
సాక్షి, ఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో భేటీ కానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు ఆయన కేంద్రమంత్రితో సమావేశం అవుతారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర సహకారాన్ని మంత్రి బుగ్గన కోరనున్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వైద్యారోగ్య రంగాల్లో చేపడుతున్న పలు పథకాలు, ప్రాజెక్టులపై బుగ్గన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లన్నున్నారు.
Comments
Please login to add a commentAdd a comment