Indian National Congress
-
ఇక సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం పోరాటం
ఊహించినట్లుగానే, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)–ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) కూటమి చక్కటి మెజారిటీతో నూతన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమ స్యాత్మకమైన పూర్వ రాష్ట్రం కోసం మనం ఏమి ఆశించగలం? మొదటి ప్రశ్న ఏమిటంటే, కొత్త ప్రభుత్వాన్ని సజావుగా పనిచేయడానికి అనుమతి స్తారా అనేది. లెఫ్టినెంట్ గవర్నర్ నిరంతరం ఎన్నికైన ప్రభుత్వానికి ఆటంకం కలిగించే విధంగా ఢిల్లీ తరహా పరిస్థితిని సృష్టిస్తారా అనే అనుమానం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ ప్రభుత్వ విషయంలో బహిరంగంగా చేసినట్లు కాకుండా, 2015–2018 మధ్య పీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు చేసినట్లుగా రహస్యంగానే వ్యవహరించే అవకాశం ఉందని నమ్ముతున్నాను. ఆ మూడేళ్ళలో వారు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తలపెట్టిన ప్రజల మధ్య వారధిని నిర్మించే ప్రయత్నాలను అడ్డుకున్నారు. పైగా విడిపోయిన వర్గాలను ప్రేరేపించడానికి పీడీపీ మంత్రులు, శాసనసభ్యులతో తమ కొత్త సంబంధాలను ఉపయోగించారు. వారు ఆ విధానాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తే, ఎన్సీ–ఐఎన్‌సీ కూటమి భాగస్వాములకు రెట్టింపు భారం ఉంటుంది. అదేమిటంటే ఎన్నికైన ప్రభుత్వంలా కొంత అధికారాన్ని నిలుపుకోవడం, వారి ఎమ్మెల్యేలను కలిపి ఉంచడం.కూటమికి ఈ రెండు పనులు సమాన ప్రాధాన్యం కలిగినవే. అయితే ఓటర్లు మొదటి కర్తవ్యం వైపే ఎక్కువగా చూస్తారు. ఇది నిజ సమయంలో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో విధాన రూపకల్పననూ, దాని అమలును చేపట్టడంతోనూ ముడిపడి ఉంటుంది. దాంతోపాటు అలా చేయడానికి అధికా రాన్ని పొందే పోరాటం కూడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిసేపటి ముందు ప్రకటించిన కొత్త పాలనా నియమాల ప్రకారం... భద్రత, ఆర్థిక వ్యవహారాలు, పోలీసు శాఖతోపాటు బ్యూరోక్రసీపై అన్ని కీలక అధికారాలు ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌కి దఖలుపడ్డాయి. కొత్త ప్రభుత్వ యంత్రాంగం మునిసిపాలిటీ స్థాయికి తగ్గింది. కొత్త ప్రభుత్వం... చిన్నదా పెద్దదా అనే అంశంతో నిమిత్తం లేకుండా ప్రతి అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంతో ఘర్షించవలసి ఉంటుంది.స్వతంత్ర మీడియా, భిన్నాభిప్రాయాలు లేదా నిరసన తెలిపే హక్కు వంటి ప్రాథమిక పౌర హక్కులను కాపాడాలని ఎన్నుకోబడిన ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రస్తుతం వాటికి అనుమతి లేదు. భద్రత అనేది ఘర్షణకు ప్రధాన మూలంగా ఉంటుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద వందలాది ఏకపక్ష కేసులు ఉన్నాయి. వాటికి తక్షణ పరిష్కారం అవసరం. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో ప్రజా భద్రతా చట్టాన్ని రద్దు చేస్తామని వాగ్దానం చేసింది. అయితే అలా చేయడానికి వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. సుప్రీం కోర్ట్ 2023 డిసెంబర్లో ఇచ్చిన తీర్పులో సిఫార్సు చేసిన విధంగా పూర్తి రాష్ట్ర హోదాను త్వరగా పున రుద్ధరించడం ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. ఆర్టికల్ 370 పిటిషన్లపై 2023 నాటి సుప్రీంకోర్టు విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన ప్రకటన ప్రకారం... మోదీ పరిపాలన పూర్తి పునరుద్ధరణ కంటే దశలవారీగా పునరుద్ధ రణ దిశగా ఆలోచిస్తోంది. దశల వారీ విధానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోని పక్షంలో, పూర్తి రాష్ట్ర హోదా కోసం ఉద్యమం అనేది ప్రతి చిన్న అధికారానికి సుదీర్ఘకాలంపాటు సాగే దశల వారీ పోరాటం కావచ్చు.చట్టపరంగా, దశలవారీగా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు వ్యతిరేకంగా చేస్తున్న వాదన బలంగా ఉంది. రాష్ట్ర హోదా పునరుద్ధరింపబడుతుందని చెప్పినందున రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి తగ్గించవచ్చా అనే దానిపై కోర్టు తీర్పు ఇవ్వలేదు. సొలిసిటర్ జనరల్ ప్రకటించిన దశల వారీగా పునరుద్ధరణను ఎందుకు సవాలు చేయలేదు అనేది ఎవరికి వారు అంచనా వేసుకోవలసిందే. కానీ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం స్థాయికి తగ్గించలేకపోతే, రాష్ట్ర హోదాను దశలవారీగా పునరుద్ధరించడం సాధ్యం కాదని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర హోదా కోసం ఇటీవల ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లో ఇది ఇప్పటికే లేవనెత్తక పోయి ఉంటే... ఇది రాజ్యాంగపరమైన సమస్య అవుతుంది.నిరుద్యోగం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే జమ్మూ కశ్మీర్లో చాలా ఎక్కువగా ఉంది. కొత్త భూసేకరణ నిబంధనల నుంచి స్థానిక కంపెనీలకు కాకుండా జాతీయ సంస్థ లకు మైనింగ్, వినియోగ వస్తువులు, పర్యాటక లైసెన్సుల మంజూరు వరకు గత ఐదేళ్లలో చేపట్టిన చాలా విధానాలను సమీక్షించి, అవసరమైన చోట వాటిని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది.కేంద్ర ప్రభుత్వ పెద్దలు, లెఫ్టినెంట్ గవర్నర్ తెలివైన వారైతే, కొత్త ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉండి, అది నాయకత్వం వహించడానికి అనుమతిస్తారు. అయితే, ఈ ప్రభుత్వం తాను నిర్వహించాల్సిన విధులను నెరవేర్చడంలో విఫలమైతే, తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లు బీజేపీనీ లేదా మరింత అనుకూలమైన ప్రాంతీయ వర్గాలనూ ఆశ్రయించవచ్చనే భావనతో ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకునే ప్రలోభం కూడా ఉండవచ్చు.మొత్తం మీద కొత్త ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రజలకూ రాబోయే రోజులు కీలకం కానున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లేదా ఢిల్లీలో తన తోటి గవర్నర్లు ఆడిన గేమ్‌లు... ఈ అస్థిరమైన సరిహద్దు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ అర్థం చేసుకుంటారని మనం ఆశించాలి. ఇక్కడ పాకిస్తాన్ ఆధారిత సాయుధ సమూహాలు ఏ చిన్న తప్పునుంచైనా ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తాయి. అది నిజంగానే జాతీయ ప్రయోజనాలకు భంగకరం.రాధా కుమార్ వ్యాసకర్త ‘ప్యారడైజ్ ఎట్ వార్: ఎ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్’ రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో...) -
సీఎం స్టాలిన్ కు ఖర్గే ఫోన్..!
-
పొలిటికల్ రివ్యూ: 2022లో చేయి కాలిందా? పట్టు జారిందా?
2022లో కాంగ్రెస్ పార్టీ మరి కొంచెం పతనమైంది. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని అపజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. రెండు మూడు మినహా చెప్పుకోదగ్గ రాష్ట్రాల్లో అధికారం లేదు. మూడేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంది. చాలాకాలం తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబ సభ్యులు మాత్రం ఈడీ ఆఫీస్ చుట్టూ తిరిగారు. ఈ ఏడాది ఒక రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుని..మరో రాష్ట్రంలో అధికారం సాధించుకుంది. ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుస వైఫల్యాలు, అంతర్గత కుమ్ములాటలు, కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పడంతో మరింత కుదేలైన హస్తం శ్రేణుల్లో.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాస్త జోష్ నింపింది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని.. 2022లోనూ వైఫల్యాలు వెంటాడాయి. ఈ ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అధికారంలో ఉన్న పంజాబ్‌ను కోల్పోయింది. బీజేపీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది. గుజరాత్లో అయితే ఏడవసారి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది హస్తం పార్టీ. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టి తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు బీహార్‌లో బీజేపీ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ కమలానికి టాటా చెప్పి.. కాంగ్రెస్ కూటమిలో చేరారు. ఆ విధంగా మహారాష్ట్ర చేజారితే.. బీహార్ కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ పోయే.. ఖర్గే వచ్చే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీకి అధ్యక్షుడే లేకుండా మూడున్నరేళ్ళ పాటు సాగింది. సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేకపోయినా తాత్కాలికంగా పార్టీ బాధ్యతలు నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ప్రక్రియ కొనసాగుతున్న దశలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. 22 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరోసారి గాంధీయేతర కుటుంబం నుంచి ఓ నేత అధ్యక్షుడయ్యారు. కర్నాటకకు చెందిన 80 ఏళ్ళ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొత్త నాయకుడు వచ్చినా.. పార్టీ పరిస్థితుల్లో మార్పులేదు, అధికారంలో ఉన్న రాజస్థాన్ నుంచి అధికారం పోగొట్టుకున్న తెలంగాణ వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్గత కుమ్ములాటలే. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి గెహ్లాట్, యువనేత పైలట్ వర్గాలు బహిరంగంగా మాటల తూటాలు విసురుకుంటున్నా ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో కాంగ్రెస్ హైకమాండ్ అల్లాడుతోంది. పార్టీని వెంటాడుతున్న పాపాలు ఓవైపు కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతుంటే.. మరోవైపు నేషనల్ హెరాల్ట్ కేసు గాంధీ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలిసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ. సోనియాను మూడుసార్లు, రాహుల్ గాంధీని ఐదు రోజులు విచారించారు ఈడీ అధికారులు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులతో.. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఉన్న లింకులపై ఆరా తీశారు. గాంధీలు విచారణకు హాజరైన అన్ని రోజులు దేశవ్యాప్తంగా ఆందోళనలు, హర్తాళ్లు చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సోనియా గాంధీ విచారణ నేపథ్యంలో రోడ్డెక్కిన రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జోడో.. తెచ్చే మార్పు ఎంత? చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టున్న కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసేందుకు, పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు..సెప్టెంబర్‌లో భారత్ జోడో యాత్ర ప్రారంభించారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగేలా ప్లాన్ చేశారు. కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. తొమ్మిది రాష్ట్రాలు దాటుకుని..ప్రస్తుతం ఢిల్లీ చేరుకుంది. బీజేపీ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ఐక్యత కోసమే భారత్ జోడో అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీలో నెలకొన్న విపరీత పరిస్థితులు.. నేతల మధ్య అంతరాలను తొలగించి, కాంగ్రెస్‌ను తిరిగి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్. ఒకవైపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా రాహుల్ గాంధీ వాటి గురించి సీరియస్‌గా తీసుకోకుండా తన జోడో యాత్ర కొనసాగించడంపై విమర్శలు వినిపించాయి. ముందుంది ముసళ్ల పండగ వరుజ పరాజయాలు..అంతర్గత కుమ్ములాటలతో నిస్తేజంగా మారిన కాంగ్రెస్ పార్టీలో భారత్ జోడో యాత్ర కాస్త ఉత్సాహం నింపింది. జనంలో ఉండేందుకు..ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీకి అవకాశం దక్కింది. అయితే రాహుల్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల లబ్ధి మాత్రం ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 2023లో కీలకమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ పాటు ఖర్గే సొంత రాష్ట్రం కర్నాటక సహా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఏమేరకు ఉందో..త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు తేల్చేయనున్నాయి. కొండ లాంటి బీజేపీ, బలమైన ప్రాంతీయ పార్టీలతోపాటు కాంగ్రెస్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది ఆమ్ ఆద్మీ పార్టీ. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కాంగ్రెస్ నుంచి పంజాబ్‌ను చేజిక్కించుకున్నారు. గుజరాత్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును అడ్డంగా చీల్చేశారు. ముందు ముందు ఆప్ వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరుగుతుందనే అంచనాలు కాంగ్రెస్ హైకమాండ్‌ను కంగారు పెడుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కాంగ్రెస్ యూట్యూబ్ చానల్ తొలగింపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన యూట్యూబ్ చానల్ ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ ఆన్లైన్ నుంచి తొలగించబడింది. దీనిపై యూట్యూబ్ సంస్థ ఇంకా ఎలాంటి వివరణ రాలేదు. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. యూట్యూబ్ సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ‘విద్రోహులు కావాలనే చానల్‌ను తొలగించారా? లేక సాంకేతిక పొరపాటే ఇందుకు కారణమా? అనేది తేలుస్తాం. ఇందుకు సంబంధించి గూగుల్/ యూట్యూబ్ సంస్థల ఉన్నతాధికారులతో సంప్రతింపులు జరుపుతున్నాం. సమస్యను వెంటనే పరిష్కరించి ఛానల్‌ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యాం’ అని పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో బుధవారం పేర్కొంది. ఇదీ చదవండి: స్వతంత్ర మీడియాని అణచివేసేందుకు యత్నాలు -
చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదు
-
Secunderabad Protests: చర్చలకు పిలిచిన పోలీసులు
-
చావడానికైనా సిద్ధం..!!
-
Secunderabad Railway Station: రైల్వేస్టేషన్ వదిలి వెళ్లిపోండి.. లేదంటే మరోసారి కాల్పులు
-
కన్నెర్ర చేసిన విద్యార్థులు.. అగ్నిపథ్ గందరగోళం
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు
-
మువ్వన్నెల జెండాకు ముప్పాతికేళ్లు
మన భారతదేశపు జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి రేపటికి 75 ఏళ్లు. 1943లో పోర్ట్‌బ్లెయిర్‌లోని సెల్యులార్ జైలులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా ఈ జెండాను ఎగురవేశారు. తెలంగాణలోని ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని నడిగూడు గ్రామంలో పింగళి వెంకయ్య జెండా రూపనిర్మాణానికి బీజం వేశారు. కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రులో హనుమంత రాయుడు, వెంకటరత్నమ్మలకు 2 ఆగస్టు 1878న జన్మించిన వెంకయ్య విద్యాభ్యాసం మచిలీ పట్నంలో జరిగింది. 1906లో కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరు కావడం, వందేమాతరం ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూడటం వెంకయ్య జీవితాన్ని మలుపుతిప్పింది. పింగళి వెంకయ్య ఓ అసాధారణ పత్తిరైతు. అమెరికా నుండి కంబోడియా రకం విత్తనాలు తెప్పించి, వాటిని దేశవాళీ వాటితో కలిపి సంకరజాతి పత్తిని సృష్టించారు. సూర్యాపేటలోని చల్లపల్లిలో జరిగిన ఈ ప్రయోగాలను గుర్తించిన లండన్‌లోని రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ వెంకయ్యను ఫెలోషిప్తో గౌరవించింది. పరిశోధనలపై ఆసక్తితో కొలొంబో వెళ్లి సీనియర్ కేంబ్రిడ్జ్ పూర్తి చేశారు. భూగర్భ శాస్త్రంలో పీహెచ్డీ చేయ డంతోపాటు నవరత్నాలపై అధ్య యనం చేశారు. 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా పేరిట పుస్త కాన్ని వెలువరిం చిన వెంకయ్య 1921 వరకు వివిధ దేశాల పతాకాలపై పరిశోధనలు చేశారు. వెంకయ్య తొలి సారి రూపొందించిన జెండాను కోల్‌కతాలోని బగాన్ పార్సీ దగ్గర ఎగురవేశారు. 22 జూలై 1948న ఆ జెండాను జాతీయపతాకంగా స్వీకరించారు. త్రివర్ణ పతాకంలో అశోక చక్రం ఉంచాలనే ఆలోచన కాంగ్రెస్ కమిటీ సభ్యురాలైన సురయా త్యాబ్జిది. త్రివర్ణంలోని కాషా యం సంపదను, తెలుపు జ్ఞానాన్ని, ఆకుపచ్చ రక్షణ శక్తిని సూచిస్తుండగా, 24 గీతలతో ఉన్న అశోక చక్రం నైతిక విలువల ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది. (జాతీయ జెండా ఎగురవేసి 30 డిసెంబర్ 2018నాటికి 75 ఏళ్లు) వ్యాసకర్త: గుమ్మడి లక్ష్మీనారాయణ మొబైల్ : 94913 18409 -
జాతీయవాద ప్రవక్త
‘ఇంకో ప్రభుత్వం ఏర్పడకుండానే ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించాలని ఈ గాంధీ భజనబృందం కోరుకుంటోంది. లేదా మహాత్ముడు ప్రవచిస్తున్న పురోహిత తత్వం కలిగిన ఏకవ్యక్తి పాలన రావాలని అది ఆశిస్తోంది.’1919 తరువాత భారత స్వాతంత్య్రోద్యమ నాయకత్వం గాంధీజీ చేతికి వచ్చింది. ఆయనకు తొలినాళ్లలో పాతతరం నాయకత్వం నుంచి గొప్ప మద్దతు లభించిన దాఖలాలు కనిపించవు. పైగా తీవ్ర ప్రతిఘటన కూడా ఉండేది. గాంధీజీతో విభేదించినవారు సా«మాన్యులు కారు. వారికి చరిత్ర రచనలో తగిన స్థానం లభించకపోయినా, వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూడలేము. అన్నింటికంటే గాంధీజీ కంటే ముందు ఈ దేశంలో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని నడిపినవారు వారే కదా! అలా గాంధీయుగం తొలినాళ్లలో ఆయన ఉద్యమ పంథాను, ఎత్తుగడలను విమర్శించిన వారిలో బిపిన్‌చంద్ర పాల్ (నవంబర్ 7,1858–మే 20,1932) ప్రసిద్ధులు. పైన ఉదహరించిన మాటలు ఒక సందర్భంలో పాల్ అన్నవే. ‘గాంధీ ఆరాధన’ను ఎద్దేవా చేసినవారిలో ఆయన ఒకరు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం (1905)లో కీలక పాత్ర వహించిన ‘లాల్, పాల్, బాల్’ త్రయంలో ఒకరు బిపిన్‌చంద్ర ‘పాల్’. ‘మహా శక్తిమంతుడైన జాతీయవాద ప్రవక్త’ అని పాల్‌ను అరవిందులు కీర్తించారు. పాల్ నమ్మిన జాతీయవాదం భారత స్వాతంత్య్రోద్యమంలో ఒక గొప్ప చారిత్రక భూమికను నిర్వహించి, అంతే గొప్ప సందర్భాన్ని సృష్టించింది. బెంగాల్ విభజనను వ్యతిరేకించే ఒక బలీయమైన శక్తిగా భారతీయ సమాజాన్ని ఆవిష్కరించడానికి జాతీయవాదమే ఆయనకు తోడ్పడింది. వీటిని విశ్వసించిన నాటి ఉద్యమం విజయం సాధించిన మాట వాస్తవం. స్వరాజ్, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్య వంటి అన్ని అంశాలను ప్రజానీకానికి చేరువగా తీసుకు వెళ్లడానికి పాల్‌కు ఉపకరించిన ఆయుధం కూడా ఆ వాదమే. విదేశీ విద్య, అంటే ఆంగ్లం మనకి జ్ఞాపకశక్తిని ఇవ్వవచ్చు. కానీ, విద్య అనే వ్యవస్థ ఇవ్వవలసిన నైతిక ప్రమాణాలని అది ఇవ్వడం లేదు. సమాజం పట్ల పౌరులు చూపించవలసిన బాధ్యతని అది గుర్తు చేయడం లేదు. మనదైన సృజన అడుగంటి పోవడానికి కారణం కూడా విదేశీ విద్యే అని చాటినవారు పాల్. విదేశీ వస్తు బహిష్కరణలో ప్రధానంగా కనిపించేది మాంచెస్టర్ నుంచి వచ్చే వస్త్రాలు. వాటిని బహిష్కరిస్తే దేశంలో పేదరికం, నిరుద్యోగం తగ్గుతాయని ఊహించినవారు పాల్. అసలు సహాయ నిరాకరణ వంటి సున్నితమైన నిరసన కార్యక్రమాలతో వలస పాలకులను దిగి వచ్చేటట్టు చేయగలమని అనుకోవడమే పెద్ద భ్రమ అని పాల్ నమ్మారు. పాల్‌ను ఆధునిక భారతదేశంలో ‘విప్లవ భావాలకు పితామహుడు’ అనే అంటారు. ఈ విప్లవ ఆలోచనల పితామహుని రాజకీయ, సాంఘిక జీవితం అస్సాం టీ తోటలలో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడం దగ్గర మొదలైంది. 1880 ప్రాంతంలోనే ఆయన ప్రజాజీవితం అడుగులు వేయడం నేర్చుకుంది. భారత స్వాతంత్య్రోద్యమం తొలిదశలో కనిపించే సురేంద్రనాథ్ బెనర్జీ పాల్‌గారి రాజకీయ గురువు. మొదట పాల్ మీద కేశవచంద్ర సేన్ (బ్రహ్మ సమాజ్ నేత), శివనాథ్ శాస్త్రి, బీకే గోస్వామి వంటివారి ప్రభావం ఉండేది. పాల్ అఖండ వంగదేశంలోని పొయిల్ అనే చోట పుట్టారు (ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్‌లో ఉంది). తండ్రి రామచంద్రపాల్, తల్లి నారాయణీదేవి. తండ్రి పర్షియన్ బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. అయితే ఆ కుటుంబం జమీందారీ కుటుంబం. పాల్‌ను కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో చేర్చినప్పటికీ చదువు పూర్తి చేయలేదు. తరువాత కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా, మరి కొంతకాలం కలకత్తా పబ్లిక్ లైబ్రరీ అధికారిగా కూడా పనిచేశారు. బిపిన్‌చంద్ర పాల్ స్వాతంత్య్రోద్యమానికి చేసిన సేవ అంచనాలకు మించినది. వందేమాతరం నినాదాన్ని దేశమంతా తిరిగి వినిపించారాయన. ఈ దేశంలో గాంధీజీ కంటే ముందే నిజమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన ఘనత బిపిన్‌పాల్‌కు కూడా దక్కుతుంది. గొప్ప చారిత్రక నేపథ్యం కలిగిన భారత జాతికి సంకెళ్లు ఉన్నాయన్న సంగతినీ, ఈ పురాతన భూమి వలస పాలనలో మగ్గిపోతున్న కఠోర వాస్తవాన్నీ సాధారణ భారతీయుడికి అర్థమయ్యేటట్టు తెలియచెప్పినవారు పాల్. ఇందుకు బెంగాల్ విభజన సందర్భాన్ని పాల్ అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అరబిందొ ఘోష్, రవీంద్రనాథ్ టాగోర్, లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, చిత్తరంజన్‌దాస్, అనీబిసెంట్ వంటి మహనీయులతో కలసి నడిచారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన మరుసటి సంవత్సరమే పాల్ ఆ సంస్థలో సభ్యులయ్యారు. 1886 నాటి కలకత్తా సభలకీ, 1887 నాటి మద్రాస్ సభలకి కూడా ఆయన హాజరయ్యారు. భారతీయుల పట్ల ఎంతో వివక్షాపూరితంగా ఉన్న ఆయుధ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన మద్రాస్ సభల వేదిక మీద నుంచి పిలుపునిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. కాంగ్రెస్ తొలినాటి నాయకత్వం మితవాదులదే. కానీ వారి ధోరణి, పంథా జాతీయవాదులకి సరిపడేది కాదు. విన్నపాలతో వలసపాలకులు లొంగి వస్తారని అనుకోవడం అమాయకత్వమేనని అప్పటికే గట్టిగా విశ్వసించిన వారు లేకపోలేదు. మితవాదుల విన్నపాలు వ్యర్థమనీ, జాతీయవాదుల ఆలోచనలే సరైనవనీ భావించేందుకు వీలు కల్పించినదే బెంగాల్ విభజన. దీనితో బ్రిటిష్ జాతి పట్ల ఉన్న భ్రమల నుంచి చాలామంది బయటపడ్డారు. స్వరాజ్, స్వదేశీ, జాతీయ విద్య వంటివి ప్రజలను కదిలించాయి. ఇవే కొత్త ఉద్యమానికి బీజాలు వేశాయి. అలాంటి ఒక చారిత్రక సందర్భంలో మేరునగధీరుని వలే కనిపించే విప్లవనేత పాల్. బిపి¯Œ బాబు కలం ఎంతో పదునైనది. పత్రికా రచయితగా, గ్రంథకర్తగా ఆయన స్థానం అసాధారణమైనది. నేషనాలిటీ అండ్ ఎంపైర్, ఇండియన్ నేషనలిజం, స్వరాజ్ అండ్ ది ప్రజెంట్ సిట్యుయేషన్, ది సోల్ ఆఫ్ ఇండియా, ది బేసిస్ ఆఫ్ సోషల్ రిఫార్మ్, ది హిందూయిజం, ది న్యూ స్పిరిట్ ఆయన గ్రంథాలు. డెమోక్రాట్, ఇండిపెండెంట్ పత్రికలకు ఆయన సంపాదకుడు. పరిదర్శక్, న్యూ ఇండియా, వందేమాతరం, స్వరాజ్ పాల్ ప్రారంభించిన పత్రికలు. ట్రిబ్యూన్ (లాహోర్) పత్రికకు కొంతకాలం ఆయన సంపాదకుడు. బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్ పత్రిక సంపాదక మండలి సభ్యుడు. ఇవి కాకుండా మోడరన్ రివ్యూ, అమృతబజార్ పత్రిక, ది స్టేట్స్‌మన్ పత్రికలకు నిరంతరం వ్యాసాలు రాస్తూ ఉండేవారు. వక్తగా బిపిన్ పాల్ అంటే వంద ప్రభంజనాలతో సమానం. ఆయన పలుకు విన్న ప్రాంతంలో చైతన్యం తొణికిసలాడింది. జాతీయ భావాల తుపాను వీచింది. బెంగాల్ విభజనను రద్దు చేయాలని కోరే ఒక సందేశాన్ని పట్టుకుని పాల్ దక్షిణ భారతదేశం వచ్చారు. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, బందరు, మద్రాస్‌లలో సభలు జరిగాయి. ఇవి కూడా చరిత్రాత్మక ఘట్టాలుగానే మిగిలాయి. రాజమండ్రి గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన సభలోనే చిలకమర్తి లక్ష్మీనరసింహం నోటి నుంచి ‘భరతఖండమ్ము చక్కని పాడియావు’ అన్న పద్యం వచ్చింది. ముట్నూరి కృష్ణారావుగారు పాల్ గారిని ఆ ప్రదేశాలన్నీ తిప్పారు. రాజమండ్రి సభలో పాల్‌గారిని ఆయనే జనానికి పరిచయం చేశారు. నాడు పాల్ విశాఖ నుంచి రాజమండ్రి చేరుకోగానే ఆయన గౌరవార్థం జరిగిన స్వాగతోత్సవం చిరస్మరణీయమైనది. పాల్ అక్కడ అయిదారు ఉపన్యాసాలు ఇచ్చారు. అవి రాజమండ్రి సామాజిక, రాజకీయ వాతావరణాన్నే మార్చేశాయి. తెలిసిన వారు ఎదురైతే ‘వందేమాతరం’ అని పలకరించుకోవడం మొదలైంది. అందరి గుండెల మీద వందేమాతరం బ్యాడ్జీలు వెలిశాయి. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ‘వందేమాతరం’ అని విద్యార్థులు నినదించినందుకు బహిష్కరణకు గురయ్యారు. నాడు అక్కడే ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న గాడిచర్ల హరిసర్వోత్తమరావు వారిలో ఒకరు. హరిసర్వోత్తమరావు కూడా పాల్‌గారి వెంట తిరుగుతూ సభలలో పాల్గొన్నారు. ఇది ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌కు రుచించలేదు. ఆనాటి సభలో పాల్గొన్న, వందేమాతరమని తరగతి గదులలో నినదించిన 111 మందిని కళాశాల నుంచి బహిష్కరించారు. కాకినాడలో కెంప్ అనే ఆంగ్ల వైద్యాధికారి ఎదుట కోపల్లె కృష్ణారావు అనే పాఠశాల విద్యార్థి అదే నినాదం పలికినందుకు చావు దెబ్బలు తిన్నాడు. కెంప్ నిత్య వ్యాయామం చేసే పహిల్వాన్. కృష్ణారావు బాలుడు. కెంప్ అతడిని స్పృహ పోయేటట్టు కొట్టడమే కాదు, అదే స్థితిలో ఉండగా తీసుకెళ్లి పోలీసు స్టేషన్లో పడేసి వెళ్లిపోయాడు. కృష్ణారావు చనిపోయాడని పట్టణంలో వదంతి వ్యాపించింది. దీనికి ఆగ్రహించిన కాకినాడ వాసులు ఆంగ్లేయుల క్లబ్బును దగ్ధం చేశారు. కెంప్ రహస్యంగా పట్టణం విడిచి పారిపోయాడు. మద్రాస్ మెరీనా బీచ్‌లో ఏర్పాటు చేసిన పాల్ సభలకు అధ్యక్షత వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీనితో టంగుటూరి ప్రకాశం ఆ బాధ్యతను నిర్వర్తించారు. ఈ దేశంలో ఉన్నత వర్గాలు చేవ చచ్చి ఉన్నాయని, ఇక ప్రజా బాహుళ్యమే ఉద్యమించాలని పాల్ పిలుపునిచ్చారు. దేశమాతను దుర్గామాతగా దర్శించుకుంటున్న ఈ తరానిదే భవిష్యత్తు అంతానని పాల్ చేసిన ప్రసంగాలు సహజంగానే ప్రజలను ఆకట్టుకున్నాయి. 1907లో తిలక్ అరెస్టు తరువాత జాతీయవాదుల మీద బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధం కొనసాగించింది. ఏదో విధంగా పాల్‌ను కటకటాల పాల్జేయాన్నదే బ్రిటిష్ జాతి ఆశయం. అదే సమయంలో అరవిందుల మీద దేశద్రోహం కేసు నమోదైంది. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వడానికి బిపిన్‌పాల్ నిరాకరించారు. దీనితో ఆయనకు ఆరు మాసాల జైలు శిక్ష పడింది. బెంగాల్ విభజన నేపథ్యంలో పాల్ వందేమాతరం పత్రిక నెలకొల్పారు. దీనికి అరవిందులు సంపాదకుడు. జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత బిపిన్‌బాబు ఇంగ్లండ్ వెళ్లారు. కొన్ని అంశాల మీద తులనాత్మక అధ్యయనం చేయడం ఆయన ఉద్దేశం. అక్కడ ఉన్న మూడేళ్ల కాలంలో ఇండియా హౌస్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఇండియా హౌస్ అంటే విదేశీ గడ్డ మీద నుంచి భారత స్వాతంత్య్ర సమరానికి సహకరిస్తున్న భారతీయ యువకుల అడ్డా. వీరంతా హింసాత్మక పంథాను స్వాగతించినవారే. అక్కడ ఉండగానే పాల్ స్వరాజ్ పత్రికను ప్రారంభించారు. కానీ ఇండియాలో 1909 కర్సన్ వైలీ హత్య జరిగింది. మదన్‌లాల్ థింగ్రా ఈ సాహసం చేశారు. కానీ దీని ప్రభావం ఇంగ్లండ్ నుంచి వెలువడుతున్న స్వరాజ్ పత్రిక మీద తీవ్రంగా పనిచేసింది. పత్రిక మూత పడింది. పాల్ ఆర్థికంగా చితికిపోయారు. కొద్దికాలం మనశ్శాంతి కోల్పోయారు. భారతదేశానికి వచ్చిన తరువాత కూడా ఆయన గాంధీజీ నాయకత్వాన్ని సమర్థించలేకపోయారు. నిజానికి గాంధీ నాయకత్వం వహించే నాటికి పాతతరం నాయకులు తక్కువే ఉన్నారు. వారు కూడా గాంధీ ఆకర్షణలో పడిపోయారు. కానీ పాల్ మాత్రం చివరికంటా తనదైన పంథాలోనే నడిచారు. బిపిన్‌పాల్ ఉద్యమ జీవితంలో చివరి అంకం నిండా ఏకాంతమే కనిపిస్తుంది. ఖిలాఫత్ ఉద్యమాన్ని ఆయన వ్యతిరేకించారు. అది ఆయన ఉద్యమ జీవితాన్నే తెరమరుగయ్యేటట్టు చేసింది. 1921లో పాల్ గాంధీ మీద చేసిన విమర్శ అసాధారణమైనది. ‘మీరు మ్యాజిక్ చే శారు. కానీ నేను మీకు లాజిక్‌ను అందివ్వాలని అనుకున్నాను. ప్రజాసమూహాలు సంభ్రమాశ్చర్యాలలో తలమునకలైతే తర్కం (లాజిక్) రుచించదు. మీరు మంత్రించారు. నేను రుషిని కాను. కాబట్టి మంత్రం ఇవ్వలేను. సత్యమేమిటో నాకు తెలిసినప్పుడు నేను అర్థసత్యాలను పలకలేను. ప్రజలకి విశ్వాసాలనే గంతలు కట్టి నడిపించాలని నేను ఏనాడూ ప్రయత్నించలేదు.’ బిపిన్‌బాబు రెండు వివాహాల గురించి కూడా చెప్పుకోవాలి. 1881లో ఆయనకు సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. కానీ ఆమె అనతికాలంలోనే మరణించారు. తరువాత 1891లో మరొకరిని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు నృత్యకాళీదేవి, వితంతువు. రెండు విషయాలను స్పష్టం చేయడానికి పాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి సంస్కరణ కోసం. రెండు వయో పరిమితి బిల్లుకు (బాల్య వివాహాలను నిషేధించినది) తన పూర్తి మద్దతు ఉందని చెప్పడం. కానీ వితంతువును వివాహం చేసుకున్నందుకు పాల్ తన కుటుంబానికి దూరమయ్యారు. బిపిన్‌బాబు ఆలోచనలలోనివే కాదు, అడుగులలో కనిపించినవీ విప్లవ భావాలే. - ∙డా. గోపరాజు నారాయణరావు -
చరిత్రలో ఒక ఉదారవాది
స్వాతంత్య్రోద్యమ చరిత్ర పేరుతో మన పాఠ్య పుస్తకాలలో కనిపించేది భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర మాత్రమే. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర (1857) మినహాయిస్తే మిగిలిన చరిత్రంతా భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రే. జాతీయ కాంగ్రెస్‌తో పాటు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సంస్థలు ఉన్నా, వాటి చరిత్రకు తగిన స్థానం కల్పించలేదు. అదే జరిగి ఉంటే జాతీయ కాంగ్రెస్ కంటే ముందే ఆరంభమైన గిరిజన పోరాటాలు, జాతీయ కాంగ్రెస్ పోరాటంతో సమాంతరంగా మైదానాలలో జరిగిన రైతాంగ పోరాటాలు, తీవ్ర జాతీయవాదంతో విదేశీ గడ్డ మీద నుంచి ఉద్యమించిన గదర్, హెచ్ఆర్ఏ వంటి సంస్థల త్యాగాలు, ఆఖరికి పూర్తి రాజ్యాంగ పంథాలో ఉద్యమానికి అంకితమైన లిబరల్ పార్టీ గురించి కూడా గొప్ప వివరాలు తెలియవు. కాబట్టే స్వరాజ్య సమరంలో ఎంతటì త్యాగాలు చేసినా, వారు ఎంతటి మహానుభావులైనా కొందరి పేర్లు చరిత్ర పుస్తకాలలో కానరావు. నిజానికి ఆ సంస్థలో సర్వం త్యాగం చేసిన వారి చరిత్రకు కూడా చరిత్ర గ్రంథాలలో తగిన స్థానం కనిపించదు. ఇక గాంధీజీ సిద్ధాంతాలతో ఏదో ఒక దశలో విభేదించి తమదైన మార్గంలో పోరాటాలు చేసిన వారి పేర్లు కూడా కనుమరుగు కావడం మరొక విశేషం. అలాంటివారిలో ఒకరు వీఎస్ శ్రీనివాసశాస్త్రి. వాళంగైమన్ శంకరనారాయణ శ్రీనివాసశాస్త్రి (సెప్టెంబర్ 22,1869–ఏప్రిల్ 17, 1946) రాజకీయ జీవితం, ఉద్యమం, జాతీయోద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర నిర్మాణాత్మకమైనవి. శ్రీనివాసశాస్త్రి గోపాలకృష్ణ గోఖలే శిష్యుడు. గోఖలే శిష్యులుగా ఖ్యాతి గాంచిన తేజ్ బహదూర్ సప్రూ, జిన్నాల వలెనే శాస్త్రి కూడా కానిస్టిట్యూషనలిస్ట్. ఉద్యమం, హక్కుల సాధన రాజ్యాంగ బద్ధంగా మాత్రమే జరగాలన్నది వీరి ఆశయం. గోఖలేను గురువుగా భావించిన గాంధీజీ శాస్త్రిని ప్రియ సోదరుడా అని సంబోధించేవారు. శ్రీనివాసశాస్త్రి తంజావూరు జిల్లాలోని వాళంగైమన్ అనే గ్రామంలో పుట్టారు. తండ్రి పూజారి. కాబట్టి ఎంత శోత్రియ కుటుంబమో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. కానీ ఆంగ్ల భాషలో ఆయన కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడమే విశేషం. తరువాత వారి కుటుంబం కుంభకోణం తరలివచ్చింది. అక్కడే ఆయన విద్యంతా సాగింది. ప్రతి తరగతిలోను ప్రథమ స్థానంలో నిలుస్తూ, ఉన్నత విద్య వరకు ఉచితంగా ఆయన విద్యాభ్యాసం చేశారు. కుంభకోణంలోనే బీఏ చదువుతూ ఉండగా ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి శాస్త్రి మద్రాస్ నగరానికి (1887) వచ్చారు. అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సభలు అక్కడ జరుగుతున్నాయి. అక్కడే శ్రీనివాసశాస్త్రి సురేంద్రనాథ్ బెనర్జీ ఉపన్యాసం విన్నారు. అప్పటికే ఇంగ్లిష్ ప్రొఫెసర్ అయిన బెనర్జీ ఉపన్యాసం, అందులో ధార, ధారణ శాస్త్రిని వివశుడిని చేశాయి. బెనర్జీకి భక్తునిగా మారిపోయారాయన. తరువాత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, అంచెలంచెలుగా మద్రాస్ ట్రిప్లికేన్‌లోని హిందూ ఉన్నత పాuý శాల ప్రధానోపాధ్యాయుడయ్యారు. గురుశిష్య సంబంధాన్ని ఆయన మలచి తీరు ఒక నమూనాగా మారిపోయింది. ఉపాధ్యాయ సంఘాన్ని కూడా ఆయన స్థాపించి, వారి డిమాండ్లకు గొంతునిచ్చారు. ఎక్కడా సహకార వ్యవస్థ ఆవిర్భవించని కాలంలో సహకార వ్యవస్థను కూడా ఆయన తన సంఘంలో పరిచయం చేశారు. విద్యార్థులతో బయట ఎంత ఉదారంగా వ్యవహరించేవారో, తరగతిలో అంత కఠోర క్రమశిక్షణ అమలు జరిపేవారు. శాస్త్రి ఖ్యాతి దేశవ్యాప్తమైందంటే అతిశయోక్తికాదు. ఆంగ్లంలో సిల్వర్ టంగ్డ్ ఆరేటర్ అన్న పేరు వచ్చింది. అలాంటి సమయంలోనే ఆయన హఠాత్తుగా ఉద్యోగానికి స్వస్తి పలికారు. జీఏ నటేశన్ అనే మిత్రుడు ‘కాన్షిడెన్షియల్’ అనే శీర్షికతో ఉన్న ఒక చిన్న కరపత్రాన్ని శాస్త్రికి అందచేశారు. అది గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో నడుస్తున్న సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆశయాలను, సిద్ధాంతాన్ని, నియమాలను వివరించే కరపత్రం. అందులో ఆయనను బాగా ఆకట్టుకున్న అంశం– ప్రజా జీవితాన్ని ఆ«ధ్యాత్మికం చేయాలన్న ఆశయం. ఆ క్షణంలోనే ఆయన మనసు మారిపోయింది. గోఖలేకు వెంటనే ఒక లేఖ రాశారు. తన వయసు 37 ఏళ్లు అని, మిగిలిన జీవితంలో దేశం కోసం కేటాయించడానికి ఎంత మిగిలిఉందో తన కు తెలియదనీ, కాబట్టి వెంటనే తాను సేవారంగంలో ప్రవేశించదలుచుకున్నానని దాని సారాంశం. గోఖలే కూడా సంతోషంగా స్వాగతం పలికారు. గోఖలే నుంచి లేఖ రావడంతోనే ప్రధానోపా«ధ్యాయ పదవికి ఆయన రాజీనామా ఇచ్చేశారు. పిల్లలకు వీడ్కోలు చెబుతూ, రాముడికి కౌసల్య చెప్పిన ధార్మిక విషయాలను ప్రస్తావించారు. ఇక్కడ ఒక విషయం విస్మరించడానికి వీలు లేదు. శాస్త్రి చిన్నతనం నుంచి కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్న పేదరికం ఆయన ఉద్యోగం వదిలేసి, నిస్వార్థదృష్టితో సేవా రంగంలోకి దిగిన క్షణం వరకు వెన్నంటే ఉంది. స్వాతంత్య్ర సమరంలో కనిపించే అత్యంత అరుదైన మేధావి వర్గంలో ఒకరాయన. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన రాజనీతి తత్వవేత్తల ప్రభావం ఆయన మీద కనిపిస్తుంది. ఎడ్మండ్ బర్క్, హెర్బర్ట్ స్పెన్సర్, జాన్ స్టూవర్ట్ మిల్, మార్కస్ అరులియస్ రచనల ప్రభావం ఆయన మీద ఉంది. షేక్సిపియర్, వాల్టర్ స్కాట్, జార్జ్ ఇలియెట్, టీహెచ్ హక్సలీ, టాల్‌స్టాయ్, థామస్ హార్డీ, విక్టర్ హ్యూగో వంటి మహోన్నత సాహితీమూర్తుల రచనలన్నీ ఆయన చదివారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, రామాయణ కావ్యం మీద ఆయనకున్న పరిజ్ఞానం మరొక ఎత్తు. ఆ కావ్యం మీద ఆయన పలు రచనలు చేయడమే కాకుండా, ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. గోఖలే అనుచరులలో ఎవరికీ దక్కని గౌరవం శాస్త్రికి దక్కింది. గోఖలే మరణం (1915) తరువాత సర్వేంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ అధ్యక్ష పదవి శాస్త్రిని వరించింది. రాజకీయ గురువు గోఖలేను అనుసరించి శాస్త్రి భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయాలలోకి అడుగు పెట్టారు. 1907లో అది జరిగింది. నిజానికి ఆ సంవత్సరంలో సూరత్‌లో జరిగిన వార్షిక సమావేశాలు ఆ మహా సంస్థ చరిత్రలో మాయని మచ్చ వంటివి. అతివాదులు, మితవాదులు పేరుతో కాంగ్రెస్ చీలిపోయింది. గోఖలే, ఫిరోజ్‌షా మెహతాల అనుచరులు లోకమాన్య తిలక్‌ను వేదిక నుంచి బలవంతంగా దించివేయడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలోనే సభలో ఉన్న ఎవరో ఫిరోజ్‌షా లక్ష్యం విసిరారు. అది చూసిన శాస్త్రి వేదిక మీదకు పరుగున వెళ్లి ఫిరోజ్‌షాకు అడ్డంగా నిలవాలని అనుకున్నారు. ఆ బూటు వచ్చి సురేంద్రనాథ్ బెనర్జీని తాకి, ఫిరోజ్‌షా మీద పడింది. ఆ తరువాత సంవత్సరం మద్రాస్‌లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాల నాటికే శాస్త్రి కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. సప్రూ, జిన్నాలతో పాటు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువస్తున్న రాజ్యాంగ సంస్కరణలను సమీపంగా పరిశీలించిన వారిలో శాస్త్రి కూడా ప్రముఖులు. 1919 నాటి మాంటేగ్–చెమ్స్‌ఫర్డ్ చట్టం రూపకల్పనలో శాస్త్రి తన వంతు సాయం అందించారు. బాధ్యతాయుత ప్రభుత్వం అందించడానికి ప్రభుత్వం సరేనని చెప్పడమే శాస్త్రి తదతర మేధావులను తృప్తి పరిచింది. అయితే దీనిని కాంగ్రెస్‌లో ఒక వర్గం, గాంధీజీ ఆమోదించలేదు. ఆపై సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చారు. దీనితో శాస్త్రి కాంగ్రెస్‌కు దూరంగా జరిగారు. ఈ పరిణామంతోనే కాంగ్రెస్‌కు దూరమై, దేశ చరిత్రలో పెద్ద మలుపునకు బీజం వేసినవారు జిన్నా. అప్పుడు జరిగిన మరో పరిణామం– నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావం. కాంగ్రెస్‌లోని అతి,మితవాద వర్గాలు దేనికీ చెందకుండా, అనిబిసెంట్ నాయకత్వంలోని హోంరూల్ లీగ్‌కు సమీపంగా జరిగి, బ్రిటిష్ పాలకులకు ఆగ్రహం రాని విధంగా వ్యవహరించిన కానిస్టిట్యూషనలిస్టుల వేదికే ఈ ఫెడరేషన్. ఇందులో సప్రూ, జిన్నా, శాస్త్రి ప్రముఖులు. కానీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని శాస్త్రి అంగీకరించలేదు. దేశ విభజనను కూడా. దేశంలోని ఉదారవాదుల ప్రతిని«ధిగా రెండు రౌండ్ టేబుల్ సమావేశాలలో (1930–31) ఆయన పాల్గొన్నారు. అక్కడ శాస్త్రి ఉపన్యాసం విన్న తరువాత ఇంగ్లండ్ ప్రధాని డేవిడ్ లాయిడ్ జార్జి ఇక తనకు ఇంగ్లిష్ మాట్లాడాలంటే సంకోచంగా ఉందని అన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన కొన్ని విశ్వవిద్యాలయాలు, పత్రికలు కూడా శాస్త్రి ఉచ్చారణను ప్రామాణికంగా తీసుకున్నాయి. తన గ్రంథం ‘మై ఎక్స్పీరియన్సెస్ విత్ ట్రూత్’ ఆంగ్ల చిత్తుప్రతిలో భాషను సరిచూసే పనిని గాంధీజీ శాస్త్రిగారికే అప్పగించారు. 1913లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఆయనను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ సంగతి ఎలా ఉన్నా 1918 నాటికి ఆయన ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా రౌలట్ బిల్లును వ్యతిరేకించారు. అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం పట్ల తనకున్న సానుకూలతను ఆయన నిస్సంశయంగా వదిలిపెట్టారు. గాంధీజీకి కూడా రౌలట్ బిల్లు, దీని పర్యవసానం జలియన్‌వాలా బాగ్తోనే ఆంగ్లేయుల రాజనీతిజ్ఞత మీద సందేహాలు మొదలైనాయి. జిన్నా కూడా ఆ బిల్లును తీవ్రంగా విమర్శించి కౌన్సిల్‌కు రాజీనామా కూడా ఇచ్చారు. శాస్త్రి నాడు జరిపిన విదేశీ పర్యటనలు, వాటి ప్రాధాన్యం మరో ముఖ్యమైన అంశం. 1922లో వాషింగ్టన్లో జరిగిన నావికా ఆయుధ సంపత్తి పరిమితి మీద ఏర్పాటైన సదస్సుకు శాస్త్రిని ఆంగ్ల ప్రభుత్వం ప్రతినిధిగా పంపించింది. ఆ తరువాత సంవత్సరం ఇంగ్లండ్‌లో పర్యటించి కెన్యాలోని భారతీయులకు సమాన హక్కులు ఇవ్వాలని ప్రచారం చేశారు. మలేసియాలోని భారతీయ కార్మికుల బాగోగుల గురించి దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన సంఘంలో కూడా శాస్త్రిని ఆంగ్ల ప్రభుత్వం సభ్యునిగా నియమించింది. ఇంగ్లండ్‌లో చాలా అరుదుగా ఇచ్చే పౌర పురస్కారం రైట్ ఆనరబుల్ను నాటి ప్రభుత్వం శాస్త్రికి (మాంటేగ్‌కు కూడా ఇదే బిరుదు ఉండేది) ఇచ్చింది. ఒకసారి నాగ్‌పూర్‌లో విద్యార్థులను ఉద్దేశించి శాస్త్రి వేసిన ప్రశ్నతో ఇది ముగించవచ్చు. 1905 నుంచి 1946 వరకు జరిగిన భారత స్వాతంత్య్రోద్యమానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయనే ఒక సందర్భంలో ఆ ప్రశ్న సంధించారు. ‘రాజకీయవేత్త జంటిల్మెన్ కాగలడా?’ అని. దానికి ఆయన సమాధానం సరే. అది ఎంతో ఆదర్శనీయంగా కూడా ఉంది. కానీ ఇప్పుడు వచ్చే సమాధానం ఏమిటి? · ∙డా. గోపరాజు నారాయణరావు -
ఉప్పు సత్యాగ్రహం
ఉప్పు సత్యాగ్రహాన్నే శాసనోల్లంఘనోద్యమం, పౌర నియమ అతిక్రమణ ఉద్యమం, దండి సత్యాగ్రహం అంటారు. 1929లో లాహోర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి నెహ్రూ అధ్యక్షత వహించారు. ఇందులో ఆయన పూర్ణస్వరాజ్ తీర్మానం చేశారు. దీని ప్రకారం 1930 జనవరి 26న భారత ప్రజలు స్వాతంత్య్ర సంబరాలు జరుపుకోవాలి. త్రివర్ణ పతాకాలను చేపట్టి ప్రజలందరూ ఐక్యత చాటాలి. పన్నులు కట్టకుండా బ్రిటిష్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలి. గాంధీజీ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో బ్రిటిష్ వారికి 11 అంశాలు విన్నవించారు. వాటిలో ‘స్వరాజ్య’ అంశం లేదు. ఉప్పుపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ ఉప్పు సత్యాగ్రహం చేపట్టాలని గాంధీజీ పిలుపునిచ్చారు. 78 మంది అనుచరులతో 240 మైళ్ల దూరం నడిచి 1930 ఏప్రిల్ 6న దండి ప్రాంతం చేరుకున్నారు. ఇది అరేబియా సముద్ర తీర ప్రాంతం.ఈ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించి గాంధీజీ అరెస్టయ్యారు. ఈ ఉద్యమంలో భాగంగా మద్యపాన శాలలు, విదేశీ వస్త్ర దుకాణాల ముందు ధర్నా, రాస్తారోకో వంటి నిరసన కార్యక్రమాలు అహింసాయుతంగా నిర్వహించారు. గాంధీజీ పిలుపుతో దేశం నలువైపుల నుంచీ ఉద్యమ నాయకుడి సారథ్యంలో ప్రజలు నిరసనలు తెలిపారు. అస్సాంలోని సిల్హెట్, బెంగాల్‌లోని నౌఖాలీ, మద్రాస్ రాష్ర్టంలోని మద్రాస్, ఆంధ్ర, కేరళలోని కాలికట్, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, నేటి పాకిస్తాన్‌లోని (ఆనాటి భారత్) పెషావర్ తదితర ప్రాంతాల్లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం వివిధ నిరసన రూపాల్లో జరిగింది. గహర్వాల్ ప్రాంతంలో ప్రజలపై కాల్పులు జరపడానికి సైనికులు నిరాకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ర్టలోని షోలాపూర్‌లో వస్త్ర పరిశ్రమ కార్మికులు సమ్మెకు దిగారు. ‘ఎత్తిన జెండా దించని’ ఉద్యమం కూడా ఇందులో భాగంగా ప్రారంభమైంది. సామ్రాజ్యవాదానికి, దాని అణచివేత విధానాలకు, పన్నుల పెంపుదలకు వ్యతిరేకంగా శాసనోల్లంఘనోద్యమం జరిగింది. ఈ ఉద్యమం వల్ల మద్యపానం, విదేశీ వస్త్రాల వాడకం తగ్గి, స్వదేశీ వస్త్ర, వస్తు వాడకం పెరిగింది. ఆంధ్రలో ఉద్యమ సారథి.. ‘దేశభక్త’ బిరుదాంకితులు కొండా వేంకటప్పయ్య. కొమరవోలు, సీతానగరం, పల్లిపాడు ఆశ్రమాలు ఉద్యమ కేంద్రాలుగా ప్రజలు, నాయకులు విజృంభించారు. మద్రాసులో ఆంధ్ర ప్రాంత నాయకులైన కాశీనాథుని నాగేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ కీలకపాత్ర పోషించారు. స్త్రీలు సైతం ఈ ఉద్యమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశాలు, ఇతర పరిస్థితుల ఆధారంగా 1934 మే 20న శాసనోల్లంఘనోద్యమాన్ని నిలిపేశారు. ఈ ఉద్యమాన్ని జాతి ఐక్యతకు చిహ్నంగా భావించవచ్చు. ఉప్పుసత్యాగ్రహం-ప్రముఖులు సి. రాజగోపాలాచారి ఠ తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు నడిచి ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. దక్షిణాది ఉప్పు సత్యాగ్రహ నాయకుడు. అబ్బాస్ త్యాబ్జీ ‘గ్రాండ్ ఓల్డ్‌మ్యాన్ ఆఫ్ గుజరాత్’గా ప్రసిద్ధులు. గాంధీజీ అరెస్ట్ తర్వాత ఈ ఉద్యమానికి త్యాబ్జీ నాయకత్వం వహించారు. గాంధీ వారసుడిగా ఈ ఉద్యమంలో కీర్తి పొందారు. ఖాన్ అబ్దుల్ గపార్ ఖాన్ సరిహద్దు (ఫ్రాంటియర్) గాంధీగా పిలుస్తారు. పఠాన్లను ఈ ఉద్యమంలో ముందుండి నడిపింు. పెషావర్‌లో (నేటి పాకిస్తాన్లో) సత్యాగ్రహం సాగించారు. ‘ఖుదైఖిద్మత్ఘర్’ (దైవ సేవకులు) స్థాపించారు. దీని యూనిఫాం రెడ్‌షర్‌ట్స. ఫక్తూన్ అనే వార్తా పత్రిక ఏర్పాటు చేశారు. వెబ్మిల్లర్ ధరశామ (దర్శన) ఉప్పు డిపోపై దాడి, ఇతర సంఘటనలను రాసిన అమెరికా ప్రతికా (యునెటైడ్ ప్రెస్) విలేకరి. కేలప్పన్ కాలికట్ నుంచి పాయనూర్కు యాత్ర సాగించి సత్యాగ్రహం చేశారు. రామ్సే మెక్‌డొనాల్డ్ 1932, ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డ ప్రకటించారు. దీని ప్రకారం వివిధ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తారు. వెర్డవుడ్బెన్ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ కాలంనాటి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి. ఇర్విన్ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన కాలం నాటి భారత బ్రిటిష్ వైస్రాయ్. 1931 మార్చి 5న గాంధీతో చర్చలు జరిపారు. ఇతడిని క్రిస్టియన్ వైస్రాయ్ అంటారు. ఖాన్ సాహిబ్ ఉత్తరప్రదేశ్‌లో ఉప్పు సత్యాగ్రహోద్య మంలో రైతులకు నేతృత్వం వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహాన్ని.. ఏల్బా నుంచి పారిస్ వరకు నెపోలియన్ చేపట్టిన యాత్రతో పోల్చారు. ఈ ఉద్యమాన్ని నిలిపేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. సరోజినీ నాయుడు ఉప్పు సత్యాగ్రహ రాణి అని కీర్తి పొందారు. ధరశామ ఉప్పు కొటారు దాడిలో కీలక పాత్ర పోషించారు. గాంధీతోపాటు వ్యక్తిగత హోదాలో 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. మదన్ మోహన్ మాలవ్య 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో గాంధీతోపాటు హాజరయ్యారు. 1915లో వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించారు. మహాత్మ అని గౌరవం పొందారు. సత్యమేవ జయతే అనే సూక్తిని వ్యాప్తి చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 1930, 1931, 1932ల్లో రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. కమ్యూనల్ అవార్డులను ప్రకటింపజేయడంలో సఫలీకృతులయ్యారు. పురుషోత్తందాస్ టాండన్ రాజర్షి బిరుదాంకితులు. ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఉప్పు సత్యాగ్రహంలో నె్రహూతోపాటు అరెస్టయ్యారు. కృష్ణన్ పిళ్లై కేరళలో ‘ఎత్తిన జెండా దించని’ స్వాతంత్య్ర సమరవీరుడు. లార్డ విల్లింగ్టన్ ఈ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో భారత వైస్రాయ్గా ఇర్విన్ తర్వాత వచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దండి యాత్ర ఎలా జరగాలో గాంధీజీ సూచన మేరకు ఏర్పాట్లు చేశారు. దండిలో గాంధీ కంటే ముందే అరెస్టయ్యారు. మణిలాల్ గాంధీ ధరశామ ఉప్పు డిపో వద్ద రెండు వేల మంది కార్యకర్తలతో సత్యాగ్రహం చేశారు. కొండా వేంకటప్పయ్య ఉప్పు సత్యాగ్రహాన్ని సమర్థంగా నిర్వహించారు. ఆంధ్ర దేశ శాసనోల్లంఘనోద్యమంలో కీలక పాత్ర పోషించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి ‘కవిరాజు’ అని పిలుస్తారు. సూతాశ్రమం ఈయన స్వగృహం. ఉప్పుసత్యాగ్రహం సందర్భంగా ‘‘వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెల్పుడి’’ అని రాశారు. సూత పురాణం, శంభూక వథ రాశారు. గైడిన్లూ రాణి గైడిన్లూగా పేర్గాంచిన ఈమె నాగాలాండ్‌కు చెందినవారు. శాసనోల్లంఘనోద్యమంలో కీలక పాత్ర పోషించారు. రింగామి నాగాలకు నాయకత్వం వహించారు. శరణు రామస్వామి చౌదరి ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో తెనాలిలో ఊరేగింపుగా వస్తుండగా ఈయనను చూసి త్రిపురనేని రామస్వామి ‘‘వీరగంధము తెచ్చినారము’’ గేయం పాడారు. ఉన్నవ లక్ష్మీనారాయణ శాసనోల్లంఘనోద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారు. మాలపల్లి, బుడబుక్కల జోస్యం మొదలైన గ్రంథాలు రాశారు. గాంధేయవాది, హరిజనోద్ధారకుడు. దండు నారాయణరాజు ఉప్పుసత్యాగ్రహంలో అరెస్టయి నెల్లూరు జైల్లో మరణించారు. బులుసు సాంబమూర్తి ‘మహర్షి’ బిరుదాంకితులు. శాసనోల్లంఘనోద్యమంలో తీవ్ర లాఠీ దెబ్బలు తిన్నారు. తెన్నేటి విశ్వనాథం విశాఖపట్నంలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. తోట నర్సయ్య నాయుడు ఆంధ్రలో ‘ఎత్తిన జెండా దించని’ స్వాతంత్య్రయోధుడిగా కీర్తిపొందారు. ఈయనను జెండా నర్సయ్య అంటారు. బెజవాడ గోపాలరెడ్డి నెల్లూరులోని మైపాడు బీచ్ ప్రాంతంలో ఉప్పు తయారు చేసి పురవీధుల్లో విక్రయించారు. అయ్యదేవర కాళేశ్వరరావు గాంధీజీ పిలుపుతో ఆంధ్రలో తొలిసారిగా ఉప్పు సత్యాగ్రహాన్ని మచిలీపట్నంలో నిర్వహించారు. కల్లూరి సుబ్బారావు రాయలసీమ (బళ్లారి) ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారు. రాయలసీమ కురువృద్ధుడుగా ప్రసిద్ధులు. టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసులో తన స్వగృహం ‘వేదవనం’లో సత్యాగ్రహ శిబిరాలు ఏర్పాటు చేశారు. గొల్లపూడి సీతారామశాస్త్రి గాంధీజీ పిలుపుతో ఆంధ్రలో కల్లు చెట్ల నరికివేత కార్యక్రమం చేపట్టారు. ఈయననే స్వామి సీతారాం అంటారు. శాసనోల్లంఘనోద్యమంలో కీలకపాత్ర పోషించారు. జగ్గన్న శాస్త్రి ఈ ఉద్యమ కాలంలో ‘బార్డోలీ సత్యాగ్రహ విజయం’, ‘భారత స్వరాజ్య యుద్ధం’ లాంటి గీతాలు రాశారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య ‘మచిలీపట్నం నా మక్కా’ అని ప్రబోధించారు. ఉప్పు సత్యాగ్రహాన్ని చిత్తశుద్ధితో నిర్వహించారు. ‘భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర’ అనే గ్రంథం రాశారు. 1948లో జైపూర్ ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. జేవీపీ కమిటీ (ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటుకు)లో సభ్యుడు. రావి నారాయణరెడ్డి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో డాక్టర్ రామారావు సహకారంతో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. ఈయన ప్రముఖ తెలంగాణ కమ్యూనిస్ట్ నాయకుడు. బొమ్ము శేషారెడ్డి నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. మైపాడులో ఉప్పు సత్యాగ్రహం స్థూపం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పల్లెపాడును ఉప్పు సత్యాగ్రహ కేంద్రంగా చేసు కున్నారు. ఓరుగంటి వెంకటసుబ్బయ్య నెల్లూరు జిల్లా మైపాడులో 1930 ఏప్రిల్ 11న ఉప్పు తయారు చేసి తిప్పరాజు వారి సత్రం వద్ద విక్రయించారు. షేక్ ఫకీర్ నెల్లూరు జిల్లా మైపాడులో ఉప్పు తయారు చేసి పట్టణంలో విక్రయించారు. ఎన్.జి. రంగా 1930లో గాంధీజీ పిలుపుతో తన ప్రొఫెసర్ వృత్తికి రాజీనామా చేశారు. రైతులతో మమేకమై వారి శ్రేయోభివృద్ధికి కృషిచేశారు. ఖాసా సుబ్బారావు ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారు. సి. రాజగోపాలాచారి సహాయ సహకారాలతో స్వరాజ్య పత్రికను స్థాపించారు. ఎర్నేని సుబ్రమణ్యం దండి యాత్రలో గాంధీజీతోపాటు పాల్గొన్న 78 మంది అనుచరుల్లో ఏకైక ఆంధ్రుడు. కొమరవోలులో ఆశ్రమాన్ని స్థాపించారు. బ్రహ్మాజోశ్యుల సుబ్రమణ్యం సీతానగర ఆశ్రమ స్థాపకులు. దీన్ని ‘ఆంధ్రా దండి’ అంటారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఈ ఉద్యమాన్ని తనదైన శైలిలో నిర్వహించారు. మహిళల కోసం ‘సౌందర్యవల్లి’ పత్రిక నడిపారు. ఆంగ్ల పదం ఎడిటర్‌కు ‘సంపాదకుడు’ అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టారు. రామదాసు పంతులు ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో కేంద్ర శాసన సభకు రాజీనామా చేశారు. స్వామి వెంకటాచలం ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా శాసన మండలికి రాజీనామా చేశారు. ప్రతివాద భయంకరాచారి సామర్లకోట వాసి. కాకినాడ బాంబు (1933) కేసు సంఘటనలో అరెస్టయ్యారు. ఓరుగంటి రామచంద్రయ్య కాకినాడ బాంబు కేసులో అరెస్టయిన బాలుడు. తర్వాత ఆంధ్రా వర్సిటీ నుంచి చరిత్ర విభాగంలో పట్టా పొంది ఆచార్యుడయ్యారు. బసవరాజు అప్పారావు ‘కొల్లాయి గడితేనేమి.. మా గాంధీ కోమటై పుడితేనేమి’ గీతం రాశారు. క్రొవ్విడి లింగరాజు ఈ ఉద్యమ సమయంలో దేశద్రోహ నేరంపై జైలుకెళ్లారు. ఈయన ‘ది కాంగ్రెస్’ పత్రిక సంపాదకులు. మాక్సిం గోర్కీ రాసిన రష్యన్ నవల ‘ది మదర్’ను ‘అమ్మ’ పేరుతో తెలుగులోకి అనువదించారు. మాగంటి బాపినీడు ఉప్పు సత్యాగ్రహాన్ని అంచనా వేయడానికి లండన్ నుంచి భారత్ లీగ్ ప్రతినిధులుగా భారత్ వచ్చిన వి.కె. కృష్టమీనన్, హెరాల్డ్లాస్కి, బెర్ట్రాండ్ రస్సెల్ వంటి వారికి ఆంధ్ర ప్రాంత పరిస్థితులు చూపించి తీవ్రత వివరించారు. ఎం.వెంకటరమణరావు అసిస్టెంట్ ప్రొఫెసర్, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లగొండ. -
పతాక స్థాయి నుంచి పతనం దాకా..
-
చీలి చీలి చివరికిలా..
కాంగ్రెస్ చరిత్ర సమస్తం పీలికల పరాయణత్వం దేశంలో శతాబ్దికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరే పార్టీలోనూ లేనన్ని చీలికలకు గురైంది. స్వాతంత్య్రానికి ముందే రెండుసార్లు చీలిన కాంగ్రెస్.. స్వాతంత్య్రం వచ్చాక పదుల సంఖ్యలో చీలికల పాలైంది. చీలికలు పీలికలై, అంతర్గత కీచులాటలతో సతమతమవుతున్నా, సంకీర్ణయుగంలోనూ ఉనికి నిలుపుకొని అధికారాన్ని చేజిక్కించుకోగలగడమే కాంగ్రెస్ ప్రత్యేకత. ఏఓ హ్యూమ్ 1885లో ప్రారంభించిన కాంగ్రెస్ స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించింది. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్ర బోస్ వంటివారు పార్టీ అధ్యక్షులుగా కొనసాగారు. కాంగ్రెస్ నుంచి చీలిపోయి ఏర్పడిన కొన్ని పార్టీలు కొంతకాలం మనుగడ సాగించినా, తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనమయ్యాయి. మరికొన్ని ఉనికిలోనే లేకుండా పోయాయి. కొన్ని తమ ప్రాంతాల్లో బలమైన శక్తులుగా ఎదిగాయి. కాంగ్రెస్ చీలికలపై విహంగ వీక్షణం... పన్యాల జగన్నాథదాసు స్వరాజ్ పార్టీ (1923): బెంగాల్ నాయకుడు చిత్తరంజన్ దాస్, తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి వేరుపడిన వర్గం స్వరాజ్ పార్టీగా తెరపైకి వచ్చింది. ప్రధానంగా బెంగాల్‌కే పరిమితమైన ఈ పార్టీ పుష్కరకాలం అతికష్టంపై మనుగడ సాగించింది. ఇందులోని నేతలంతా 1935లో తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (1939): సుభాష్‌చంద్ర బోస్, శీల్‌భద్ర యాగీ, శార్దూల్‌సింగ్ కవీశ్వర్ల నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ ప్రస్తుతం ఈ పార్టీ వామపక్ష కూటమిలో కొనసాగుతోంది. కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ (1951): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు జీవత్రామ్ కృపలానీ నాయకత్వంలో ఏర్పడిన ఈ పార్టీ అప్పటి మైసూరు, మద్రాసు, వింధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో పనిచేసేది. మరుసటి ఏడాదే ఇది సోషలిస్టు పార్టీతో విలీనమై, ప్రజా సోషలిస్టు పార్టీగా తెరపైకి వచ్చింది. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు శివకుమార్ శర్మ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీని గత ఏడాది ఫిబ్రవరి 21న పునఃప్రారంభించారు. హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీ (1951): టంగుటూరి ప్రకాశం, ఎన్జీ రంగాల నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ ఎక్కువకాలం మనుగడ కొనసాగించకుండానే కృపలానీ నేతృత్వంలోని కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో విలీనమైపోయింది. ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ (1956): సి.రాజగోపాలాచారి నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ అప్పటి మద్రాసు రాష్ట్రంలో బలంగానే ప్రభావం చూపినా, 1959లో స్వతంత్ర పార్టీలో విలీనమైపోయింది. కేరళ కాంగ్రెస్ (1964): కేరళ నాయకుడు కె.ఎం.జార్జి నేతృత్వంలో చీలిపోయిన కాంగ్రెస్ నేతలు కేరళ కాంగ్రెస్‌ను స్థాపించారు. తర్వాతి కాలంలో ఇందులోనూ చీలికలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కేరళ కాంగ్రెస్ (బి), కేరళ కాంగ్రెస్ (జాకబ్), కేరళ కాంగ్రెస్ (థామస్) ఉనికిలో ఉన్నాయి. ఒరిస్సా జన కాంగ్రెస్ (1966): ఒరిస్సా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతాబ్ నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ స్వతంత్ర పార్టీతో కలసి 1967లో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1977లో జనతా పార్టీలో విలీనమై ఉనికి కోల్పోయింది. భారతీయ క్రాంతిదళ్ (1967): అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ ఈ పార్టీని స్థాపించారు. దీనిని 1977లో జనతా పార్టీలో విలీనం చేశారు. బంగ్లా కాంగ్రెస్ (1967): బెంగాలీ నేత అజయ్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన బంగ్లా కాంగ్రెస్ రెండుసార్లు సీపీఎంతో కలసి రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంది. అజయ్ ముఖర్జీనే రెండుసార్లూ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం కారణంగా పార్టీ బలం క్షీణించడంతో తిరిగి కాంగ్రెస్‌లోనే పార్టీని విలీనం చేశారు. మణిపూర్ పీపుల్స్ పార్టీ (1969): మహమ్మద్ అలీముద్దీన్ నేతృత్వంలో విడిపోయిన వర్గం స్థాపించిన ఈ పార్టీ నేటికీ మనుగడ సాగిస్తోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) (1969): కాంగ్రెస్‌లో ‘సిండికేట్’గా పేరుమోసిన కామరాజ్, మొరార్జీ దేశాయ్ తదితరులు ఈ పార్టీని ప్రారంభించారు. అనతి కాలంలోనే ఇది జనతా పార్టీలో విలీనమైపోయింది. ఉత్కళ్ కాంగ్రెస్ (1969): ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు బిజూ పట్నాయక్ ఈ పార్టీని స్థాపించారు. 1969 ఎన్నికల్లో ఉత్కళ్ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రస్థానం తెలంగాణ ప్రజా సమితి (1969): తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ, 1971లో తిరిగి కాంగ్రెస్‌లో విలీనమైంది. కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ (1977): మాజీ ఉపప్రధాని జగ్జీవన్‌రామ్ 1977 సాధారణ ఎన్నికల ముందు ప్రారంభించిన ఈ పార్టీ, ఎన్నికల తర్వాత జనతా పార్టీలో విలీనమైపోయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (రెడ్డి) (1978): కాసు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె కాంగ్రెస్ (ఐ) ప్రారంభించగా, బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో మిగిలిన పార్టీని ఎన్నికల కమిషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (రెడ్డి)గా గుర్తించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (అర్స్) (1979): కర్ణాటక మాజీ సీఎం దేవరాజ్ అర్స్ నాయకత్వంలో కర్ణాటక, కేరళ, మహారాష్ట్రకు చెందిన నేతలు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. తర్వాత అర్స్ జనతా పార్టీలో చేరిపోగా, యశ్వంత్‌రావు చవాన్, బ్రహ్మానందరెడ్డి తదితరులు కాంగ్రెస్ (ఐ)లో చేరిపోయారు. ఏకే ఆంటోనీ నేతృత్వంలో అర్స్ పార్టీ నుంచి చీలిపోయిన వర్గం కేరళలో కాంగ్రెస్ (ఏ) పేరిట వేరు కుంపటి పెట్టుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్ట్) (1981): మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి శరద్ పవార్ అప్పట్లో అర్స్ వర్గంలో పలువురు నేతలు చెదిరిపోగా మిగిలిన పార్టీ పగ్గాలు చేపట్టారు. పార్టీ పేరును ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్ట్)గా మార్చారు. కేరళలో ఈ పార్టీ కొన ఊపిరితో మనుగడ సాగిస్తోంది. కె.రామచంద్రన్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పార్టీ 2007లో ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (జగ్జీవన్) (1981): అర్స్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జగ్జీవన్‌రామ్ మరోసారి చీలిక పార్టీని ఏర్పాటు చేశారు. బీహార్‌కు మాత్రమే పరిమితమైన ఈ పార్టీ 1986లో జగ్జీవన్ మరణించేంత వరకు కొనసాగింది. వేరుకుంపట్ల పరంపర... మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీ హత్య సంఘటనల అనంతరం కాంగ్రెస్‌లో లెక్కకు మిక్కిలిగా చీలికలు ఏర్పడ్డాయి. అస్సాం మాజీ సీఎం శరత్చంద్ర సిన్హా నాయకత్వంలో 1984లో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్టు), 1986లో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్, 1988లో శివాజీ గణేశన్ నేతృత్వంలో తమిళ మున్నేట్ర మున్నని పార్టీలు ఏర్పడ్డాయి. ఎన్డీ తివారీ, అర్జున్ సింగ్, నట్వర్సింగ్ల నాయకత్వంలో 1994లో ఆలిండియా ఇందిరా కాంగ్రెస్(తివారీ), బంగారప్ప నేతృత్వంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాయి. కర్ణాటక కాంగ్రెస్‌ను అనతికాలంలోనే కాంగ్రెస్‌లో విలీనం చేసిన బంగారప్ప, 1996లో కర్ణాటక వికాస్ పార్టీని ఏర్పాటు చేసి, దాన్ని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1996లో గెగాంగ్ అపాంగ్ నేతృత్వంలో అరుణాచల్ కాంగ్రెస్, జీకే మూపనార్ నేతృత్వంలో తమిళ మానిల కాంగ్రెస్, మాధవరావు సింధియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ వికాస్ కాంగ్రెస్ ఏర్పడ్డాయి. ఇవన్నీ తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనమయ్యాయి. మమతా బెనర్జీ నాయకత్వంలో 1997లో ఏర్పడిన తృణమూల్ కాంగ్రెస్, ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉంది. 1998లో ఫ్రాన్సిస్ డిసౌజా నేతృత్వంలో గోవా రాజీవ్ కాంగ్రెస్ పార్టీ, ముకుట్ మిఠి నేతృత్వంలో అరుణాచల్ కాంగ్రెస్ (మిఠి), శీష్రామ్ ఓలా నేతృత్వంలో ఆలిండియా ఇందిరా కాంగ్రెస్ (సెక్యులర్), సురేశ్ కల్మాడీ నాయకత్వంలో మహారాష్ట్ర వికాస్ అఘాడి ఏర్పడ్డాయి. 1999లో బీహార్ మాజీ సీఎం జగన్నాథ మిశ్రా ఆధ్వర్యంలో భారతీయ జన కాంగ్రెస్, శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ల నేతృత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రారంభమయ్యాయి. వీటిలో ప్రస్తుతం ఎన్సీపీ మాత్రమే ఉంది. 2000లో ఫ్రాన్సిస్కో సర్దిన్హా నేతృత్వంలో గోవా పీపుల్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది. 2001లో ప్రస్తుత కేంద్ర మంత్రి చిదంబరం నాయకత్వంలో కాంగ్రెస్ జననాయక పెరవై, కుమారి అనంతన్ నేతృత్వంలో తొండర్ కాంగ్రెస్, పి.కణ్ణన్ నేతృత్వంలో పాండిచ్చేరి మక్కల్ కాంగ్రెస్ ఏర్పడ్డాయి. 2002లో జాంబవంతరావు ధోలే నాయకత్వంలో ఏర్పడిన విదర్భ జనతా కాంగ్రెస్ ఇప్పటికీ పనిచేస్తోంది. 2003లో అరుణాచల్ నేత కమెంగ్ డోలో నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ (డోలో) బీజేపీలో విలీనమైంది. 2005లో పుదుచ్చేరి మున్నేట్ర కాంగ్రెస్ పేరిట పి.కణ్ణన్ మరోసారి చీలిక పార్టీ పెట్టి, దానిని తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనం చేశారు. 2005లో కేరళ నాయకుడు కె.కరుణాకరన్ డెమోక్రటిక్ ఇందిరా కాంగ్రెస్ ప్రారంభించారు. దీనిని ఎన్సీపీలో విలీనం చేయగా, కరుణాకరన్, ఆయన కుమారుడు మురళీధరన్ మాత్రం కాంగ్రెస్‌లో చేరారు. 2007లో అత్యధికంగా చీలిక పార్టీలు ఏర్పడ్డాయి. భజన్‌లాల్ నేతృత్వంలో హర్యానా జనహిత కాంగ్రెస్ (బీఎల్), ఏకే ఆంటోనీ నేతృత్వంలో కాంగ్రెస్ (ఏ), సుఖ్రామ్ నేతృత్వంలో హిమాచల్ వికాస్ కాంగ్రెస్, బన్సీలాల్ నేతృత్వంలో హర్యానా వికాస్ పార్టీ, వాహెంగ్‌బామ్ నిపాంచా సింగ్ నేతృత్వంలో మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ, వి.రామమూర్తి నేతృత్వంలో తమిళగ రాజీవ్ కాంగ్రెస్ ఏర్పడ్డాయి. బెంగాలీ నేత సోమేంద్రనాథ్ మిత్రా నేతృత్వంలో 2009లో ఏర్పడిన ప్రగతిశీల ఇందిరా కాంగ్రెస్ అనతికాలంలోనే తృణమూల్ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగింది. పుదుచ్చేరిలో ఎన్.రంగస్వామి 2011లో ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించారు. -
