Saline Bottle
-
భారీ మోసం: సెలైన్ నింపి రెమిడెసివిర్‌గా బురిడీ
నిజామాబాద్ అర్బన్: రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఖాళీ బాటిల్లో సెలైన్ వాటర్ నింపి బ్లాక్‌లో రూ.30 వేలకు విక్రయించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన మహేశ్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇటీవల కరోనా వైరస్ సోకగా ఆర్మూర్‌లోని లైఫ్‌లైన్ ఆస్పత్రిలో ఈనెల 22న చేరాడు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తీసుకెళ్లిపోవాలని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో బాధితుడి బంధువులు మహేశ్‌ను నిజామాబాద్‌లోని అంకం ప్రైవేటు ఆస్పత్రిలో ఈ నెల 24న చేర్చారు. అక్కడి వైద్యులు రెమిడెసివిర్ ఇంజెక్షన్ తెచ్చుకోవాలని చెప్పడంతో.. మహేశ్ తమ్ముడు రంజిత్ ఇంజెక్షన్ల కోసం ఆర్మూర్‌లోని లైఫ్‌లైన్ ఆస్పత్రిని సంప్రదించాడు. అక్కడి వైద్యుడు సాయికృష్ణనాయుడు నిజామాబాద్‌లోని శ్రీకాంత్‌గౌడ్‌ను కలవాలని సూచించాడు. నిజామాబాద్‌లోని తిరుమల ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీకాంత్‌గౌడ్ రోజువారీ వేతనంతో మేల్ స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నాడు. శ్రీకాంత్‌గౌడ్‌ను రంజిత్ కలవగా రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఒక్కోటి రూ.30 వేలు ఉంటుందని చెప్పాడు. గత్యంతరం లేక మూడు ఇంజెక్షన్లను రూ.90 వేలకు కొనుగోలు చేశాడు. అనంతరం మళ్లీ మరో 3 ఇంజెక్షన్లను రూ.90 వేలకు కొన్నాడు. రెండోసారి కొనుగోలు చేసిన మూడు ఇంజెక్షన్లు నకిలీవని అంకం ఆస్పత్రి వైద్యుడు అనుమానించాడు. ఆ ఇంజెక్షన్లు వాడినట్లు మార్క్‌లు కన్పించడంతో పరిశీలించి అందులో సెలైన్ వాటర్ ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని కరోనా బాధితుడు మహేశ్‌కు తెలిపాడు. మహేశ్ తన తమ్ముడు రంజిత్‌కు చెప్పగా, ఆయన వెళ్లి శ్రీకాంత్‌గౌడ్‌ను నిలదీశాడు. దీంతో ఆ మూడు ఇంజెక్షన్ల డబ్బులు వెనక్కి ఇచ్చేశాడు. అయితే ఈ సంఘటనపై ఒకటో టౌన్ పోలీసులకు రంజిత్ ఈ నెల 26న ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తిరుమల ఆస్పత్రిపై దాడి చేసి శ్రీకాంత్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజం ఒప్పుకొన్నాడు. తిరుమల ఆస్పత్రిలో వాడిపారేసిన రెమిడెసివిర్ ఖాళీ బాటిల్లో నిందితుడు సెలైన్ వాటర్ నింపినట్లు గుర్తించారు. లైఫ్‌లైన్ ఆస్పత్రి వైద్యుడు సాయికృష్ణనాయుడు, ఇంజెక్షన్లు విక్రయించిన శ్రీకాంత్‌గౌడ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మూడు నకిలీ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎంతమందికి సెలైన్ వాటర్‌ను రెమిడెసివిర్ ఇంజెక్షన్లుగా విక్రయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. . చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. నిజామాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సెలైన్ వాటర్‌తో నింపిన రెమెడిసివర్ వ్యాక్సిన్ -
ప్రభుత్వాస్పత్రిలో ఫంగస్ సోకిన సెలైన్
కర్నూలు, బనగానపల్లె: బనగానపల్లె ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో శనివారం రాత్రి ఓ రోగికి ఎక్కించేందుకు సిబ్బంది ఫంగస్ సోకిన సెలైన్ బాటిళ్లను తీసుకురాగా బంధువు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పంచమపేటకు చెందిన కొత్తమిద్దె మహేష్ వాంతులు, విరేచనాలతో శనివారం రాత్రి 10.30గంటల సమయంలో ఆస్పత్రిలో ఇన్పెషంట్గా చేరారు. డ్యూటీ డాక్టర్ అతడిని పరీక్షించి మందులు, సెలైన్ బాటిళ్ల ఎక్కాల్సిందిగా కేషీట్‌లో రాశారు. అయితే సిబ్బంది ఫంగస్ సోసిన విషయాన్ని గమనించకుండానే రోగికి ఎక్కించేందుకు బాటిళ్లు తీసుకొచ్చారు. రోగి వెంట వచ్చిన రాము ఫంగస్ సోకిన సెలైన్ బాటిళ్లను గుర్తించి వీటిని ఏలా ఎక్కిస్తారంటూ ప్రశ్నించాడు. చూడకపోయిఉంటే అలాగే ఎక్కించే వారు కదా అని వాగ్వాదానికి దిగాడు. అనంతరం రాము 1100కు పోన్‌చేసి ఫంగస్ సోకిన బాటిళ్లను తనవెంట తీసుకెళ్లాడు. ఈ విషయం పై డ్యూటీ డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ఇందులో తన తప్పు ఏమీలేదన్నారు. తాను రాసిన మందులను రోగులకు వినియోగించడంలో సంబంధిత వార్డు డ్యూటీ సిబ్బంది చూసుకోవాలన్నారు. -
గాంధీ ఆస్పత్రిలో దారుణం..
-
సెలైన్‌లో ఫంగస్
సాక్షి, హైదరాబాద్: సరోజినిదేవి ఆస్పత్రిలో ఫంగస్ ఉన్న సెలైన్‌తో కళ్లను శుభ్రం చేయడంతో ఏడుగురి కళ్లుపోయిన ఘటనను మరచిపోక ముందే తాజాగా హైదరాబాద్ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనే జరిగింది. అనారోగ్యంతో వచ్చిన ఓ బాలుడికి ఫం గస్ ఉన్న సెలైన్ ఎక్కించారు. దీన్ని గుర్తించిన బాలుడి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన మనోహర్లింగం కుమారుడు వంశీ(11)కి ఫిట్స్ రావడంతో సమీపంలోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు సెలైన్ ఎక్కించాల్సిందిగా సూచించారు. ఆస్పత్రి సిబ్బంది సెలైన్ బాటిల్ పరిశీలించకుండానే ఎక్కించారు. పక్కనే ఉన్న తల్లిదండ్రులు, బంధువులు సెలైన్ బాటిల్‌ను పరిశీలించగా అందులో ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశంపై సదరు ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా వారి నుంచి కనీస స్పందన రాలేదు. ఆగ్రహించిన రోగి బంధువులు నల్లకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఐపీసీ 336 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 'సెలైన్' బంద్
‘సరోజినీ’ ఎఫెక్ట్ * ఆ బాటిళ్లు వాడొద్దని సర్కారు ఉత్తర్వులు * బయట నుంచి తెచ్చుకుంటున్న రోగులు * ఆర్థికంగా నష్టపోతున్న బాధితులు భువనగిరి : సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఘటన ప్రభావం జిల్లా ఆస్పత్రులపై పడింది. సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఆర్ఎస్, సాధారణ సెలైన్ బాటిళ్లను రోగులకు ఎక్కించవద్దని ప్రభుత్వ ఆదేశాలు అందాయి. దీంతో రోగులకు అవసరమైన సెలైన్ బాటిళ్లను బయట తెచ్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో నిల్వ ఉన్న సెలైన్ బాటిళ్లను ఎక్కించడం లేదు. హైదరాబాద్ సరోజినీ దేవి ఆస్పత్రి ఘటనలో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలోని గ్లూకోజ్ బాటిళ్ల శాంపిల్స్ సేకరించారు. వాటిలో ఫంగస్ లణాలు కన్పించడంతో వెంటనే వాటి వాడకం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క జిల్లాలో కురుస్తున్న ముసురు వర్షాలు, చల్లని గాలులతో జన ం వైరల్ ఫీవర్, అతిసార, టైఫాయిడ్, ఇతర రోగాల బారిన పడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో అస్పత్రుల్లో చేరిన వారికి ముందుగా సె లైన్ బాటిళ్లను ఎక్కిస్తారు. అనంతరం వైద్యం అందిస్తారు. అయితే సరోజినీ కంటి ఆస్పత్రి ఘనతో అస్పత్రుల్లో సైలైన్లు ఎక్కించడానికి బయట మెడికల్ దుకాణాల నుంచి కొనుగోలు చేసుకోవాలని వైద్యులు చీటీలు రాస్తున్నారు. దీంతో రోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. జిల్లా అంతటా హసీబ్ కంపెనీ ఫ్లూయిడ్స్... హైదరాబాద్ సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో రోగుల కళ్లు పోవడానికి కారణమని భావిస్తున్న హసీబ్ పార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన సెలైన్ బాటిళ్లు జిల్లా అస్పత్రుల్లో ఉన్నాయి. జిల్లాలోని 72 పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలో 200 పడకలు, నాగార్జున సాగర్‌లో 150 పడకలు, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడల్లో 100 పడకలు, దేవరకొండ, రామన్నపేట, హుజూర్‌నగర్‌లో 50 పడకలు, చౌటుప్పల్, ఆలేరు, నకిరెకల్లో 30 పడకల ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో హసీబ్ కంపెనీకి చెందిన ఆర్ఎల్, ఎన్ఎస్ గ్లూకోజ్ బాటిళ్లను వాడుతున్నారు. ఆ కంపెనీకి చెందిన గ్లూకోజ్ బాటిళ్లలో ఫంగస్ (బూజు) రావడంతో రోగులకు కళ్లుపోయాయని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉన్న స్టాక్ ఈ సెలైన్ల వాడకం ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఆదేశాలు అందాయి. రోగులపై భారం.. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో జిల్లాలో వందలాది మంది మంచాన పడుతున్నారు. దగ్గు, జలుబు, చలిజ్వరం, అతిసార, డయేరియా వంటి వ్యాధులు సోకుతున్నాయి. ఈ పరిస్థితిలో రోగులకు అత్యంత అవసరమైన గ్లూకోజ్ బాటిళ్లు ప్రభుత్వ అస్పత్రుల్లో అందుబాటులో లేకుండా పోయాయి. ఒక్కోసారి రోగికి 5 నుంచి 20 బాటిళ్ల వరకు ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలమంది రోగులకు బయట నుంచి కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. తప్పని సరిపరిస్థితిలో వందలాది రూపాయలు గ్లూకోజ్ బాటిళ్ల కోసం ఖర్చు చేయాల్సివస్తోంది.