అత్యాచార బాధితులను ఆదుకునేందుకు ట్రస్ట్
Published Mon, Dec 16 2013 8:39 PM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
అత్యాచార బాధితులను ఆదుకునేందుకు నిర్భయ జ్యోతి ట్రస్ట్ ను నిర్భయ తల్లి ప్రారంభించారు. గత సంవత్సరం దేశ రాజధానిలో 23 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ నిర్భయ అత్యాచారం ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో కాన్ స్ట్యూషన్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు నిర్బయ తల్లి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, బీజేపీ నేత సుష్మా స్వరాజ్, బాలీవుట్ నటి షబానా ఆజ్మీలతోపాటు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.
అత్యాచార బాధితుల కోసం ట్రస్్్ ఏర్పాటు చేస్తున్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తాం అని నిర్భయ తల్లి తెలిపారు. షీలా దీక్షిత్, షబానా ఆజ్మిల ఎదుట నిర్భయ తల్లి భోరున విలపించింది. నిర్భయ తల్లి తండ్రులకు పలువురు సంతాపం తెలిపారు. డిసెంబర్ 16 తేదిన అత్యాచారానికి గురైన 'నిర్భయ' మృత్యువుతో పోరాడుతూ డిసెంబర్ 29 తేదిన తుది శ్వాస విడిచారు.
Advertisement