
దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్‌ఠాకూర్ (28), పవన్ గుప్తా (19), వినయ్‌శర్మ (20) లను ఢిల్లీలోని తీహార్ జైల్లో 2020 మార్చి 20న ఉరి తీశారు. 2012 డిసెంబర్ 16 న దేశ రాజధాని ఢిల్లీలో ఒక వైద్య విద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు.
ఆ సంఘటనలో తల, పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 2012 డిసెంబరు 29 న ఆమె తుదిశ్వాస విడిచారు. ఏడేళ్ల పాటు జరిగిన ఈ కేసు విచారణ కాలంలో ఆరుగురు నిందితులలో ఒకరు చనిపోగా, మరొకరు మైనరు కావడంతో అతడికి ఉరి నుంచి మినహాయింపు లభించింది.
‘2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం’గా వార్తల్లో ఉన్న ఆ ఘటనలో దేశం మొత్తం ఆ యువతి కుటుంబం తరఫున నిలబడింది. యువతి తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లి ఆషాదేవి చేసిన న్యాయపోరాటం ఫలించి చివరికి దోషులకు ఉరి అమలయింది.
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
- ఇండియాలోకి కోవిడ్–19 వ్యాప్తి. తొలి కేసు జనవరి 20న కేరళలో నిర్థారణ.
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను నిషేధించిన భారత్. ఆ తర్వాత పబ్జీ సహా మరో 118 చైనా యాప్‌ల నిషేధం.
- నేషనల్ ఎడ్యుకేషన పాలసీ–2020 కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం.
- ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, చేతన్ చౌహాన్, ప్రణబ్ ముఖర్జీ, జయప్రకాశ్ రెడ్డి, రామ్‌విలాస్ పాశ్వాన్.. కన్నుమూత.
(చదవండి: సమర కవి: సుబ్రహ్మణ్య భారతి/ 1882-1921)
Comments
Please login to add a commentAdd a comment