ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేదిని ఆ పదవి నుంచి తొలగించడం సబబైన చర్యేన ని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేదిని ఆ పదవి నుంచి తొలగించడం సబబైన చర్యేన ని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. చీఫ్ విజి లెన్స్ అధికారి పదవికి అతడు అనర్హుడని హర్షవర్ధన్ అన్నారు. కేంద్ర విజి లెన్స్ కమిషన్‌కు సమాచార మివ్వకుండా ఎక్కడా సీవీవోను నియమించకూడదని ఆయన చెప్పారు. చతుర్వేది నియామకం నిబంధనలకు విరుద్ధం గా జరిగిందని భావించడం వల్లే తాము అతడిని పదవి నుంచి తొలగించినట్లు తెలి పారు.
ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికా రి పదవి నుంచి తొలగిస్తూ బుధవా రం కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఎటువంటి కారణాలు చూపకుండానే ఈ చర్య తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చతుర్వేది బాధ్యతలను కేంద్ర ఆరోగ్యశాఖ సీవీ వో, జాయింట్ సెక్రటరీ అయిన విశ్వాస్ మెహతాకు అప్పగించారు. మూడు నెలల పాటు ఆయన ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆ శాఖ పేర్కొంది.