ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'యూట్యూబ్' భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లు మరింత ఆదాయాన్ని పొందడానికి సరికొత్త మార్గాన్ని పరిచయం చేసింది. 'షాపింగ్ ప్రోగ్రామ్' పేరుతో పరిచయం చేసిన ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ వీడియోలలో ఉత్పత్తులను ట్యాగ్ చేయడం ద్వారా ఎక్కువ డబ్బు ఆర్జించవచ్చు.
ఇప్పటికే ఈ షాపింగ్ ప్రోగ్రామ్ అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు దీనిని భారతీయ కంటెంట్ క్రియేటర్ల కోసం పరిచయం చేసింది. దీనికోసం యూట్యూబ్ ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అర్హులైన వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.
షాపింగ్ ప్రోగ్రామ్ ఫీచర్ కోసం కంటెంట్ క్రియేటర్లు.. యూట్యూబ్ షాపింగ్‌లో సైనప్ అవ్వాలి. మీ అప్లికేషన్‌ను ప్లాట్‌ఫామ్ ఆమోదించిన తరువాత షాపింగ్ ప్రోగ్రామ్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీరు క్రియేట్ చేసే వీడియోలలో, షార్ట్స్, లైవ్ స్టీమ్ వంటి వాటిలో ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు, ఒక వీడియోకు సుమారు 30 ఉత్పత్తులను ట్యాగ్ చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తులు యూజర్లకు కనిపిస్తాయి.
యూజర్లు ఈ ఉత్పత్తులను చూసి, వారికి నచినట్లయితే దానిపైన క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు, అక్కడే కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేయడంతో యూట్యూబర్లకు కమీషన్ వస్తుంది. యూజర్ ఒక ప్రొడక్ట్ కొనుగోలు చేస్తే.. ఎంత కమీషన్ వస్తుందనే వివరాలను కూడా క్రియేటర్ అక్కడే చూడవచ్చు.
ఇదీ చదవండి: ముద్ర లోన్ లిమిట్ పెంపు: రూ.10 లక్షల నుంచి..
షాపింగ్ ప్రోగ్రామ్ ఫీచర్ యాక్సెస్ పొందాలంటే.. కంటెంట్ క్రియేటర్లు తప్పనిసరిగా కనీసం 10,000 సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి. అన్ని అర్హతలు ఉన్న క్రియేటర్‌లు సేల్స్ కమీషన్ పొందవచ్చు. అయితే భవిష్యత్తులో ఈ ఆదాయంలో వాటా తీసుకోవాలని యూట్యూబ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో అంశం ఏమిటంటే.. పిల్లల కోసం రూపోందించిన యూట్యూబ్ చానళ్లకు, మ్యూజిక్ చానళ్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment