మీ వల్లే .. ప్లాస్టిక్ వినియోగం..
Published Tue, Aug 13 2013 6:25 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : అధికారుల నిర్లక్ష్యంవల్లే ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయిందని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఇన్‌చార్జి కలెక్టర్ అధికారుల సమావేశం నిర్వహిం చారు. జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగులు ఏ ప్రాంతాల నుంచి వస్తున్నాయో ముందు గుర్తించాలన్నారు. 40 మైక్రాన్స్ కలిగి ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ప్రభుత్వం నిషేధించిందన్నారు. వీటి నివారణకు జిల్లాలోని మున్సిపాలిటీల పరి దిలో గట్టి పర్యవేక్షణ చేయాలన్నారు.
ప్రతి నెల రెండో సోమవారం మున్సిపల్ కమిషనర్‌లతో సమావేశం నిర్వహిస్తామన్నారు.ప్రభుత్వ ఉత్తర్వులు 96 ప్రకారం అధికారులు ప్లాస్టిక్ నివారణ కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ సంచులవల్ల కాలువల్లో మురు గు నీరు నిలిచిపోయి, అనేక ఇబ్బం దులు తలెత్తుతున్నాయన్నారు. ప్లాస్టిక్ వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయన్నారు. సమావేశంలో కాలుష్య నివారణ కంట్రోల్ బోర్డు ఈఈ వెంకన్న, నిజామాబాద్ ఈఈ సిరాజుద్దిన్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ బిలొజీనాయక్,బోధన్ ఈఈ ప్రసాద్, జిల్లా పరిశ్రమల అధికారి సదానంద్ తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
కలెక్టరేట్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అధికారులను అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్ మైదానాన్ని అందంగా ముస్తా బు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అవగాహన కల్పించేలా శకటాలు రూపొందించాలన్నారు. ప్రశంసాపత్రాల విషయంలో పనిచేసే ఉద్యోగులను గుర్తించి ఎంపిక చేయాలన్నారు. దేశ సార్వభౌమత్వం, సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.
Advertisement
Advertisement