
ఈ ఫలితాలు బీజేపీకి హెచ్చరికలే
ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్
న్యూఢిల్లీ: దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఫలితాలు పాలకపక్షమైన బీజేపీకి ప్రమాద హెచ్చరికలేనని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. మోదీ ప్రభుత్వం వచ్చిన వందరోజుల్లోనే ప్రజావ్యతిరేకత ఏర్పడిందని, మోదీ ప్రభుత్వ వైఖరిని, బీజేపీ వ్యవహారశైలిని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు.
అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏర్పడటం ఇదే తొలిసారని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ తాజా ఉపఎన్నికల్లో సాధించిన ఫలితాలు గణనీయమైనవేనని అన్నారు. ఇకపై పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషిచేస్తామన్నారు.