తమ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక స్థానాలు కట్టబెట్టినందుకు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
తమ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక స్థానాలు కట్టబెట్టినందుకు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయగలమన్న విశ్వాసం తమకుందని చెప్పినా.. ప్రభుత్వం ఏర్పాటుపై విలేకరులు వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.
అలాగే, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు ఆయన అభినందనలు తెలిపారు. అంచనాలను మించి ఆయన పార్టీ మంచి విజయాలు సాధించిందని చెప్పారు. 15 సంవత్సరాల పాటు ఢిల్లీకి సేవలు అందించినందుకు షీలా దీక్షిత్కు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కృష్ణానగర్ స్థానం నుంచి 43 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తనను గెలిపించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు గాను ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.