బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ | BJP picks Harsh Vardhan as its CM candidate for Delhi | Sakshi
Sakshi News home page

బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్

Published Thu, Oct 24 2013 2:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

BJP picks Harsh Vardhan as its CM candidate for Delhi

 న్యూఢిల్లీ: త్వరలోనే జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత హర్షవర్ధన్‌ను బీజేపీ బుధవారం ప్రకటించింది. బీజేపీ ఢిల్లీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ వ్యతిరేకించినా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు హడావుడిగా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ చాలాకాలంగా సీఎం అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కొన్ని నెలలుగా బీజేపీ నాయకత్వం ఈ అంశంలో డోలాయమానంలో కొనసాగింది. చివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement