షీలా దీక్షిత్
తిరువనంతపురం: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో నియమితులయిన గవర్నర్లకు కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఉద్వాసన పలుకుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ పదవి నుంచి వైదొలగాలా వద్దా అని షీలా దీక్షిత్ తొలుత డైలామాలో పడ్డారు. ఆ తరువాత రాజీనామా చేయడానికి ఆమె నిరాకరించారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమై రాజీనామా విషయం చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. చివరకు ఈరోజు రాజీనామా చేశారు.
షీలా దీక్షిత్ సుదీర్ఘకాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం అనంతరం యూపీఏ ప్రభుత్వం ఆమెను కేరళ గవర్నర్గా నియమించింది.