
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర పరిశోధనల్లో భారత్‌ను 2030 నాటికి ప్రపంచంలోనే టాప్–3 దేశాల్లో ఒకటిగా నిలిపేందుకు కృషి చేయాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)ను ఆయన సందర్శించారు.
ప్రయోగశాలల్లో జరిగే పరిశోధనలను సమాజానికి ఉపయోగపడేలా మార్చాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశంలోని 100 వెనుకబడిన జిల్లాలతో పాటు ఈశాన్య భారత్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ జిల్లాల్లోని ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని కోరారు. తాగు, సాగునీటి కొరతపై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల సీఎస్‌ఐఆర్ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలకుగాను సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ వి.ఎం.తివారీ నేతృత్వంలోని యువ శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment