దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిపై కేసు | Case file against Durgabai Deshmukh hospital | Sakshi
Sakshi News home page

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిపై కేసు

Published Fri, Sep 29 2017 7:02 PM | Last Updated on Fri, Sep 29 2017 7:02 PM

Case file against Durgabai Deshmukh hospital

సాక్షి, హైదరాబాద్‌: ఏడో తరగతి విద్యార్థికి ఫంగస్‌ ఉన్న సెలైన్‌ ఎక్కించిన ఘటనలో ఓ ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాంనగర్‌కు చెందిన మనోహర్‌ లింగం కుమారుడు వంశీకృష్ణ(12)కి ఫిట్స్‌ రావడంతో  దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అతడికి ఫంగస్‌ ఉన్న సెలైన్‌ ఎక్కించారు. బాలుడు మరింత అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు వైద్యులను నిలదీసినప్పటికీ వారు స్పందించలేదు. దీంతో వంశీ మేనమామ శ్రీనివాస్‌ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆస్పత్రిపై ఐపీసీ 336 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని నల్లకుంట సీఐ యాదగిరిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement