Shakeel Ahmed
-
పంజాగుట్ట కేసులో మరో ట్విస్ట్.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో డీసీపీ విజయ్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసు విషయమై తాజాగా డీసీపీ విజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. పంజాగుట్ట ప్రమాదం కేసులో తన కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించాడు. రాహిల్‌తో పాటుగా షకీల్ కూడా దుబాయ్‌కి పారిపోయాడు. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్‌తోపాటుగా బోధన్ సీఐని కూడా అరెస్ట్ చేశాం. నిందితుడికి పోలీసులు సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశాం. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని వెల్లడించారు. ప్రజాభవన్ వద్ద హల్చల్.. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 23న హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్.. కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన నిందితుడైన సాహెల్‌ను తప్పించి.. అతని డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. సాహెల్‌ను తప్పించటంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది సహకరించినట్టు ఆరోపణలు రావటంతో.. ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అప్పటికే.. సాహెల్ దుబాయ్ పారిపోగా.. అతనిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సీఐ దుర్గారావు అరెస్ట్ మరోవైపు.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో సీఐ దుర్గారావు డ్యూటీలో ఉన్నట్టు.. అతనే నిందితున్ని తప్పించటంతో కీలకంగా వ్యవహరించినట్టు దర్యాప్తులో తేలటంతో.. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును వెతుకుతున్న క్రమంలో.. అనంతపురం గుంతకల్ రైల్వే స్టేషన్లో పట్టుబడ్డాడు. సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు దుర్గారావును హైదరాబాద్ తీసుకొచ్చారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో దుర్గారావును పోలీసులు విచారిస్తున్నారు. -
తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. బిగ్ బాంబ్ పేల్చిన ఒవైసీ!
సాక్షి, నిజామాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా జైలులో ఉన్న బోధన్ ఎంఐఎం నేతలతో ములాఖత్ అయ్యారు. అయితే, ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదుతో మజ్లిస్ నేతలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జైలు ములాఖత్ అనంతరం ఒవైసీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తాం. ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది ఎన్నికల ముందు జాబితాను ప్రకటిస్తాం. బోధన్‌లో ఎంఐఎం పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కు ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెబుతాం. ఎంఐఎం కౌన్సిలర్స్, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, డీజీపీ దృష్టికి తీసుకువెళ్తాం. అరెస్ట్ అయిన ఎంఐఎం నేతలు.. ఎమ్మెల్సీ కవిత, షకీల్ గెలుపు కోసం పనిచేశారు. తెలంగాణలో ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలి. ముస్లింలలో పేద ప్రజలు ఎక్కవగానే ఉన్నారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాము. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మసీదులు తొలగించి సచివాలయం నిర్మించారు. ఆ మసీదులు వెంటనే కట్టాలి అని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ఎంఐఎం బలపడటం కోసం ముందుగా పనిచేస్తాం. ఏ పార్టీతో మద్దతు.. ఏ పార్టీతో ముందుకెళ్లాలనేది ఆలోచిస్తాం. పాట్నా మీటింగ్‌కు ప్రతిపక్ష పార్టీలు నన్ను పిలవలేదు. తెలంగాణలో మేం కూడా ప్రత్యామ్నాయమే. తెలంగాణలో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారు. మణిపూర్‌లో మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీలో కోల్డ్‌వార్ పాలిటిక్స్.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు? -
ఎంపీ అరవిందును కలిస్తే తప్పేంటి..?
సాక్షి, హైదరాబాద్: ‘నేను పార్టీ మారితే బాగుండని మా పార్టీ నేతలే కొందరు ఆనందపడ్డారు. నేను వేరే పార్టీలోకి వెళ్లాలని వారు కోరుకుంటున్నారు. సెపె్టంబర్ 17న ఓ మైనార్టీ ఎమ్మెల్యేగా బీజేపీలో చేరతానని ఎలా అనుకుంటారు’అని టీఆర్ఎస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ వ్యాఖ్యా నించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివా రం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో పిచ్చాపాటీ గా మాట్లాడారు. ‘మా ఇంటి పక్కనే ఉండే నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరి్వంద్‌ను కలిస్తే తప్పేంటి. నేను పార్టీ మారాలనుకుంటే చెప్పే వెళ్తా. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. గోడమీద పిల్లిలా ఉండను’ అని షకీల్ కామెంట్ చేశారు. నేను గతం లో బీజేపీ నిజామాబాద్ జిల్లా మైనార్టీ మోర్చాలో పనిచేశా. నా మీద కేసులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. గతంలో నా మీద ఉన్న రెండు కేసుల్లో నిర్దోíÙగా నిరూపించుకున్నా. నా మీద ఒక్క కేసు ఉన్నట్లు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తా’అని షకీల్ ప్రకటించారు. విప్ పదవితో గాంధీ సంతోషంగా లేరు ‘పదవులు రావాలని కోరుకోవడం.. రాకుంటే బాధ ఉండటం సహజం. అందరికీ పదవులు కావాలంటే సాధ్యం కాదు. మనలో ఎవరికి పదవులు వచి్చనా ఒకరికొకరు సహకరిం చుకోవాలి’అని మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తనకు విప్ పదవి రావడం పట్ల హ్యాపీగా లేరు. మంత్రి కావాలని అనుకున్నారు. ఈ విషయం తెలిసి తుమ్మల నాగేశ్వర్రావు తన ఇంటికి పిలిచి మంద లించారు. కమ్మ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవితోపాటు విప్ పదవి కూడా ఇచ్చారు. ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వంతో చర్చించాలి తప్ప రచ్చ చేసుకోవద్దని చెప్పారు. ఎవరికి పదవి వచి్చనా జిల్లాలో అందరినీ కలుపుకుపోవాలని చెప్పామని భాస్కర్‌రావు వ్యాఖ్యానించారు. – ఎమ్మెల్యే భాస్కర్‌రావు నారదాసు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు ‘టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు ఎవరు’ అనే అంశంపై ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లు.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లోనూ ప్రస్తావనకు వస్తున్నాయి. అసెంబ్లీ లాబీలో ఎదురైన మీడియా ప్రతినిధులు ‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు అనే ది అప్రస్తుతమని’ ఇటీవల ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు చేసిన కామెంట్లను ప్రస్తావించారు. రామలింగారెడ్డి స్పందిస్తూ.. నక్సలిజం భావజాలం నుంచి వచి్చన నారదాసు అలా మాట్లాడటం కరెక్ట్‌గా లేదనే విషయాన్ని ఆయనకు ఫోన్ చేసి చెప్పానన్నారు. తన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వక్రీకరిస్తున్నారని సమాచారం అం దడంతో అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తులకు లింగ వివక్ష ఉండదు. ఇష్టాగోష్టిగా మాట్లాడిన మాటలను వక్రీకరించవద్దు’అని కోరారు. – ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి -
అర్వింద్‌ను కలిస్తే తప్పేంటి..?: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ‘నేను పార్టీ మారితే బాగుండని మా పార్టీ నేతలే కొందరు ఆనందపడ్డారు. నేను వేరే పార్టీలోకి వెళ్లాలని వారు కోరుకుంటున్నారు. సెప్టెంబర్ 17న ఓ మైనార్టీ ఎమ్మెల్యేగా బీజేపీలో చేరతానని ఎలా అనుకుంటారని’ టీఆర్ఎస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. ‘మా ఇంటి పక్కనే ఉండే నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్‌ను కలిస్తే తప్పేంటి. నేను పార్టీ మారాలనుకుంటే చెప్పే వెళ్తా. ఎవరికీ భయడాల్సిన అవసరం నాకు లేదు. గోడమీద పిల్లిలా ఉండను’ అని షకీల్ కామెంట్ చేశారు. ‘నేను గతంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా మైనార్టీ మోర్చాలో పనిచేశా. నా మీద కేసులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. గతంలో నా మీద ఉన్న రెండు కేసుల్లో నిర్దోషిగా నిరూపించుకున్నా. నా మీద ఒక్క కేసు ఉన్నట్లు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తా’ అని షకీల్ ప్రకటించారు. -
టీఆర్ఎస్లో ఉండలేకపోతున్నా..రాజీనామాకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లభించడం లేదని బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న పరిస్థతుల్లో అక్కడ ఉండలేకపోతున్నానని, రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దయ వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని, అయితే ఆయనను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే షకీల్ వ్యాఖ్యలు చేశారు. చదవండి: టీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్! మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే షకీల్... కమలం గూటికి చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అర్వింద్‌తో అన్ని విషయాలు మాట్లాడానని, సోమవారం అన్ని బయటపెడతానని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. -
టీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అసంతృప్తి ప్రకంపనలు ఇంకా టీఆర్ఎస్లో కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గురువారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కాగా మొన్నటి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించలేదని షకీల్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ...అర్వింద్‌తో సమావేశం కావడంతో టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. భేటీ అనంతరం షకీల్ పార్టీ మారడంపై స్పందించారు. పార్టీ మారితే మారొచ్చు అంటూ ఫీలర్లు వదిలారు. ఇక మంత్రివర్గంలో స్థానం దక్కని జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డిని టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించడంతో వారిద్దరూ మెత్తపడ్డారు. నాయిని బహిరంగంగానే తన అసంతృప్తి తెలిపితే, జోగు రామన్న మాత్రం అలక వహించి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ పలుమార్లు... టీఆర్ఎస్ నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తోంది. అంతేకాకుండా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. అలాగే త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు సందర్భంగా బీజేపీ కూడా దూకుడు పెంచింది. పట్టణ ప్రాంతాల్లో కొంత పట్టు ఉన్న ఆ పార్టీ స్థానిక నేతలపై దృష్టి సారించింది. -
దసరాకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ పీఆర్వో షకీల్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్-కాకినాడ (07427/)07428) స్పెషల్ ట్రైన్ ఈ నెల 7వ తేదీ సాయంత్రం 7.10కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8వ తేదీ రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50కి సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు. ఉర్సు ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు...: ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-వాడి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. హైదరాబాద్-వాడి ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 15న ఉదయం 11.15కు నాంపల్లి నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్ర ం 4.55కు వాడి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు సాయంత్రం 5.25కు వాడి నుంచి బయలుదేరి రాత్రి 11.15కు నాంపల్లికి చేరుకుంటుంది. 17న ఉదయం 5 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి ఉదయం 10.15కి వాడి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు ఉదయం 10.45కు వాడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది. -
ఈ పెళ్లికి.. పోలీసులే అతిథులు
మైసూర్: కర్ణాటకలోని మైసూర్ నగరంలో సోమవారం ఓ వివాహం జరిగింది. వధూవరులిద్దరూ ఎంబీఏ గ్రాడ్యుయేట్లు. ఈ పెళ్లికి పోలీసులే అతిథులు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. విషయం ఏంటంటే.. ఇది ప్రేమ వివాహం. అందులోనూ మతాంతర వివాహం. ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. హిందూ సంస్థ కార్యకర్తలు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది లవ్ జిహాద్ అంటూ నిరసనకు దిగారు. దీంతో ఈ పెళ్లికి భద్రత కల్పించేందుకు భారీగా పోలీసులు తరలివచ్చారు. వధూవరులు ఆషిత, షకీల్లది మాండ్య. వీరి పెళ్లిని వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ కార్యకర్తలు వధువు ఇంటిముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ పెళ్లి లవ్ జిహాద్ అని, వరుడు షకీల్ వివాహం ద్వారా ఆషితను మతమార్పిడికి ప్రేరేపిస్తున్నాడని మండిపడ్డారు. ప్రేమ అయితే తమకు అభ్యంతరం లేదని, మతమార్పిడికి కుట్ర అని ఆరోపించారు. వీరి ఆరోపణలను వధూవరుల తల్లిదండ్రులు ఖండించారు. 'భారత్‌లో అందరూ సమానం. నిరసనకారులకు ఈ పెళ్లి ఓ సందేశం. వారు అర్థం చేసుకోవాలి' అని వధువు తండ్రి డాక్టర్ నరేంద్ర బాబు అన్నారు. ఈ పెళ్లి తమకు అమిత సంతోషాన్ని కలిగిస్తోందని వరుడు తండ్రి ముక్తర్ అహ్మద్ చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆషిత, షకీల్‌లకు పరిచయం ఉంది. మాండ్యలో వీరి కుటుంబాలు పక్కపక్కన ఉంటున్నాయి. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఇద్దరూ క్లాస్ మేట్స్. 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఆషిత, షకీల్‌కు వివాహం నిశ్చయమైందని తెలిసిన వెంటనే హిందూమత కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు ఇటీవల ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు భారీ భద్రత మధ్య మైసూరులో పెళ్లి చేసుకున్నారు. -
రూ. 1,598 కోట్ల సాయం కావాలి
కరువు తీవ్రతను ప్రతిబింబించేలా నివేదించండి కేంద్ర బృందానికి రాష్ట్రం వినతి సాక్షి, హైదరాబాద్: వరుస విపత్తులతో తీవ్రంగా నష్టపోతున్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఉదారంగా సాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కేంద్ర కరువు బృందానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రూ.1,598 కోట్ల కరువు సాయం ఇవ్వాలని కోరుతూ నివేదిక సమర్పించింది. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని కరువు ప్రాంతాలను పరిశీలించి వచ్చిన కేంద్ర బృందం ప్రతినిధులతో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమీక్షించారు. కరువు తీవ్రతను వివరించి రాష్ట్రానికి కేంద్రం సాయం అందించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి షకీల్ అహ్మద్ నేతృత్వంలోని తొమ్మిదిమంది కేంద్ర బృందం ప్రతినిధులతో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సమావేశమయ్యారు. ఏపీ విపత్తు బాధిత రాష్ట్రంగా మారిందని సీఎస్ చెప్పారు. దుర్భర పరిస్థితి ఉంది: కేంద్ర బృందం ఈ సందర్భంగా కేంద్ర బృందం ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ‘అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్య కూడా ఉంది. కరువు నివారణకు దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. నివేదికలో పేర్కొంటాం..’ అని కేంద్ర బృందం నాయకుడు షకీల్ అహ్మద్ తెలిపారు. -
షకీల్ అహ్మద్ స్థానంలో పీసీ చాకో
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ పర్యవేక్షకుడిని మార్చింది. సీనియర్ నాయకుడు పీసీ చాకోను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమించింది. ప్రస్తుత్వం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యక్తిగత కారణాలతో సెలవు కోరడంతో ఈ మార్పు జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత పనుల నిమిత్తం డిసెంబర్ 28 నుంచి మార్చి 7 వరకు విదేశాలకు వెళుతున్నట్టు అధిష్టానికి షకీల్ అహ్మద్ సమాచారం ఇచ్చినట్టు తెలిపాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయి. -
ఈ ఫలితాలు బీజేపీకి హెచ్చరికలే
ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ న్యూఢిల్లీ: దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఫలితాలు పాలకపక్షమైన బీజేపీకి ప్రమాద హెచ్చరికలేనని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. మోదీ ప్రభుత్వం వచ్చిన వందరోజుల్లోనే ప్రజావ్యతిరేకత ఏర్పడిందని, మోదీ ప్రభుత్వ వైఖరిని, బీజేపీ వ్యవహారశైలిని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏర్పడటం ఇదే తొలిసారని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ తాజా ఉపఎన్నికల్లో సాధించిన ఫలితాలు గణనీయమైనవేనని అన్నారు. ఇకపై పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషిచేస్తామన్నారు. -
ప్రజలను తప్పుదారి పట్టించిన మోడీ: కాంగ్రెస్
చండీగఢ్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరించేస్తామన్నట్టుగా మోడీ ప్రచారం చేశారని చెప్పారు. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా గడవకముందే పెట్రోల్, డీజిల్ ధరలు, రైల్వే చార్జీలు పెంచేశారని గుర్తు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా ఒక్క నిత్యావసర వస్తువు ధర కూడా దిగిరాలేదని వెల్లడించారు. దీని గురించి మోడీ ఎక్కడా మాట్లాడడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే చైనా తోక కత్తిరిస్తామని చెప్పిన ఎన్డీఏ ఇప్పుడు... అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తన అధికార పటంలో చూపించినా నోరు మెదపడం లేదని షకీల్ అహ్మద్ ఎద్దేవా చేశారు. -
మోడీ కంటే కేజ్రీ మేలు: షకీల్
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాలే మెరుగని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే అభ్యంతరం వ్యక్తమైంది. కేజ్రీవాల్ కనీసం తన జాతీయ ఆకాంక్షలకోసం సీఎం పదవి వదులుకున్నారని, మోడీ మాత్రం గుజరాత్ సీఎం పీఠానికి అంటిపెట్టుకుని ఉన్నారని షకీల్ ఆదివారం ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. అయితే వాటిని అసంబద్ధ వ్యాఖ్యలుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యవ్రత్ చతుర్వేది కొట్టిపారేయడం విశేషం. కాంగ్రెస్ మద్దతిచ్చినా 49 రోజుల కన్నా ప్రభుత్వాన్ని నడపలేని కేజ్రీవాల్‌ను మోడీ కంటే మెరుగెలా అవుతారని ఆయన ప్రశ్నించారు. ‘‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో అర్థం లేదు. పైగా అవి కాంగ్రెస్ ఇమేజీనీ దెబ్బతీస్తాయి. కేజ్రీవాల్ అనుభవ శూన్యుడు. మోడీ మతవాది. వారిలో ఎవరినీ మెరుగని చెప్పలేం’’ అన్నారు. బీజేపీ కూడా షకీల్ వ్యాఖ్యలను తూర్పారబట్టింది. -
మీడియా తీరు ఆశ్చర్యకరం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోసహా ఐదు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజధానిలో ప్రచారం చేస్తున్నా మీడియా పట్టించుకోవడంలేదని, కేవలం మోడీ ర్యాలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రచారంపై కమలనాథులు చేస్తున్న విమర్శలను ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిప్పికొట్టారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజధానిలో ప్రచార ర్యాలీలను రద్దు చేసుకుంటున్నారంటూ బీజేపీ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి విదర్భ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ, కేరళ ముఖ్యమంత్రి ఒమన్ చాందీ, హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హూడా ప్రచారం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఐదుగురు ముఖ్యమంత్రులు ప్రచారం చేస్తున్నా వారిని మీడియా విస్మరిస్తోందని మండిపడ్డారు. మోడీ ర్యాలీలకు మాత్రమే మీడియా ప్రాధాన్యతనివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాలిస్తున్న రాష్ట్రాలు గుజరాత్ కంటే అభివృద్ధి చెందిన విషయాన్ని మీడియా గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తుదిదశ ప్రచారంలో పాల్గొంటారన్నారు. జపాన్ చక్రవర్తి రాకను పురస్కరించుకొనే నవంబర్ 30న జరగాల్సిన మన్మో హన్ ప్రచార ర్యాలీ రద్దయిందని, కాంగ్రెస్ ప్రచారాన్ని ఆపలేదని చెప్పారు. కేంద్రమంత్రులు సల్మాన్ ఖుర్షీద్, గులామ్ నబీ ఆజాద్, హరీష్ రావత్, కే రహమాన్ ఖాన్, కుమారి సెల్జా, వీ నారాయణ్ స్వామి, ఆర్పీఎన్ సింగ్, జితిన్ ప్రసాద, పంజాబ్ పీసీసీ చీఫ్ ప్రతాప్‌సింగ్ బాజ్వా, అస్సాం పీసీసీ చీఫ్ భువనేశ్వర్ కలితా, ఎంపీలు రాజ్ బబ్బర్, అజరుద్దీన్, ముకుల్ వాస్నిక్, సత్పాల్ మహరాజ్ తదితరులు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారని గుర్తుచేశారు. -
బీజేపీ, ఆప్, ఎస్ఏడీలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలియో ఫ్రీ కార్యక్రమాన్ని ఎన్నికల స్టం ట్‌గా అభివర్ణిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అంతేకాక ఇటీవల ఆప్ వచ్చిన ఆరోపణల వెను క తమ పార్టీ హస్తముందంటూ ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నేతలపై కూడా చర్య తీసుకోవాలని కోరింది. తమ మరో ప్రత్యర్థి శిరోమణి అకాళీదళ్ పంజాబ్ పోలీసులను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుందని, ఆ పార్టీ నేతలపై కూడా చర్య తీసుకోవాలని షకీల్ అహ్మద్ నేతృత్వం లోని ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘాన్ని కోరింది. -
నరేంద్ర మోడీ మౌనం ఎందుకో?
న్యూఢిల్లీ: ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నోరు పెదవి మెదపక పోవడంపై కాంగ్రెస్ మండిపడింది. అవకాశం దొరికితే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడే మోడీ.. లాలూ అంశం తెరపైకి వచ్చేసరికి ఎందుకు మాట్లాడటం లేదని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. చిటికీ మాటికీ కాంగ్రెస్ ను తూర్పార బట్టే మోడీ లాలా ప్రసాద్ దాణా కుంభకోణంపై మౌనం పాటించటం వెనుక కారణమేమిటని కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ షకీల్ అహ్మద్ ట్విట్టర్ లో నిలదీశారు. రాజకీయంగా అత్యంత సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో తుది తీర్పు సోమవారం వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ రాజధాని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్థారించింది. భారీ భద్రత, కిక్కిరిసిన జనం మధ్య తీర్పు వెలువరించిన సీబీఐ జడ్జి పీకే సింగ్.... మొత్తం 45 మందిని దోషులుగా పేర్కొన్నారు. లాలూకు మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం అన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.