
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పోరాటయోధుడు నెల్సన్ మండేలా మాజీ భార్య విన్నీ మడికిజెల మండేలా(81) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న విన్నీ ఇక్కడి నెట్‌కేర్ మిల్‌పార్క్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నెల్సన్ మండేలా, విన్నీ 1958, జూన్ 14న పెళ్లిచేసుకున్నారు.
శ్వేతజాతీయులపై పోరాటంలో వీరిద్దరూ కలసి పాల్గొన్నారు. మండేలాకు 27 ఏళ్ల జైలుశిక్ష పడ్డప్పుడు ఇద్దరు కుమార్తెల బాధ్యతల్ని భుజాలపై వేసుకున్న విన్నీ ఉద్యమాన్ని నడపడంలో కీలకంగా వ్యవహరించారు. ఆమె దక్షిణాఫ్రికా కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రిగా పనిచేశారు. 1996లో మండేలా, విన్నీలు విడాకులు తీసుకున్నారు
Comments
Please login to add a commentAdd a comment