ఆటుపోట్ల గతం... వెలుగులేని చరితం... | Special Story On Andhra Pradesh Formation Day | Sakshi
Sakshi News home page

ఆటుపోట్ల గతం... వెలుగులేని చరితం...

Published Fri, Nov 1 2013 1:19 AM | Last Updated on Sat, Jun 2 2018 2:23 PM

Special Story On Andhra Pradesh Formation Day

60 ఏళ్ల పాటు జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు భారత స్వాతంత్య్రోద్యమంలో ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన ఆంధ్ర ప్రజలను నిలువునా ముంచి మద్రాసును తమిళులకు కట్టబెట్టింది.
 
 ఆంధ్ర ప్రాంత ప్రజలకు, భారత జాతీయ కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం లోతైనది. 1885లో ఆ సంస్థ ఏర్పడినప్పటి నుంచి తెలు గువారు తమ సేవలు అందించారు. 1891 లోనే ఆంధ్రుడైన పనప్పాకం అనంతాచార్యు లు అధ్యక్షడయ్యాడు. 1918లో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన ఆంధ్ర కాంగ్రెస్ ఆవి ర్భవించింది. నిజానికి అప్పటికే, 1903లోనే గుంటూరు యువజన సాహితి ఆధ్యర్యంలో ప్రత్యేక రాష్ట్రం ఆలోచన మొదలైంది. 1913 లో బాపట్లలో ఆంధ్రమహాసభ ఇందుకు శంఖం పూరించింది. స్వాతంత్య్రోద్యమంతో సమాంతరంగా ఈ ఉద్యమం కూడా నడిచిం ది. భారత జాతీయ కాంగ్రెస్ నేతలు అటు జాతీయ భావంతో, ఇటు ఆత్మగౌరవం నినా దంతో ఈ ఉద్యమంలో భాగం పంచుకు న్నారు.  విజయనగర రాజ్యంలోని చంద్రగిరి సామంతరాజు  చెన్నపట్నం అనే గ్రామాన్ని బ్రిటిష్ వారికి వ్యాపార నిమిత్తం అప్పగిం చాడు. దీని అభివృద్ధిలో తమిళుల పాత్ర ఎంతో, తెలుగువారి పాత్ర కూడా అంతే. తెలుగువారు 190 సంవత్సరాల పాటు పన్ను లు చెల్లించారు. మద్రాసు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు  చేయాలని ఆంధ్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటి 1920లో తీర్మానించింది. 1938లో ఆంధ్రమహాసభ కూడా మరోసారి అదే అం శాన్ని తీర్మానం రూపంలో వెల్లడించింది. కానీ నాటి మద్రాసు ముఖ్యమంత్రి సి. రాజగోపా లాచారి, తమిళ కాంగ్రెస్ ప్రముఖులు దీనిని వ్యతిరేకించారు.
 
 ఆ అంశం మీద నియమించిన ధార్ కమి షన్ (1948 జూన్ 17) కూడా భాషాప్రయుక్త రాష్ట్రాలు దేశ శ్రేయస్సుకు భంగకరమని నివే దించింది. ఇది ఆంధ్రులకు ఆశాభంగాన్ని, ఆగ్రహాన్ని కలిగించింది. కొన్ని పరిణామాల తరువాత 1949లో  నెహ్రూ అధ్యక్షతన జేవీపీ కమిటీ ఏర్పాటైంది. ధార్ కమిషన్‌లోని అం శాలను పునః సమీక్షించి తన నివేదికను కాం గ్రెస్ వర్కింగ్ కమిటీకి సమర్పించింది. మద్రా స్ నగరాన్ని మినహాయించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆంధ్ర రాష్ర్ట నిర్మాణానికి మద్రాసు ప్రభుత్వంతో పాటు, తమిళ కాంగ్రెస్ నేతలు  తమ అంగీకా రాన్ని తెలిపారు. టంగుటూరి ప్రకాశం నాయ కత్వంలో ఆంధ్ర కాంగ్రెస్ ప్రతినిధులు మద్రా సును వదులుకోవటానికి వ్యతిరేకించారు.
 
 మద్రాస్‌లో తమిళుల శాతం ఎక్కువగా ఉన్నం దున మద్రాస్‌ను ఆంధ్రులకు ఇవ్వలేమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అందరినీ ఒప్పించి ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటుకు మార్గం ఏర్పరిచింది. 1950 నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారరాజా అధ్యక్షతన విభజన కమిటీ ఏర్పాటు ఏర్పడింది. కొత్త రాజధాని ఏర్పడే వరకు  మద్రాసే రాజధానిగా ఉండాలని ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు పట్టుపట్టినా తమిళులు ఒప్పుకో లేదు. చివరకు తన అసమ్మతిని లిఖిత పూర్వ కంగా రాసి ప్రకాశం పంతులు విభజన కమిటి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీన్ని సాకుగా తీసుకుని భారత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని వాయిదా వేసింది. కేంద్ర వైఖరికి, ఆంధ్ర కాంగ్రెస్  వైఫల్యానికి నిరస నగా 1952 మద్రాసు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రులు ఓడించారు. అప్ప టికే సహనం కోల్పోయి, పొట్టి శ్రీరాములు రాష్ర్ట సాధనకు  1952 అక్టోబర్ 19న మద్రా సులో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకు న్నారు. 58 రోజుల నిరశన తరువాత ప్రాణ త్యాగం చేశారు. ఆంధ్రుల ఆవేశం కట్టలు తెం చుకుంది. విధ్వంసం జరిగింది. దీనికి లొంగి ఢిల్లీ  ఆంధ్ర రాష్ర్ట తాత్కాలిక రాజధానిగా మద్రాసును ప్రకటిస్తే తమిళ కాంగ్రెస్ నాయ కుల రాజీనామా చేస్తారని రాజాజీ నెహ్రూను బెదిరించాడు.
 
 ఈ పరిస్థితుల్లో మద్రాసును మినహాయించి వివాదాస్పదం కాని తెలుగు ప్రాంతాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం నిర్మించ డానికి భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు 1952 డిసెంబర్ 19న నెహ్రూ లోక్‌సభలో ప్రకటించారు. ప్రత్యేకాంధ్ర నిర్మాణంలో ఉత్ప న్నమయ్యే ఆర్థిక, పాలనాపరమైన సమస్య లను పరిష్కరించడానికి  కైలాస్‌నాథ్ వాం చూని భారత ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా నియమించింది. ఆయన తన నివేదికను 1953 మార్చిలో సమర్పించారు. దాని ఆధా రంగా చేసుకుని టంగుటూరి ప్రకాశం పం తులు ముఖ్యమంత్రిగా, కర్నూలు రాజధా నిగా, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవ తరించింది.
 
 60 సంవత్సరాలు జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు భారత స్వాతంత్య్రోద్యమంలో ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన ఆంధ్ర ప్రజలను నిలువునా ముంచి మద్రాసును తమిళులకు ఇచ్చివేసింది. మద్రాసును సాధిం చడంలో ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు ఘోరం గా విఫలమయ్యారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ నిర్మాణం కోసం 1953లో ఫజల్ అలీ కమిషన్ 1953 డిసెంబర్ 30న తన నివేదికను సమర్పించింది. దీని ప్రకారం తెలంగాణ ఆం ధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం వలన ఉభయ ప్రాంతాల వారికి ఎన్నో ప్రయోజనాలున్నా యని చెప్పిన సిఫార్సు మేరకు 1956లో ఆంధ్ర-తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పంద షరతుల అంగీకారం మేరకు హైద రాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కలుపుతూ 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది.
 - డాక్టర్ కె. చిట్టిబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement