సహనేత అజయ్ మాకెన్‌కు ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించడంపట్ల మాజీ ముఖ్యమంత్రి,
న్యూఢిల్లీ: సహనేత అజయ్ మాకెన్‌కు ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించడంపట్ల మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలాదీక్షిత్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తనను ఎవరూ పక్కన బెట్టలేదని, ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటాననే విషయాన్ని తానే స్వయంగా అధిష్టానానికి చెప్పానన్నారు. మాకెన్.. అనుభవం కలిగిన నాయకుడంటూ అభివర్ణించారు. విధానసభ ఎన్నికల్లో మాకెన్ నేతృత్వంలో తమ పార్టీ ప్రజల మద్దతు పొందుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా మాకెన్, షీలాదీక్షిత్‌ల మధ్య సంబంధాలు సరిగా లేవని తెలియవచ్చింది.