ఫంగస్ సోకిన సెలైన్ బాటిళ్లు
కర్నూలు, బనగానపల్లె: బనగానపల్లె ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో శనివారం రాత్రి ఓ రోగికి ఎక్కించేందుకు సిబ్బంది ఫంగస్ సోకిన సెలైన్ బాటిళ్లను తీసుకురాగా బంధువు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పంచమపేటకు చెందిన కొత్తమిద్దె మహేష్ వాంతులు, విరేచనాలతో శనివారం రాత్రి 10.30గంటల సమయంలో ఆస్పత్రిలో ఇన్‌పెషంట్‌గా చేరారు. డ్యూటీ డాక్టర్ అతడిని పరీక్షించి మందులు, సెలైన్ బాటిళ్ల ఎక్కాల్సిందిగా కేషీట్‌లో రాశారు.
అయితే సిబ్బంది ఫంగస్ సోసిన విషయాన్ని గమనించకుండానే రోగికి ఎక్కించేందుకు బాటిళ్లు తీసుకొచ్చారు. రోగి వెంట వచ్చిన రాము ఫంగస్ సోకిన సెలైన్ బాటిళ్లను గుర్తించి వీటిని ఏలా ఎక్కిస్తారంటూ ప్రశ్నించాడు. చూడకపోయిఉంటే అలాగే ఎక్కించే వారు కదా అని వాగ్వాదానికి దిగాడు. అనంతరం రాము 1100కు పోన్‌చేసి ఫంగస్ సోకిన బాటిళ్లను తనవెంట తీసుకెళ్లాడు. ఈ విషయం పై డ్యూటీ డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ఇందులో తన తప్పు ఏమీలేదన్నారు. తాను రాసిన మందులను రోగులకు వినియోగించడంలో సంబంధిత వార్డు డ్యూటీ సిబ్బంది చూసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment