నమ్మకముంది.. మళ్లీ గెలుస్తాం: షీలా | Sheila Dikshit and Harsh Vardhan file nomination papers | Sakshi
Sakshi News home page

నమ్మకముంది.. మళ్లీ గెలుస్తాం: షీలా

Published Thu, Nov 14 2013 11:11 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

Sheila Dikshit and Harsh Vardhan file nomination papers

న్యూఢిల్లీ: రాష్ట్ర విధానసభకు డిసెంబర్ 4న జరగనున్న ఎన్నికల్లో తాను మళ్లీ గెలుస్తానని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ  నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న షీలా దీక్షిత్ గురువారం తన కుమారుడు, ఎంపీ సందీప్ దీక్షిత్, కుతురు లతికతో కలిసి జామ్‌నగర్ కార్యాలయానికి మధ్యాహ్నం 1.00 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట కాంగ్రెస్ మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి సంజీవ్ గుప్తాకు నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగోసారి కూడా తన విజయం ఖాయమని, ఈసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. షీలా ఈ మాటలంటున్న సమయంలో మద్దతుదారులు షాజాహాన్ రోడ్డును నినాదాలతో హోరెత్తించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement