కాంగ్రెస్ అభ్యర్థికి సల్మాన్ ఖాన్ మద్దతు!
కాంగ్రెస్ అభ్యర్థికి సల్మాన్ ఖాన్ మద్దతు!
Published Tue, Apr 1 2014 7:28 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నేతకు మద్దతు తెలిపారు. వాయవ్య ముంబై స్తానం నుంచి బరిలోకి దిగిన గురుదాస్ కామత్ కు ఓటెయ్యాలని సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
కామత్ లో ఉండే నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ, సేవాగుణం లాంటి అంశాలు తనకు నచ్చాయని.. అందుకే ఆయనకు ఓటేయాలని చెబుతున్నానని సల్మాన్ తెలిపారు. రాజకీయాల్లో మంచి వ్యక్తిగా పేరున్న గురుదాస్ కామత్ కు ఓటర్లు బాసటగా నిలిచి గెలిపించాలని సల్మాన్ ఖాన్ ఓ వీడియో సందేశంలో వెల్లడించారు.
తన కోసం కాకుండా ప్రజల కోసం శ్రమించే కామత్ అండగా నిలువాలని వీడియో సందేశంలో వెల్లడించారు. వాయవ్య ముంబై అభివృద్ధికి కామత్ చేసిన కృషి అద్బుతమని సల్మాన్ తన సందేశంలో వెల్లడించారు. అయితే సల్మాన్ కు అత్యంత సన్నిహితుడైన సినీ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ఇదే స్థానం నుంచి ఎంఎన్ఎస్ టికెట్ పై బరిలో దిగారు.
Advertisement
Advertisement