సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(81) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేరళ గవర్నర్‌గా షీలా దీక్షిత్ పని చేశారు. 1998 నుంచి 2013 వరకు ఆమె ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 2014 మార్చి నుంచి ఆగస్టు వరకు కేరళ గవర్నర్‌గా సేవలు అందించారు. సార్వత్రిక ఎన్నికల ముందే ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన షీలా దీక్షిత్.. ఈశాన్య ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి చేతిలో ఓడిపోయారు. షీలా దీక్షిత్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment