![Salman Says Not Contesting Elections Nor Campaigning For Any Political Party - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/21/SALMAN.gif.webp?itok=qDUuSpDH)
ముంబై : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పోటీ చేస్తారని సాగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని, ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయాలనే ఉద్దేశం కూడా లేదని బాలీవుడ్ కండలవీరుడు స్పష్టం చేశారు. తనపై వస్తున్న వార్తలు వదంతులేనని, తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని..ఏ పార్టీ తరపున ప్రచారం కూడా చేయడంలేదని సల్మాన్ ట్వీట్ చేశారు.
కాగా సల్మాన్ ఖాన్‌ను ఇండోర్‌లో ప్రచారం చేసేందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న వార్తలతో పలు ఊహాగానాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇండోర్‌లో సల్మాన్‌తో ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడం దాదాపు ఖాయమని ఆ పార్టీ ప్రతినిధి పంకజ్ చతుర్వేది పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ ఇండోర్‌లో జన్మించడంతో ఇక్కడ ప్రచారం చేసేందుకు అంగీకరిస్తారని, ఆయన ప్రచారంతో తమ పార్టీ గెలుపు సులభసాధ్యమవుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. కాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇండోర్‌లో జన్మించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment