Delhi Assembly Elections result
-
ఢిల్లీ కాంగ్రెస్లో కల్లోలం.. పార్టీ ఇన్ఛార్జ్ రిజైన్
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చిచ్చుకు కారణమవుతున్నాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, సీనియర్ నేత అయిన చాకో మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి మాజీ సీఎం షీలా దీక్షిత్ కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2013లో షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పతనం మొదలయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుందన్నారు. పోయిన ఓటు బ్యాంకు తిరిగి పార్టీకి రాలేదని, ఆ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఆప్తో ఉందని ఆయన పేర్కొన్నారు. పీసీ వ్యాఖ్యలపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ దేవర చాకో వ్యాఖ్యలతో విభేదించారు. నిజానికి షీలా అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగిందని మిలింద్ దేవర అభిప్రాయపడ్డారు. (ఆమ్ ఆద్మీ అందగాడు గెలిచేశాడు..!) ఆమె మరణాంతరం ఢిల్లీలో పార్టీ ఓటమికి షీలాను నిందించడం సరికాదన్నారు. ఆమె పార్టీకి, ఢిల్లీ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన పేర్కొన్నారు. కాగామొత్తం 70 స్థానాలకు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో విజయం సాధించి మూడో సారి అధికార పగ్గాలు చేపట్టగా.. బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ 2015 మాదిరిగానే ఖాతా తెరవలేక ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. (హస్తిన తీర్పు : ఆప్ 62.. బీజేపీ 8) -
ఆమ్ ఆద్మీ అందగాడు గెలిచేశాడు..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి గందరగోళం, ఉత్కంఠ లేదు. వార్ వన్ సైడ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించిన ఫలితాలతో సామాన్యుడి ఆమ్ ఆద్మీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలోని మొత్తం70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాగా.. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాఘవ్.. బీజేపీ అభ్యర్థి ఆర్పీ సింగ్పై 20వేల 58ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. (హస్తిన తీర్పు : ఆప్ 62.. బీజేపీ 8) ఎన్నికల ప్రచారం సమయంలో రాఘవ్ చద్దాకు వింత అనుభవాలు ఎదురైన సంగతి తెల్సిందే. ఎన్నికల ప్రచారం సమయంలో ఓటర్ల నుంచి నియోజకవర్గ సమస్యల గురించి వినతులు వస్తుంటాయి. కానీ, రాఘవ్ చద్దాకు మాత్రం పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. ఆయన ప్రచారంలో పాల్గొన్న సమయంలో..'మీరు చాలా బాగున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఓ మహిళా ఫాలోవర్ చద్దాకు ప్రపోజ్ చేయగా, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగాలేనందున పెళ్లి చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని చద్దా తెలివిగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఆయన ఓ స్కూల్కు వెళ్లగా అక్కడున్న టీచర్ ఒకరు తనకు కుమార్తె ఉంటే మీకిచ్చి వివాహం చేసేదాన్నని చద్దాతో చెప్పుకొచ్చారని ఆయన సోషల్ మీడియా బృందం పేర్కొంది. (ఓటు కోసం వెళితే పెళ్లి ప్రపోజల్స్..) ఇక ‘మీకు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నా మీరు పెళ్లి మాత్రం చేసుకోవద్దని అలా చేస్తే తన గుండె ముక్కలవుతుంద’ని ఓ మహిళ ఆప్ నేత ఇన్స్టాగ్రాంలో ఆయనను వేడుకున్నారు. ట్విటర్లో మరో మహిళ చద్దాను ఉద్దేశించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎరౌండ్ అంటూ ఓ స్టోరీని షేర్ చేశారు. సీఏగా కెరీర్ ప్రారంభించిన రాఘవ్ చద్దా తరువాత రాజకీయాలోకి ప్రవేశించారు. తదనంతరం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో అతను గెలుపొందడంతో, ఇదంతా ఆ అమ్మాయిల వల్లే అంటూ కొందరు చమత్కరిస్తున్నారు. -
న్యూఢిల్లీలో బీజేపీ, ఆప్ల మధ్య పోటాపోటీ
న్యూఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా బీజేపీ, ఆప్ పార్టీల మధ్య పోటాపోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది.15 మంది బీజేపీ అభ్యర్థులు అధిక్యంలో ఉండగా, ఆప్ పార్టీ అభ్యర్థులు 13 మంది విజయపథంలో దూసుకుపోతున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరుగురు ముందంజలో ఉన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్ కూడా కృష్ణ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా విజయం వైపు దూసుకుపోతున్నారు. అయితే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన షీలా దీక్షిత్ సమీప ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ కంటే అధిక్యంలో కొనసాగుతున్నారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు ఐదుగురు అధిక్యంలో ఉన్నారు.