ఢిల్లీ పోలియో ఫ్రీ కార్యక్రమాన్ని ఎన్నికల స్టం ట్‌గా అభివర్ణిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ
బీజేపీ, ఆప్, ఎస్‌ఏడీలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Published Wed, Nov 27 2013 12:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలియో ఫ్రీ కార్యక్రమాన్ని ఎన్నికల స్టం ట్‌గా అభివర్ణిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అంతేకాక ఇటీవల ఆప్ వచ్చిన ఆరోపణల వెను క తమ పార్టీ హస్తముందంటూ ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నేతలపై కూడా చర్య తీసుకోవాలని కోరింది. తమ మరో ప్రత్యర్థి శిరోమణి అకాళీదళ్ పంజాబ్ పోలీసులను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుందని, ఆ పార్టీ నేతలపై కూడా చర్య తీసుకోవాలని షకీల్ అహ్మద్ నేతృత్వం లోని ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘాన్ని కోరింది.
Advertisement
Advertisement