winnie mandela
-
మండేలా మాజీ భార్య విన్నీ కన్నుమూత
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పోరాటయోధుడు నెల్సన్ మండేలా మాజీ భార్య విన్నీ మడికిజెల మండేలా(81) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న విన్నీ ఇక్కడి నెట్‌కేర్ మిల్‌పార్క్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నెల్సన్ మండేలా, విన్నీ 1958, జూన్ 14న పెళ్లిచేసుకున్నారు. శ్వేతజాతీయులపై పోరాటంలో వీరిద్దరూ కలసి పాల్గొన్నారు. మండేలాకు 27 ఏళ్ల జైలుశిక్ష పడ్డప్పుడు ఇద్దరు కుమార్తెల బాధ్యతల్ని భుజాలపై వేసుకున్న విన్నీ ఉద్యమాన్ని నడపడంలో కీలకంగా వ్యవహరించారు. ఆమె దక్షిణాఫ్రికా కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రిగా పనిచేశారు. 1996లో మండేలా, విన్నీలు విడాకులు తీసుకున్నారు -
మండేలా కోలుకుంటున్నారు: విన్నీ మండేలా
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల సూరీడు నెల్సన్ మండేలా కోలుకున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చికిత్స పొందిన ఆయన ఇప్పుడు మామూలుగా ఊపిరి తీసుకోగలుగుతున్నారని ఆయన మాజీ భార్య విన్నీ మాడికిజెలా మండేలా తెలిపారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, దాదాపు అంత్యదశలో ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. వాస్తవాలను దాచాల్సిన అవసరం తమకు లేదన్నారు. పిల్లలు ఆయన్ను చూడటానికి వెళ్లినప్పుడు ఆయన కళ్లలో మెరుపు కనిపించిందని బ్రిటిష్ స్కై న్యూస్ చానల్ వర్గాలకు ఆమె చెప్పారు. ప్రస్తుతానికి ఆయనింకా మాట్లాడటం లేదని, సైగల ద్వారానే అన్నీ చెబుతున్నారని అన్నారు. ప్రిటోరియా ఆస్పత్రి వైద్యులు అద్భుతంగా చికిత్సలు అందించారని, వారి సేవల వల్లే ఆయన కోలుకున్నారని అన్నారు. మండేలా ఆరోగ్యం గురించి ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తలు మాత్రం తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధించాయని విన్నీ తెలిపారు. ఇది చాలా క్రూరమైన విషయమని, మండేలా అంత్యక్రియలకు కూడా కొంతమంది ఏర్పాట్లు చేసేశారని.. తమ మనోభావాలను కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరా అని ఆమె ఆక్రోశించారు.