‘ఇది శుష్కవాగ్దానాల నిరర్థక ప్రభుత్వం’ | ongress fire on bjp govt | Sakshi
Sakshi News home page

‘ఇది శుష్కవాగ్దానాల నిరర్థక ప్రభుత్వం’

Published Thu, Sep 18 2014 2:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ongress fire on bjp govt

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ గత వందరోజుల్లో దుష్పరిపాలనకు పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలో  ఒక పుస్తకాన్ని వెలువరించింది. మోదీ ప్రభుత్వం-వందరోజుల దుష్పరిపాలన అన్న శీర్షికతో రూపొందించిన పుస్తకాన్ని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన ఉపఎన్నికల ఫలితాలు, నిరర్థక ప్రభుత్వ శుష్క వాగ్దానాలపై ప్రజాగ్రహాన్ని ప్రతిఫలిస్తున్నాయని కాంగ్రెస్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

ప్రధాని మోదీ కలల భేహారి పాత్ర మాత్రమే పోషించారని వందరోజుల పాలన రుజువు చేసిందని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినా, ఉపఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ముప్పుగా పరిణమించాయని, బీజేపీ ముసుగు క్రమంగా తొలగిపోయే సూచనలున్నాయని పుస్తకం పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement