వదంతులపై స్పందించను: షీలా దీక్షిత్ | Sheila Dikshit declines to comment on reports of Centre's move | Sakshi
Sakshi News home page

వదంతులపై స్పందించను: షీలా దీక్షిత్

Published Tue, Jun 17 2014 3:36 PM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM

వదంతులపై స్పందించను: షీలా దీక్షిత్ - Sakshi

వదంతులపై స్పందించను: షీలా దీక్షిత్

తిరువనంతపురం: యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లను తొలగించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం భావిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించేందుకు కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ నిరాకరించారు. ఊహాగానాలపై తాను స్పందించబోనని ఆమె స్పష్టం చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన షీలా దీక్షిత్ ను యూపీఏ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో కేరళ గవర్నర్ గా నియమించింది. కాగా, కర్ణాటక, అసోం, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు నేడు తమ పదవులకు రాజీనామా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement