మహిళ శరీరం దేవాలయం: హర్షవర్ధన్ | Woman’s body is a temple, comments Harsh Vardhan | Sakshi
Sakshi News home page

మహిళ శరీరం దేవాలయం: హర్షవర్ధన్

Published Fri, Aug 29 2014 4:45 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

మహిళ శరీరం దేవాలయం: హర్షవర్ధన్

మహిళ శరీరం దేవాలయం: హర్షవర్ధన్

అత్యాచారం అనేది చాలా చిన్న విషయమంటూ ఇటీవల వివాదం రేపిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్.. తాజాగా మరో వ్యాఖ్య చేశారు. మహిళల శరీరం దేవాలయమంటూ ఆయన అభివర్ణించారు. దేశ రాజధానిలోని ఓ మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ యువతులలో ఇటీవలి కాలంలో అనారోగ్యాలు ప్రబలిపోతున్నాయని చెబుతూ ఆయనీ మా టఅన్నారు.

''మహిళ శరీరం దేవాలయం లాంటిది. ఒక కొత్తతరాన్ని రూపొందించాలంటే ఆరోగ్యవంతులైన మహిళలు అవసరం. వాళ్లే అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం కుటుంబం మీద, సమాజం మీద, జాతిమీద కూడా పడుతుంది'' అని హర్షవర్ధన్ చెప్పారు. ఈ వ్యాఖ్య ట్విట్టర్లో పెను దుమారమే రేపింది. అనేకమంది యూజర్లు దీనిపై విమర్శలు గుప్పించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన భాషను సంస్కరించుకోవాలంటూ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement