బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్పై విరుచుకుపడ్డ కేజ్రీవాల్ | Politician Kejriwal hits out at BJP's Harsh Vardhan | Sakshi
Sakshi News home page

బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్పై విరుచుకుపడ్డ కేజ్రీవాల్

Published Wed, Oct 23 2013 3:11 PM | Last Updated on Tue, Oct 9 2018 4:27 PM

బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్పై విరుచుకుపడ్డ కేజ్రీవాల్ - Sakshi

బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్పై విరుచుకుపడ్డ కేజ్రీవాల్

భారతీయ జనతా పార్టీ న్యూఢిల్లీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విరుచుకు పడ్డారు. 'హర్షవర్ధన్ ఢిల్లీ మన్మోహన్ సింగ్' అని కేజ్రీవాల్ అభివర్ణించారు. కేంద్రం ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలలో అవినీతిని కట్టడి చేయడంలో ప్రధాని మన్మోహన్ ఎలా విఫలమైయ్యారో,  అలాగే న్యూఢిల్లీ నగరపాలక సంస్థలో అవినీతిని  హర్షవర్దన్ అరికట్టలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

 

ఓ విధంగా చెప్పలంటే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ ఏలాగో భారతీయ జనతాపార్టీ న్యూఢిల్లీ శాఖలో హర్షవర్ధన్ అలా అని ఆయన సోదాహరణగా వివరించారు. బీజేపీకి అంటిన అవినీతి రంగును తుడుచుకునేందుకే హర్షవర్దన్ను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చారని కేజ్రీవాల్ ఆరోపించారు.

 

2010 నాటి ఎన్నికల్లో న్యూఢిల్లీ సీఎంగా విజయకేతనం ఎగురువేసిన షీలా దీక్షిత్ను హర్షవర్ధన్ మొచ్చుకున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాంటి హర్షవర్ధన్ ఇప్పుడు ఏలా షిలా దీక్షిత్ పై పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం తన అభిప్రాయాన్ని అరవింద్ కేజీవ్రాల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement