ముఖ్యమంత్రి నివాసంలో 31 ఏసీల | Sheila Dikshit's official bungalow had 31 ACs | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి నివాసంలో 31 ఏసీల

Published Thu, Jul 3 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

ముఖ్యమంత్రి నివాసంలో 31 ఏసీల

ముఖ్యమంత్రి నివాసంలో 31 ఏసీల

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షీలాదీక్షిత్ అధికారిక నివాసంలో మొత్తం 31 ఏసీలు ఉన్నాయి. దీంతోపాటు 25 హీటర్లు కూడా ఉన్నాయి. ఈ విషయం సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దరఖాస్తు చేయడంతో వెలుగులోకి వచ్చింది. షీలా అధికారిక నివాసం 3-మోతీలాల్ నెహ్రూమార్గ్‌లో ఉంది. దీనిని ప్రస్తుతం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేటాయించింది. ఇందులో 31 ఏసీలు, 15 డెసర్ట్ కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీసర్లు ఉన్నాయి.
 
 అప్పటి ముఖ్యమంత్రి అవసరాలకు అనుగుణంగా ఈ భవనంలోని విద్యు త్ పరికరాలు, సామగ్రిని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రజాపనుల విభాగం (సీపీడబ్ల్యూ) రూ. 16.81 కోట్లు వెచ్చించింది. కేరళ గవర్నర్‌గా నియమితురాలైన షీలా ఈ నివాసం ఖాళీ చేసి వె ళ్లిపోయిన తర్వాతఅందులో బిగించిన పరికరాల వివరాలను సీపీడబ్ల్యూ వెల్లడిస్తూ... ఇందులో కొన్నింటిని అవసరాలనుబట్టి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమర్చామని పేర్కొంది. ఈ విషయాలను సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కార్యకర్త సుభాష్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు.
 
 ఢిల్లీకి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్‌కు అప్పట్లో ప్రభుత్వం నాలుగు పడక గదులు కలిగిన బంగ్లాను కేటాయించింది. ఈ భవనం 1920లో నిర్మితమైంది. దీనిని అప్పట్లో 3.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపాలవడం, ముఖ్యమంత్రి పీఠం నుంచి షీలాదీక్షిత్ తప్పుకోవడం తెలిసిందే. ఆ తర్వాత అప్పటి యూ పీఏ ప్రభుత్వం షీలాదీక్షిత్‌కు కేరళ గవర్నర్ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆమె తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి మధ్యఢిల్లీలోని ఫిరోజ్‌షారోడ్డు ప్రాంతంలోగల భారీ ఓ ప్రైవేటు భవనాన్ని కిరాయికి తీసుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement