మినీ భారతదేశంలా 'ఢిల్లీ':రాహుల్ గాంధీ | Delhi is a city of migrants, says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

మినీ భారతదేశంలా 'ఢిల్లీ':రాహుల్ గాంధీ

Published Sun, Nov 17 2013 3:38 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మినీ భారతదేశంలా 'ఢిల్లీ':రాహుల్ గాంధీ - Sakshi

మినీ భారతదేశంలా 'ఢిల్లీ':రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వలసల నగరంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. డిసెంబర్ 4 వ తేదీన ఢిల్లీలో ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నగరంలో వలసల కారణంగా జనాభా పెరిగినట్లు రాహుల్ తెలిపారు. ఇదొక చిన్న భారత దేశంలా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని అనివార్య పరిస్థితులు ఢిల్లీ నగరానికి వలసలు వస్తుంటారని, తమ కుటుంబుం కూడా ఆ రకంగానే ఢిల్లీకి వచ్చిందని తెలిపారు.

 

తొలుత తన కుటుంబం కాశ్మీర్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ వచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం ఢిల్లీకి తాము కూడా వలసలగానే వచ్చామని రాహుల్ అన్నారు.  ప్రతి ఒక్కరూ ఇలా వచ్చే ఇక్కడ స్థిరపడ్డారన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను మరోసారి ఎన్నికల్లో గెలిపించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. వలసల కారణంగానే ఢిల్లీ నగరంలో అత్యాచారాలు జరుగుతున్నాయని షీలాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిని ఖండించిన ఆయన ఢిల్లీ రాష్ట్రాన్ని షీలా అభివృద్ది పథంలో నడింపిచారన్నారు. షీలా ప్రభుత్వంలో రాష్ట్రం  రోజు రోజుకూ మార్పు చెందుతూ ముందుకు వెళుతున్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు అంగీకరించక తప్పదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement