సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వంటి ప్రముఖులపై ఈసారి చాలా మంది చోటామోటా నాయకులు పోటీకి దిగారు. షీలాదీక్షిత్ పోటీచేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో విధానసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తరువాత 17 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ పోటీచేస్తున్న కృష్ణానగర్‌లో తొమ్మిది మంది అభ్యర్థులు మిగిలారు. బురాడీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 29 మంది, పటేల్ నగర్ నియోజకవర్గం నుంచి అతి తక్కువగా నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. విజయ్‌కుమార్ మల్హోత్రా తనయుడు అజయ్ మల్హోత్రా పోటీచేస్తున్న గ్రేటర్ కైలాష్‌లో ఆరుగురు అభ్యర్థులు ఉన్నా రు. రోహిణి, దేవిలీ నుంచి ఐదుగురు పోటీలో ఉన్నారని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి.
పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్నన్యూఢిల్లీతోపాటు త్రినగర్, బల్లిమారన్, సం గంవిహార్‌ల్లో 17 మంది అభ్యర్థులు మటియాలాలో 19 మంది, ఓఖ్లాలో 19 మంది కిరారీ, మాటియామహల్ నియోజకవర్గం నుంచి 20 మంది తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంత్రులు అర్విందర్ సింగ్ లవ్లీ పోటీచేస్తున్న గాం దీనగర్‌లో 13 మంది, కిరణ్‌వాలియా పోటీచేస్తున్న మాళవీయనగర్‌లో 15 మంది, రాజ్‌కుమార్ చౌహాన్ పోటీ చేసే మంగోల్‌పురి నియోజకవర్గంలో ఏడుగురు, హరూన్ యూసుఫ్ పోటీచేసే బల్లిమారన్‌లో 17 మంది, రమాకాంత్ గోస్వామి పొటీచేస్తున్న రాజేంద్రనగర్ నుంచి 16 మంది, ఏకే వాలియా పోటీచేసే లక్ష్మీనగర్ నుంచి 13 మంది పోటీపడుతున్నారు. స్పీకర్ యోగానందశాస్త్రీ పోటీ చేస్తున్న మెహ్రౌలీలో తొమ్మిది మంది అభ్యర్థులు బరి లో ఉన్నారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రత్యర్థుల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేంద్ర గుప్తాతోపాటు ఐదుగురు మహిళలు ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి అత్యధిక సంఖ్య లో మహిళలు బరిలోఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి.
ప్రముఖులపైనే గురి
Published Fri, Nov 22 2013 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement