
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన యూట్యూబ్ చానల్ ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ ఆన్‌లైన్ నుంచి తొలగించబడింది. దీనిపై యూట్యూబ్ సంస్థ ఇంకా ఎలాంటి వివరణ రాలేదు. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. యూట్యూబ్ సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.
‘విద్రోహులు కావాలనే చానల్‌ను తొలగించారా? లేక సాంకేతిక పొరపాటే ఇందుకు కారణమా? అనేది తేలుస్తాం. ఇందుకు సంబంధించి గూగుల్/ యూట్యూబ్ సంస్థల ఉన్నతాధికారులతో సంప్రతింపులు జరుపుతున్నాం. సమస్యను వెంటనే పరిష్కరించి ఛానల్‌ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యాం’ అని పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో బుధవారం పేర్కొంది.
ఇదీ చదవండి: స్వతంత్ర మీడియాని అణచివేసేందుకు యత్నాలు
Comments
Please login to add a commentAdd a comment