కాంగ్రెస్ అభ్యర్థికి సల్మాన్ మద్దతు | Actor Salman Khan 'awestruck' by Congress nominee Gurudas Kamat | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ అభ్యర్థికి సల్మాన్ మద్దతు

Published Tue, Apr 1 2014 10:51 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

Actor Salman Khan 'awestruck' by Congress nominee Gurudas Kamat

ముంబై: వాయవ్య ముంబై లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు గురుదాస్ కామత్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మద్దతు ప్రకటించారు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అన్ని అర్హతలు కామత్‌లో ఉన్నాయని, ఎవరైతే రాజకీయాల్లో ఉంటూ సమాజ సేవ చేయగలుగుతారో వారికే ప్రజలు గెలిపించాలని సల్మాన్ గొంతుతో రికార్డు చేసిన సందేశం వాయవ్యవ ముంబైలో హల్‌చల్ చేస్తోంది.

అందులో కామత్‌కు నియోజకవర్గవాసులందరూ మద్దతు పలకాలని సల్మాన్ కోరాడు. కాగా ఇదే నియోజకవర్గం నుంచి సల్మాన్ చిరకాల మిత్రుడు, నటుడు,నిర్మాత అయిన మహేశ్ మంజ్రేకర్ కూడా ఎంఎన్‌ఎస్ టికెట్‌పై బరిలో ఉన్నాడు. వీరే కాకుండా గజానన్ కీర్తివార్(శివసేన), రాఖీ సావంత్(నటి,ఆర్‌ఏపీ), కమల్‌ఖాన్ (ఎస్‌పీ) కూడా ఈ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement