న్యూఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా బీజేపీ, ఆప్ పార్టీల మధ్య పోటాపోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది.15 మంది బీజేపీ అభ్యర్థులు అధిక్యంలో ఉండగా, ఆప్ పార్టీ అభ్యర్థులు 13 మంది విజయపథంలో దూసుకుపోతున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరుగురు ముందంజలో ఉన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్ కూడా కృష్ణ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా విజయం వైపు దూసుకుపోతున్నారు.
అయితే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన షీలా దీక్షిత్ సమీప ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ కంటే అధిక్యంలో కొనసాగుతున్నారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు ఐదుగురు అధిక్యంలో ఉన్నారు.