నారు. ఢి ల్లీ నగర సమగ్ర అభివృద్ధికి తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కశ్మీరీగేట్‌లోని త్రిలోక్‌పార్క్‌లో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. చాందినీచౌక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. ఢిల్లీలో ఉపాధి అవకాలు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఇక్కడే స్థిరపడుతున్నారన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలూ తమ ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు.
ఢిల్లీలోని పాత నగర వైభవాన్ని కాపాడుతూనే ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పాతబడ్డ మంచినీటి పైపులైన్ల పునరుద్ధరణ ఇప్పటికే కొసాగుతోందని వివరించారు. డిసెంబర్ నాలుగున జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందన్న న మ్మకం తనకు ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే ఏ సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె ప్రకటించారు. నగరంలో అభివృద్ధితోపాటు శాంతి నెలకొనాలంటే మరోమారు కాంగ్రెస్‌నే గెలిపించాలని స్థానిక ఓటర్లకు పిలుపునిచ్చారు. చాందినీచౌక్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రహ్లాద్‌సింగ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని షీలా దీక్షిత్ కోరారు.
సారథి షీలాయే!
ఎన్నికల ప్రచార సారథిగా సీఎం షీలా దీక్షిత్‌ను ఎంచుకోవాలని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ గురువారం నిర్ణయించుకుంది. వచ్చే నెల నాలుగు జరిగే ఎన్నికల్లో విజయం కోసం గత 15 ఏళ్లుగా ఆమె సాధించిన విజయాలు వివరించాలని భావిస్తోంది. ఎన్నికల ప్రచారం వ్యూహం ఖరారు కోసం కాంగ్రెస్ 87 మంది సభ్యులతో నియమించిన ప్రచార కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డీపీసీసీ కార్యాలయంలో నిర్వహిం చిన ఈ కార్యక్రమానికి షకీల్ అహ్మద్ వంటి సీనియర్లు హాజరయ్యారు. పార్టీలోని ప్రముఖ ప్రచారకర్తల హాజరు కోసం విజ్ఞప్తులు పంపాలని కూడా కమిటీ అభ్యర్థులకు సూచించింది. ఢిల్లీలో పేదల సంక్షేమం గురించి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవ ర్ధన్ ఎక్కడా ప్రస్తావించడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఢిల్లీ నగరానికి మెట్రోరైలు, 24 గంటల నీటి సరఫరా, ఫ్లై ఓవర్ల వంటి సదుపాయాలు కల్పించిన ఘనత తమదేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. తాము నాలుగోసారి విజయం సాధించడం ఖాయమన్నారు.
Advertisement
Advertisement