కాంగ్రెస్ అభ్యర్థికి సల్మాన్ మద్దతు
ముంబై: వాయవ్య ముంబై లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు గురుదాస్ కామత్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మద్దతు ప్రకటించారు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అన్ని అర్హతలు కామత్‌లో ఉన్నాయని, ఎవరైతే రాజకీయాల్లో ఉంటూ సమాజ సేవ చేయగలుగుతారో వారికే ప్రజలు గెలిపించాలని సల్మాన్ గొంతుతో రికార్డు చేసిన సందేశం వాయవ్యవ ముంబైలో హల్చల్ చేస్తోంది. అందులో కామత్‌కు నియోజకవర్గవాసులందరూ మద్దతు పలకాలని సల్మాన్ కోరాడు. కాగా ఇదే నియోజకవర్గం నుంచి సల్మాన్ చిరకాల మిత్రుడు, నటుడు,నిర్మాత అయిన మహేశ్ మంజ్రేకర్ కూడా ఎంఎన్ఎస్ టికెట్‌పై బరిలో ఉన్నాడు. వీరే కాకుండా గజానన్ కీర్తివార్(శివసేన), రాఖీ సావంత్(నటి,ఆర్ఏపీ), కమల్‌ఖాన్ (ఎస్పీ) కూడా ఈ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. -
ప్రభుత్వ ఏర్పాటుకు గడువు ఇవ్వండి : కేజ్రీవాల్
తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వం, తీసుకోబోమని ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం పునరుద్ఘాటించారు. తాను ముఖ్యమంత్రి కావడానికో లేక అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ విముఖత వ్యక్తం చేయడంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అరవింద్ శనివారం ఉదయం లెప్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ.... ప్రభుత్వ ఏర్పాటుపై 10 రోజుల గడువు కావాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను గడువు కోరినట్లు ఆయన తెలిపారు. అయితే ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇస్తామని ప్రకటించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆ పార్టీలు ఎందుకు మద్దుతు ఇస్తానంటున్నాయో అర్థం కావడం లేదని అరవింద్ వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీకి బేషరత్తుగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గవర్నర్‌కు లేఖ ఇచ్చిందని తెలిపారు. తమకు ఎందుకు మద్దతు ఇస్తామన్నారో కాంగ్రెస్, బీజేపీలు వెంటనే స్సష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తమకు మద్దతు ఇస్తే 15 ఏళ్ల పాటు షీలా ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ చేయిస్తామని, అందుకు సిద్ధమేనా అని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. దేశ రాజధాని ప్రజలను పట్టి పీడిస్తున్న విద్యుత్, తాగు నీటి సమస్యలు పరిష్కరించేందు తమతో కలసి నడుస్తాయా అంటూ కాంగ్రెస్,బీజేపీలకు అరవింద్ కేజ్రీవాల్ చురకులు అంటించారు. -
న్యూఢిల్లీలో బీజేపీ, ఆప్‌ల మధ్య పోటాపోటీ
న్యూఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా బీజేపీ, ఆప్ పార్టీల మధ్య పోటాపోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది.15 మంది బీజేపీ అభ్యర్థులు అధిక్యంలో ఉండగా, ఆప్ పార్టీ అభ్యర్థులు 13 మంది విజయపథంలో దూసుకుపోతున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరుగురు ముందంజలో ఉన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్ కూడా కృష్ణ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా విజయం వైపు దూసుకుపోతున్నారు. అయితే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన షీలా దీక్షిత్ సమీప ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ కంటే అధిక్యంలో కొనసాగుతున్నారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు ఐదుగురు అధిక్యంలో ఉన్నారు. -
ఆటుపోట్ల గతం... వెలుగులేని చరితం...
60 ఏళ్ల పాటు జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు భారత స్వాతంత్య్రోద్యమంలో ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన ఆంధ్ర ప్రజలను నిలువునా ముంచి మద్రాసును తమిళులకు కట్టబెట్టింది. ఆంధ్ర ప్రాంత ప్రజలకు, భారత జాతీయ కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం లోతైనది. 1885లో ఆ సంస్థ ఏర్పడినప్పటి నుంచి తెలు గువారు తమ సేవలు అందించారు. 1891 లోనే ఆంధ్రుడైన పనప్పాకం అనంతాచార్యు లు అధ్యక్షడయ్యాడు. 1918లో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన ఆంధ్ర కాంగ్రెస్ ఆవి ర్భవించింది. నిజానికి అప్పటికే, 1903లోనే గుంటూరు యువజన సాహితి ఆధ్యర్యంలో ప్రత్యేక రాష్ట్రం ఆలోచన మొదలైంది. 1913 లో బాపట్లలో ఆంధ్రమహాసభ ఇందుకు శంఖం పూరించింది. స్వాతంత్య్రోద్యమంతో సమాంతరంగా ఈ ఉద్యమం కూడా నడిచిం ది. భారత జాతీయ కాంగ్రెస్ నేతలు అటు జాతీయ భావంతో, ఇటు ఆత్మగౌరవం నినా దంతో ఈ ఉద్యమంలో భాగం పంచుకు న్నారు. విజయనగర రాజ్యంలోని చంద్రగిరి సామంతరాజు చెన్నపట్నం అనే గ్రామాన్ని బ్రిటిష్ వారికి వ్యాపార నిమిత్తం అప్పగిం చాడు. దీని అభివృద్ధిలో తమిళుల పాత్ర ఎంతో, తెలుగువారి పాత్ర కూడా అంతే. తెలుగువారు 190 సంవత్సరాల పాటు పన్ను లు చెల్లించారు. మద్రాసు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆంధ్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటి 1920లో తీర్మానించింది. 1938లో ఆంధ్రమహాసభ కూడా మరోసారి అదే అం శాన్ని తీర్మానం రూపంలో వెల్లడించింది. కానీ నాటి మద్రాసు ముఖ్యమంత్రి సి. రాజగోపా లాచారి, తమిళ కాంగ్రెస్ ప్రముఖులు దీనిని వ్యతిరేకించారు. ఆ అంశం మీద నియమించిన ధార్ కమి షన్ (1948 జూన్ 17) కూడా భాషాప్రయుక్త రాష్ట్రాలు దేశ శ్రేయస్సుకు భంగకరమని నివే దించింది. ఇది ఆంధ్రులకు ఆశాభంగాన్ని, ఆగ్రహాన్ని కలిగించింది. కొన్ని పరిణామాల తరువాత 1949లో నెహ్రూ అధ్యక్షతన జేవీపీ కమిటీ ఏర్పాటైంది. ధార్ కమిషన్‌లోని అం శాలను పునః సమీక్షించి తన నివేదికను కాం గ్రెస్ వర్కింగ్ కమిటీకి సమర్పించింది. మద్రా స్ నగరాన్ని మినహాయించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆంధ్ర రాష్ర్ట నిర్మాణానికి మద్రాసు ప్రభుత్వంతో పాటు, తమిళ కాంగ్రెస్ నేతలు తమ అంగీకా రాన్ని తెలిపారు. టంగుటూరి ప్రకాశం నాయ కత్వంలో ఆంధ్ర కాంగ్రెస్ ప్రతినిధులు మద్రా సును వదులుకోవటానికి వ్యతిరేకించారు. మద్రాస్‌లో తమిళుల శాతం ఎక్కువగా ఉన్నం దున మద్రాస్‌ను ఆంధ్రులకు ఇవ్వలేమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అందరినీ ఒప్పించి ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటుకు మార్గం ఏర్పరిచింది. 1950 నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారరాజా అధ్యక్షతన విభజన కమిటీ ఏర్పాటు ఏర్పడింది. కొత్త రాజధాని ఏర్పడే వరకు మద్రాసే రాజధానిగా ఉండాలని ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు పట్టుపట్టినా తమిళులు ఒప్పుకో లేదు. చివరకు తన అసమ్మతిని లిఖిత పూర్వ కంగా రాసి ప్రకాశం పంతులు విభజన కమిటి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీన్ని సాకుగా తీసుకుని భారత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని వాయిదా వేసింది. కేంద్ర వైఖరికి, ఆంధ్ర కాంగ్రెస్ వైఫల్యానికి నిరస నగా 1952 మద్రాసు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రులు ఓడించారు. అప్ప టికే సహనం కోల్పోయి, పొట్టి శ్రీరాములు రాష్ర్ట సాధనకు 1952 అక్టోబర్ 19న మద్రా సులో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకు న్నారు. 58 రోజుల నిరశన తరువాత ప్రాణ త్యాగం చేశారు. ఆంధ్రుల ఆవేశం కట్టలు తెం చుకుంది. విధ్వంసం జరిగింది. దీనికి లొంగి ఢిల్లీ ఆంధ్ర రాష్ర్ట తాత్కాలిక రాజధానిగా మద్రాసును ప్రకటిస్తే తమిళ కాంగ్రెస్ నాయ కుల రాజీనామా చేస్తారని రాజాజీ నెహ్రూను బెదిరించాడు. ఈ పరిస్థితుల్లో మద్రాసును మినహాయించి వివాదాస్పదం కాని తెలుగు ప్రాంతాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం నిర్మించ డానికి భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు 1952 డిసెంబర్ 19న నెహ్రూ లోక్‌సభలో ప్రకటించారు. ప్రత్యేకాంధ్ర నిర్మాణంలో ఉత్ప న్నమయ్యే ఆర్థిక, పాలనాపరమైన సమస్య లను పరిష్కరించడానికి కైలాస్నాథ్ వాం చూని భారత ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా నియమించింది. ఆయన తన నివేదికను 1953 మార్చిలో సమర్పించారు. దాని ఆధా రంగా చేసుకుని టంగుటూరి ప్రకాశం పం తులు ముఖ్యమంత్రిగా, కర్నూలు రాజధా నిగా, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవ తరించింది. 60 సంవత్సరాలు జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు భారత స్వాతంత్య్రోద్యమంలో ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన ఆంధ్ర ప్రజలను నిలువునా ముంచి మద్రాసును తమిళులకు ఇచ్చివేసింది. మద్రాసును సాధిం చడంలో ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు ఘోరం గా విఫలమయ్యారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ నిర్మాణం కోసం 1953లో ఫజల్ అలీ కమిషన్ 1953 డిసెంబర్ 30న తన నివేదికను సమర్పించింది. దీని ప్రకారం తెలంగాణ ఆం ధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం వలన ఉభయ ప్రాంతాల వారికి ఎన్నో ప్రయోజనాలున్నా యని చెప్పిన సిఫార్సు మేరకు 1956లో ఆంధ్ర-తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పంద షరతుల అంగీకారం మేరకు హైద రాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కలుపుతూ 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. - డాక్టర్ కె. చిట్టిబాబు