minister Manoj Sinha
-
కేంద్ర మంత్రి దృష్టికి బీఎస్ఎన్ఎల్ సమస్యలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు మంగళవారం దేశ రాజధానిలో కేంద్ర ప్రచారశాఖ సహాయ మంత్రి మనోజ్‌సిన్హాను కలుసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వీక్‌గా ఉందని, దాన్ని మెరుగుపరచేందుకు పరిచేందుకు చర్య తీసుకోవాలని కోరారు. జిల్లాలో సుమారు 24 ప్రాంతాల్లో సెల్‌ఫోన్ టవర్లు అవసరం ఉందని వివరించారు. వాటిని కచ్చితంగా ఏర్పాటు చేయాలని విన్నవించారు. అలాగే బీఎస్ఎన్ఎల్ శాఖా పరమైన నిర్ణయాలతో శ్రీకాకుళం జిల్లాలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌ను విజయనగరం జిల్లాలోని కార్యాలయంలో విలీనం చేసేందుకు నిర్ణయించినట్టు తెలియవచ్చిందని, ఇలా జరిగితే శ్రీకాకుళం జిల్లాపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిని విరమించుకోవాలని విన్నవించారు. ప్రస్తుతం జిల్లా వాణిజ్యపరంగా చాలా వేగంగా విస్తరిస్తుందని, కావున జిల్లా అభివృద్ధికి 4జీ నెట్వర్క్ చాలా అవసరమని, సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని, సిబ్బంది కొరతను పరిష్కరించాలని కోరారు. -
గుడ్ న్యూస్: 4వేల ప్రత్యేక రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న పండుగ సీజన్లో భారీగా పెరగనున్న డిమాండ్ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ రైలు ప్రయాణీకులకు శుభవార్త అందించింది. ఈ పండుగ సీజన్లో భారతీయ రైల్వే 4,000 ప్రత్యేక రైళ్లను నడుపుతుందని రైల్వేశాఖ మంత్రి మనోజ్ సిన్హా మంగళవారం ప్రకటించారు. పండుగ సీజన్లో ప్రధాన స్టేషన్లలో క్లీన్ మరుగుదొడ్లు వంటి అనేక సౌకర్యాలను కల్పిస్తుందని మనోజ్ సిన్హా తెలిపారు. రాబోయే 40 రోజుల్లో దుర్గా పూజ, దసరా, దీపావళి , చాత్ పర్వదినం సందర్భంగా అక్టోబర్ 15, అక్టోబర్ 30 మధ్యకాలంలో అదనపు రైళ్లను ప్రవేశపెడుతున్నామని ఆయన చెప్పారు. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన గమ్యస్థానాలకు ప్రత్యేక రైల్వేలను నడుపుతామన్నారు. ఇప్పటికే ఉన్న రైళ్లకు అదనపు కోచ్‌లను కూడా జోడిస్తామని తెలిపారు. ముఖ్యంగా చాత్ కోసం కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, అహ్మదాబాద్ నుంచి, తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్ లకు స్పెషల్ రైళ్లను కేటాయిస్తున్నట్టు ఆయన చెప్పారు. అదనపు రిజర్వేషన్ కౌంటర్లను కూడా అందుబాటులో ఉంచడంతోపాటు ప్రధాన స్టేషన్లలో శుభ్రమైన మరుగుదొడ్లు తదితర సదుపాయాలను కల్పిస్తామన్నారు. అంతేకాదు భారీ రష్ ఉంటే ప్లాట్‌ఫాం టికెట్ల అమ్మకాన్ని కూడా నిలిపివేస్తామని వెల్లడించారు. అక్రమ ఏజెంట్ల నిరోధానికి, మరింత భద్రతకోసం అదనపు రక్షణ బృందాలనును కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రద్దీ దృష్ట్యా అవసరమైతే రైల్వే సిబ్బంది సెలవులను కూడా రద్దు చేయాలని ఆలోచిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోందన్నారు. గత సంవత్సరం పండుగ సీజన్లో 3,800 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. -
త్వరలో అద్భుత ఫోన్ అందుబాటులోకి..
న్యూఢిల్లీ: మనం కూడా శాటిలైట్ ఫోన్లతో మాట్లాడే రోజు మరెంతో దూరంలో లేదు. వీటి వినియోగంపై ఎటువంటి ఆంక్షలు లేవని, త్వరలోనే ఈ సేవలు మొదలవుతాయని టెలికం శాఖ మంత్రి మనోజ్‌సిన్హా తెలిపారు. ఎవరికి ఆసక్తి ఉంటే వారు ఇంటికి తీసుకోవచ్చన్నారు. అయితే అవసరమైన సందర్భంలో ఈ నెట్‌వర్క్‌ను భద్రతా సంస్థలు తనిఖీ చేస్తాయని చెప్పారు. -
ప్రతి పైసా వసూలు చేస్తాం
కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర మంత్రుల ధ్వజం న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోన్న టెలికం స్కాం యూపీఏ పాలనకు సంబంధించిందని, ఆ పాపాన్ని కడిగే పనిని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తోందని కొత్త టెలికం మంత్రి మనోజ్ సిన్హా అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేస్తామని శుక్రవారం చెప్పారు. 2006-10 మధ్య ప్రభుత్వాన్ని ఎవరు నడిపారో అందరికీ తెలుసని, ఈ పాపం వారిదేనన్నారు. టెలికం రంగంలో రూ. 46 వేల కోట్ల స్కాం జరిగిందని, మోదీ ప్రభుత్వం ఆరు టెలికం కంపెనీలను రక్షించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపించడం తెలిసిందే. ఈ ఆరోపణల్ని టెలికం మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఎవరినో కాపాడే పనిలో కేంద్ర ప్రభుత్వం లేదన్నారు. కాంగ్రెస్ చెబుతున్న 46 వేల కోట్లు నిజానికి టెలికం కంపెనీలు తక్కువగా చూపించిన ఆదాయ వివరాలని, నివేదికలో కాగ్ ఆ విషయాన్ని పేర్కొందన్నారు. -
సీఎం రేసులో లేను: కేంద్ర మంత్రి
మథుర: తాను ముఖ్యమంత్రి రేసులో లేనని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. మథుర రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా తాను పోటీ చేయడం లేదని తనపై వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను ఉన్న పొజిషన్ పై చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, నిజాయతీగా వ్యవహరించి తాను చేయాల్సింది చేస్తానన్నారు. సీఎం అభ్యర్థిగా మీ పేరు వినిపిస్తుందని మీడియా ప్రశ్నించగా, తాను రేసులో లేనని వెల్లడించారు. మథుర రైల్వే స్టేషన్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ స్టేషన్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ విషయంపై ఆరు నెలల కిందటే నిర్ణయం తీసుకుందని మంత్రి మనోజ్ సిన్హా పేర్కొన్నారు. -
'ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తాం'
అగర్తల: రానున్న ఐదేళ్లలో మొత్తం భారతీయ రైల్వే వ్యవస్థనే సమూలంగా మార్చి వేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా అన్నారు. భారతీయ రైల్వేపై ఐదేళ్లలో రూ.8.5లక్షల కోట్లు ఖర్చుచేస్తామని ఆయన తెలిపారు. బుధవారం అసోం-అగర్తల మధ్య కొత్తగా నిర్మించిన బ్రాడ్ గేజ్ ట్రయల్ రైలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత అవసరమైన అన్ని అనుమతులు తీసుకొని అధికారికంగా ఈ మార్గంలో రైలు సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. బంగ్లా సరిహద్దును పంచుకునే త్రిపుర రైలు మార్గాన్ని ప్రారంభించి త్వరలోనే డిసెంబర్ 2017నాటికి పూర్తి చేస్తామని అన్నారు.