కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర మంత్రుల ధ్వజం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోన్న టెలికం స్కాం యూపీఏ పాలనకు సంబంధించిందని, ఆ పాపాన్ని కడిగే పనిని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తోందని కొత్త టెలికం మంత్రి మనోజ్ సిన్హా అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేస్తామని శుక్రవారం చెప్పారు. 2006-10 మధ్య ప్రభుత్వాన్ని ఎవరు నడిపారో అందరికీ తెలుసని, ఈ పాపం వారిదేనన్నారు.
టెలికం రంగంలో రూ. 46 వేల కోట్ల స్కాం జరిగిందని, మోదీ ప్రభుత్వం ఆరు టెలికం కంపెనీలను రక్షించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపించడం తెలిసిందే. ఈ ఆరోపణల్ని టెలికం మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఎవరినో కాపాడే పనిలో కేంద్ర ప్రభుత్వం లేదన్నారు. కాంగ్రెస్ చెబుతున్న 46 వేల కోట్లు నిజానికి టెలికం కంపెనీలు తక్కువగా చూపించిన ఆదాయ వివరాలని, నివేదికలో కాగ్ ఆ విషయాన్ని పేర్కొందన్నారు.
ప్రతి పైసా వసూలు చేస్తాం
Published Sat, Jul 9 2016 1:43 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement