కిషోర్-ములాయం భేటీపై షీలా ఆశ్చర్యం
నవంబర్ 1న ములాయంతో ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. అమర్ సింగ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మహాకూటమి గురించి కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని, తామింకా నిర్ణయం తీసుకోలేదని షీలా దీక్షిత్ తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా అని ప్రశ్నించగా... 'ఆయన మా పార్టీకి సలహాదారు, వ్యూహకర్త. ఆయన పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉందా, లేదా అనే విషయం సెక్రటరీలకు తెలుసు. నాకు తెలియద'ని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ పనితీరుపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన పనితీరుపై కాంగ్రెస్ వర్గాలు రెండు చీలిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.