Harsavardhan
-
సీనియర్ నటుడి భార్య కన్నుమూత
సాక్షి, చెన్నై: నటి రేష్మా అలియాస్ శాంతి(42) శ్వాస సంబంధిత సమస్యతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. తొలుత పాజిటివ్ అని, ఆ తదుపరి నెగెటివ్‌గా భిన్న ఫలితాలు వచ్చాయి. అయితే ఆమెకు శ్వాస సమస్య తీవ్రం కావడంతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. బీసెంట్‌నగర్ శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. కాగా కార్తీక్ హీరోగా తెరకెక్కిన 'కిళక్కు ముగం' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రేష్మా పలు తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించారు. సీనియర్ నటుడు రవిచంద్రన్ కుమారుడు హంసవర్ధన్‌ను వివాహం చేసుకుని తన పేరును శాంతిగా మార్చుకున్నారు. వీరికిద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చదవండి: రంగంలోకి సాయి ధరమ్‌తేజ్.. రిపబ్లిక్ డబ్బింగ్ షురూ.. -
గ్యాంగ్ వార్ : పండు తల్లిపైనా కేసు!
సాక్షి, అమరావతి : వీధి యుద్ధాలకు దిగితే కఠిన శిక్షలు తప్పవని డీసీపీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. గ్యాంగ్ వార్ కేసులో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, త్వరలోనే కేసును పూర్తిస్థాయిలో ఛేదించి నిందితులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు. నేర ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవారిపై నగర బహిష్కరణ వేటువేస్తామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పండు గ్యాంగ్‌లో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేశాము. సందీప్ టీంలో 15 మందిని రిమాండుకు పంపాము. రెండు గ్యాంగుల్లోని సభ్యులతో సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేశాము. మరో 15 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆరు ప్రత్యేక బృందాలు నిందితులకోసం గాలిస్తున్నాయి. ( బెజవాడ గ్యాంగ్‌వార్ కేసు.. మరో ముందడుగు ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్ లీడర్ పండు డిశ్చార్జ్ అవగానే అదుపులోకి తీసుకొంటాము. కుమారుడి నేర ప్రవృత్తిని ప్రోత్సహించిన పండు తల్లిపైనా కేసు నమోదు చేశాము. పండు, సందీప్‌ల కాల్ డేటా కూడా సేకరించాము గొడవ జరిగే ముందు ఇద్దరూ పదిసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. పండునుంచి సందీప్‌కు ఆరు కాల్స్, సందీప్ నుంచి పండుకి నాలుగు కాల్స్ వెళ్లాయి. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డిలతో పాటు డీల్ మాట్లాడిన నాగబాబునూ విచారిస్తున్నాం’’ అని అన్నారు. -
బీమా కల్పిస్తాం ధీమా ఇవ్వండి..!
సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల అనంతరం తమ ప్రభుత్వం ఏర్పడితే ఢిల్లీవాసులకు బీమా సదుపాయం కల్పిస్తామని, ఎన్నికల్లో గెలుపుపై తమ ధీమా ఇవ్వాలని బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలోనే ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా ఈ బీమా పథకాన్ని రూపొందిస్తామన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పథకానికి సంబంధించిన విధివిధానాలను ఆయన వివరించారు. ఢిల్లీ పౌరులు ప్రతి ఒక్కరూ రోజుకు రూ.ఆరు చొప్పున ఆన్లైన్లో చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వ బీమా వర్తిస్తుందన్నారు. ఇందుకోసం ఎలాంటి హెల్త్కార్డులూ తీసుకెళ్లాల్సిన పనిలేదన్నారు. నేరుగా ఆన్లైన్లో డబ్బులు జమచేసిన వెంటనే ఓ కోడ్ నంబర్ కేటాయిస్తారని, ఆ నంబర్ చెబితే సరిపోతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్నిసార్లయినా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చని హర్షవర్ధన్ అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకోవాల్సి వస్తే వోచర్లు అందజేస్తామని వివరించారు. అధికారిక, అనధికారిక కాలనీలన్నింటిలో మొబైల్ క్లినిక్కులను అందుబాటులోకి తెస్తామన్నారు. వీటిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అన్ని వైద్య సదుపాయాలు ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆరు నెలలకోసారి పూర్తి చెకప్ చేయించుకునే అవకాశం ఉంటుందని ఈ సీనియర్ నాయకుడు విశదీకరించారు. ఔట్‌పేషెంట్ వైద్య సేవలను అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెట్టింపు చేస్తామని వాగ్దానం చేశారు. ‘అవసరమైన రోగులను ఆస్పత్రులకు చేర్చేందుకు రవాణా సదుపాయాన్ని ఉచితంగా కల్పిస్తాం. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అంబులెన్స్‌లు, ప్రభుత్వ ఆరోగ్యశాఖ వాహనాలను జీపీఎస్‌తో అనుసం ధానిస్తాం. అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఎంఎస్ చేసినా వైద్యసహాయం పొందేలా కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేస్తాం’ అని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘మోడల్‌టౌన్’ మేనిఫెస్టో విడుదల స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం: విజయ్‌గోయల్ మరో రెండు రోజుల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ వెల్లడించారు. మోడల్‌టౌన్ నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక మేనిఫెస్టోను పండిత్‌పంత్‌మార్గ్‌లోని కార్యాలయంలో బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ నాయకులు విడుదల చేశారు. కార్యక్రమంలో బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్, సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, మోడల్‌టౌన్ అభ్యర్థి అశోక్‌గోయల్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సమస్యలు ప్రతిబింబించేలా మోడల్‌టౌన్ మేనిఫెస్టోను రూపొందించినట్టు గోయల్ అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో బాధ్యతాయుతంగా మెలిగేందు కు అన్ని నియోజకవర్గాల్లో మేనిఫెస్టోలు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరికొన్ని రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల పరిధిలో రూపొందించిన మేనిఫెస్టోలు విడుదల చేస్తామన్నారు. మరో రెండు రోజుల్లో పార్టీమేని ఫెస్టోరాబోతోందని గోయల్ వివరించారు. పార్టీ రాష్ట్రస్థాయి మేనిఫెస్టోలో అన్ని ప్రాంతాల సమస్యలకు స్థానం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే మేనిఫెస్టోలు రూపొందించినందున, వాటిలో సాధారణ సమస్యలనూ చేర్చనున్నట్టు పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న స్థానిక సమస్యలన్నింటిని అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని పార్టీ మోడల్‌టౌన్ అభ్యర్థి అశోక్ గోయల్ తెలిపారు. -
ప్రముఖులపైనే గురి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వంటి ప్రముఖులపై ఈసారి చాలా మంది చోటామోటా నాయకులు పోటీకి దిగారు. షీలాదీక్షిత్ పోటీచేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో విధానసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తరువాత 17 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ పోటీచేస్తున్న కృష్ణానగర్‌లో తొమ్మిది మంది అభ్యర్థులు మిగిలారు. బురాడీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 29 మంది, పటేల్ నగర్ నియోజకవర్గం నుంచి అతి తక్కువగా నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. విజయ్‌కుమార్ మల్హోత్రా తనయుడు అజయ్ మల్హోత్రా పోటీచేస్తున్న గ్రేటర్ కైలాష్‌లో ఆరుగురు అభ్యర్థులు ఉన్నా రు. రోహిణి, దేవిలీ నుంచి ఐదుగురు పోటీలో ఉన్నారని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్నన్యూఢిల్లీతోపాటు త్రినగర్, బల్లిమారన్, సం గంవిహార్ల్లో 17 మంది అభ్యర్థులు మటియాలాలో 19 మంది, ఓఖ్లాలో 19 మంది కిరారీ, మాటియామహల్ నియోజకవర్గం నుంచి 20 మంది తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంత్రులు అర్విందర్ సింగ్ లవ్లీ పోటీచేస్తున్న గాం దీనగర్‌లో 13 మంది, కిరణ్వాలియా పోటీచేస్తున్న మాళవీయనగర్‌లో 15 మంది, రాజ్‌కుమార్ చౌహాన్ పోటీ చేసే మంగోల్‌పురి నియోజకవర్గంలో ఏడుగురు, హరూన్ యూసుఫ్ పోటీచేసే బల్లిమారన్‌లో 17 మంది, రమాకాంత్ గోస్వామి పొటీచేస్తున్న రాజేంద్రనగర్ నుంచి 16 మంది, ఏకే వాలియా పోటీచేసే లక్ష్మీనగర్ నుంచి 13 మంది పోటీపడుతున్నారు. స్పీకర్ యోగానందశాస్త్రీ పోటీ చేస్తున్న మెహ్రౌలీలో తొమ్మిది మంది అభ్యర్థులు బరి లో ఉన్నారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రత్యర్థుల్లో ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేంద్ర గుప్తాతోపాటు ఐదుగురు మహిళలు ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి అత్యధిక సంఖ్య లో మహిళలు బరిలోఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. -
మీ వల్లే .. ప్లాస్టిక్ వినియోగం..
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : అధికారుల నిర్లక్ష్యంవల్లే ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయిందని ఇన్చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఇన్చార్జి కలెక్టర్ అధికారుల సమావేశం నిర్వహిం చారు. జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగులు ఏ ప్రాంతాల నుంచి వస్తున్నాయో ముందు గుర్తించాలన్నారు. 40 మైక్రాన్స్ కలిగి ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ప్రభుత్వం నిషేధించిందన్నారు. వీటి నివారణకు జిల్లాలోని మున్సిపాలిటీల పరి దిలో గట్టి పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి నెల రెండో సోమవారం మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు.ప్రభుత్వ ఉత్తర్వులు 96 ప్రకారం అధికారులు ప్లాస్టిక్ నివారణ కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ సంచులవల్ల కాలువల్లో మురు గు నీరు నిలిచిపోయి, అనేక ఇబ్బం దులు తలెత్తుతున్నాయన్నారు. ప్లాస్టిక్ వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయన్నారు. సమావేశంలో కాలుష్య నివారణ కంట్రోల్ బోర్డు ఈఈ వెంకన్న, నిజామాబాద్ ఈఈ సిరాజుద్దిన్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ బిలొజీనాయక్,బోధన్ ఈఈ ప్రసాద్, జిల్లా పరిశ్రమల అధికారి సదానంద్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి కలెక్టరేట్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇన్చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అధికారులను అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్ మైదానాన్ని అందంగా ముస్తా బు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అవగాహన కల్పించేలా శకటాలు రూపొందించాలన్నారు. ప్రశంసాపత్రాల విషయంలో పనిచేసే ఉద్యోగులను గుర్తించి ఎంపిక చేయాలన్నారు. దేశ సార్వభౌమత్వం, సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.