షకీల్ అహ్మద్ స్థానంలో పీసీ చాకో | PC Chacko made Cong in-charge for Delhi | Sakshi
Sakshi News home page

షకీల్ అహ్మద్ స్థానంలో పీసీ చాకో

Published Thu, Nov 27 2014 9:48 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పీసీ చాకో(ఫైల్) - Sakshi

పీసీ చాకో(ఫైల్)

న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ పర్యవేక్షకుడిని మార్చింది. సీనియర్ నాయకుడు పీసీ చాకోను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమించింది. ప్రస్తుత్వం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యక్తిగత కారణాలతో సెలవు కోరడంతో ఈ మార్పు జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

వ్యక్తిగత పనుల నిమిత్తం డిసెంబర్ 28 నుంచి మార్చి 7 వరకు విదేశాలకు వెళుతున్నట్టు అధిష్టానికి షకీల్ అహ్మద్ సమాచారం ఇచ్చినట్టు తెలిపాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement