
ఇక ముందంతా వర్షాభావమే
న్యూఢిల్లీ: రుతపవనాల ఆగమనం ఆలస్యంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటన రైతన్నల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దక్షిణ భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉండవచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాలపై దీని ప్రభావం ఉంటుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అరేబియా మహాసముద్రంలో నెలకొన్న యాంటీ సైక్లోన్ ప్రభావం నేపథ్యంలోనే ఈ పరిణామం ఏర్పడుతోందని వాతావరణ విభాగం తెలిపింది.
వాతావరణ శాఖ అంచనాలు వల్ల నిజంకాకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
మరోవైపు అసలే అకాల వర్షాలు, కరువుతో అల్లాడిపోతున్న రైతులోకానికి ఇది పిడుగులాంటి వార్త అని వాతావరణ శాఖ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాగల సంవత్సరానికి వర్షపాతం శాతం 93 నుంచి 88 కనిష్టానికి పడిపోతుందనే అంచనా మరింత ఆందోళన కలిగిస్తోందంటున్నారు. దీని ప్రభావం వర్షాధారంగా సాగే ఖరీఫ్ సాగుపై ఎక్కువగా ఉంటుందంటున్నారు.