సీఎం రేసులో లేను: కేంద్ర మంత్రి | Not in race for CM candidate in UP, says Manoj Sinha | Sakshi
Sakshi News home page

సీఎం రేసులో లేను: కేంద్ర మంత్రి

Published Sat, May 28 2016 6:17 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

సీఎం రేసులో లేను: కేంద్ర మంత్రి - Sakshi

సీఎం రేసులో లేను: కేంద్ర మంత్రి

మథుర: తాను ముఖ్యమంత్రి రేసులో లేనని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. మథుర రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా తాను పోటీ చేయడం లేదని తనపై వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను ఉన్న పొజిషన్ పై చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు.

ప్రజలకు సేవ చేయడానికి పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, నిజాయతీగా వ్యవహరించి తాను చేయాల్సింది చేస్తానన్నారు. సీఎం అభ్యర్థిగా మీ పేరు వినిపిస్తుందని మీడియా ప్రశ్నించగా, తాను రేసులో లేనని వెల్లడించారు. మథుర రైల్వే స్టేషన్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ స్టేషన్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ విషయంపై ఆరు నెలల కిందటే నిర్ణయం తీసుకుందని మంత్రి మనోజ్ సిన్హా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement