న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా అస్తమయంపట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మండే లా జీవితం ప్రపంచ వ్యాప్తంగా హక్కుల పోరాట కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలి చిందన్నారు. నిజమైన గాంధేయవాది,ప్రపంచ విశిష్ట నాయకుల్లో ఒకడైన నెల్సన్ మండేలాను యావత్తు భారత జాతి గౌరవిస్తుందని, వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన రాజీలేని పోరాటం భారత జాతి చిరకాలం గుర్తుంచుకుంటుందన్నారు.
మండేలా సాగించిన పోరాటమే ఆయనను దక్షిణాఫ్రికా నేతగా నిలబెట్టిందని, సమానత్వం, స్వేచ్ఛల కోసం ఆయన సాగించిన పోరాటం ఆదర్శనీయమన్నారు. మండేల భార త జాతికి విశ్వసనీయ నేస్తమని తన సంతాప సందేశంలో పేర్కొంది. మండేలా అస్తమయం పట్ల ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా సంతా పం ప్రకటించింది. ప్రపంచం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం సల్పి ఆఫ్రికా ప్రజల కు జీవితాన్ని, గౌరవాన్ని ఇచ్చిందని, ప్రపంచ వ్యాప్త అభ్యుదయ వాదులకు ఆయన జీవితం ఆదర్శమని ఆ పార్టీ కార్యదర్శి జీ దేవరాజన్ పేర్కొన్నారు.
మండేలామృతికి షీలా సంతాపం
Published Sat, Dec 7 2013 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement