ఆశలన్నీ ఆయనపైనే..
Published Fri, Nov 29 2013 11:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి,న్యూఢిల్లీ :నరేంద్ర మోడీ...ఈ పేరు వింటేనే ఢిల్లీ కాం గ్రెస్ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. బీజే పీ ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ ప్రధాన ఆకర్షణగా నిర్వహించనున్న ర్యాలీలతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం కాంగ్రెస్ నేతల గుబులుకు కారణమవుతోంది. ఢిల్లీ విధానసభ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. జాతీయస్థాయి నాయకులను ప్రధాన ఆకర్షణగా పెట్టి ఢిల్లీవాసుల ఓట్లు కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఢిల్లీలో ఈనెల 23న ద్వారక సెక్టార్-14లో నిర్వహించిన ర్యాలీ విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది.
నరేంద్రమోడీ వారం తర్వాత శనివారం మరోమారు ర్యాలీల్లో పాల్గొంటుండడంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం రెట్టించింది. శనివారం మోడీ ర్యాలీలకు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రచార ప్రభావం ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో పనిచేయకుండా చేసేం దుకు ఏయే అస్త్రాలు ప్రయోగించాలో తెలియక ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ సతమతమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రధానిగా చెప్పుకుంటున్న రాహుల్‌గాంధీ సభలకు జనం పలుచగా రావడం ఆపార్టీ నేతలను కలవరానికి గురిచేసింది. లాభం లేదనుకున్న పార్టీ నాయకులు సోని యాగాంధీతో సభ నిర్వహించి కాస్త పరువు నిలుపుకున్నారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం పాల్గొనున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
‘ఆప్’పై ఎక్కుపెట్టేనా..!
ఇప్పటి వరకు నిర్వహించిన సభల్లో కేవలం కాంగ్రెస్‌పై విమర్శలతోనే సరిపెట్టిన నరేంద్ర మోడీ ఈసారి ఆమ్‌ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకోనున్నట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా ఆమ్‌ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కే జ్రీవాల్‌పై వస్తున్న ఆరోపణలు మోడీకి అస్త్రాలుగా మారనున్నాయి. ఢిల్లీ విధానసభ ఎన్నికల గడువు దగ్గరపడుతున్నందున కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీపై నరేం ద్ర మోడీ విమర్శల దాడి పెంచవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి ఢిల్లీ రాజకీ యాల్లో ఆప్ కీలకశక్తిగా అవతరిస్తుందని పలు సర్వే లు ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో అటు కాం గ్రెస్, ఇటు బీజేపీ ఆందోళనకు గురవు తున్నాయి. అందుకే ప్రతిచోటా ఇవి ఆప్, ఆర్వింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్‌పాల్ బిల్లు కోసం కేటాయించిన నిధులను ప్రచారం కోసం వాడుకుం టున్నట్టు వచ్చిన ఆరోపణలు కేజ్రీవాల్‌కు ఇబ్బంది కలిగించాయి. ప్రచారంలో తన పేరును వాడు కోవద్దంటూ అన్నా హజారే కేజ్రీవాల్‌కు లేఖ రాయడం తెలిసిందే.
మోడీ ప్రచారం సాగేది ఇలా:
శనివారం ఉదయం 11 గంటలకు పాతఢిల్లీలోని షహద్రాలోని సీబీడీ గ్రౌండ్‌లో ర్యాలీలో పాల్గొం టారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఔటర్‌ఢిల్లీలోని సుల్తాన్‌పురి, జిలేబీ చౌక్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదింటికి చాందినీచౌక్‌లోని పరేడ్ గ్రౌండ్స్ సమావేశానికి వెళతారు. ఆదివారమూ మోడీ సభ కొనసాగనుంది. సాయంత్రం నాలుగింటికి అంబేద్కర్‌నగర్‌లోని దక్షిణ్‌పురి విరా ట్ సినిమా ప్రాంతంలో బహిరంగ సభలో పాల్గొం టారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
Advertisement