షీలాదీక్షిత్ సర్కారు పాలనలో మహిళలకు భద్రత కరువైందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఆరోపించారు.
న్యూఢిల్లీ: షీలాదీక్షిత్ సర్కారు పాలనలో మహిళలకు భద్రత కరువైందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈ నెల 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రజలంతా నిర్భయపై గ్యాంగ్‌రేప్, హత్య ఘటనను గుర్తుచేసుకోవాలని సూచించారు. ఆదివారం ఇక్కడి అంబేద్కర్ నగర్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ ‘అత్యాచార రాజధానిగా ఢిల్లీ అపఖ్యాతిని మూటగట్టుకుంది. మీరు ఓటు వేసేటప్పుడు ఈ విషయాన్ని మరచిపోకండి. నిర్భయను ఓసారి గుర్తుచేసుకోండి’ అని వ్యాఖ్యానించారు.