బీజేపీదే అధికారం: హర్షవర్ధన్
Published Thu, Dec 5 2013 11:46 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఆప్‌ల కంటే తామే ముందున్నామని భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ అన్నారు. ఆయన బుధవారం ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఆప్ కంటే బీజేపీ ఎంతో ముందుంది. ఆ రెండు పార్టీలూ రెండోస్థానం కోసమే పోటీపడుతున్నాయి. మా ఓటుబ్యాంక్‌ను ఎవరూ కొల్లగొట్టలేరని అన్నారు. ఆయన కృష్ణనగర్ నియోజకవర్గంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఛత్తిడ్‌గఢ్ వంటి గిరిజన రాష్ర్టంలో ఓటింగ్ శాతం 74.77 ఉంటే, ఢిల్లీ లాంటి ప్రాంతంలో 80 శాతం ఎందుకు ఉండటంలేదో అర్ధం కావడంలేదన్నారు.. ఈ విషయమై ఢిల్లీవాసుల్లో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement