న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. త్రిపురకు బదిలీ అయిన మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ తన పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజు షీలా రాష్ట్రపతిని కలవడం గమనార్హం.
రాష్ట్రపతితో భేటీలో రాజీనామా గురించి ప్రస్తావన వచ్చిందా అన్న విషయాన్ని చెప్పేందుకు షీలా నిరాకరించారు. ఢిల్లీకి వచ్చినప్పుడల్లా రాష్ట్రపతిని కలుస్తుంటానని మాజీ ముఖ్యమంత్రి అయిన షీలా చెప్పారు. కాగా సోమవారం ఉదయం ఆమె కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు వైదొలుగుతున్న నేపథ్యంలో షీలా ఢిల్లీ పర్యటన పలు ఊహాగానాలకు తెరలేపింది.
రాష్ట్రపతితో షీలా దీక్షిత్ భేటీ
Published Mon, Aug 25 2014 9:40 PM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM
Advertisement
Advertisement